ప్రారంభోత్సవాలతో కేసీఆర్ బిజీ బిజీ..
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న రెండు పడక గదుల ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం, ఉపాధిమార్గాలను చూపే పలు సంస్థలను సీఎం జాతికి అంకితం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉగ్రవాదులకు నివాసంగా మహానగరం..!
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే భాగ్యనగరం ఉగ్రవాదులకు నివాసంగా మారుతోంది. పలువురు ఏళ్ళ తరబడి ఇక్కడే తిష్టవేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నగరంలో అడుగడుగునా సీసీటీవీలు, సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ... ఉగ్రవాదులను పట్టుకోలేకపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆనాడే హెచ్చరించా.!
పోతిరెడ్డిపాడు మీద మొదట పోరాటం చేసింది... అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొట్లాడింది... పి.జనార్దన్ రెడ్డినేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణశాసనమని ఆనాడే పీజేఆర్ హెచ్చరించారన్నారు. పీజేఆర్ చనిపోయిన తరువాత తెలంగాణ తరపున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రవ్యాప్తంగా భాజపా పాదయాత్ర
కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రాష్ట్రవ్యాప్తంగా మహాపాదయాత్ర చేపడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) తెలిపారు. హుజూరాబాద్‌లో తెరాసను ఓడించి, ఈటలను (Etela) గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా అడ్డుకున్నా ఒక్కటయ్యారు.!
దేశాలు వేరైనా, అభిరుచులు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లికి ఒప్పించారు. ఇక పెళ్లికి ముహూర్తమే ఆలస్యమనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి విలన్ రూపంలో వారి పెళ్లికి అడ్డంకిగా మారింది. విదేశాలకు రాకపోకల విషయంలో ఆంక్షలు విధించినా.. అన్ని అవరోధాలను దాటుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ జంట. అదెలాగంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.