తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM - Top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM

By

Published : May 31, 2021, 2:59 PM IST

  • ఆన్​లైన్ తరగతులు వాయిదా..

రాష్ట్రంలో రేపు ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్​లైన్ తరగతులు వాయిదాపడ్డాయి. సవరించిన షెడ్యూల్‌ను సాయంత్రంలోగా ఇంటర్ బోర్డు వెల్లడించనుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆనందయ్య మందుకు గ్రీన్‌సిగ్నల్‌..

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఆయుర్వేద మందు(anandaya medicine)కు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్‌) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కర్ఫ్యూ పొడిగింపు..

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • సోనూసూద్ మరో సాయం..

కరోనా కష్టకాలంలో అడిగిందే తడవుగా సహాయం అందించే సోనుసూద్ మరో కొత్త కార్యక్రమం తలపెట్టారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఫ్రీజర్ బాక్సులను(శవపేటికలను) పంపించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • 27 రైళ్లు రద్దు..

జూవ్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. ప్రయాణికుల రద్దీ లేని కారణంగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మరోసారి మృతదేహాల కలకలం..

ఉత్తర్​ ప్రదేశ్​లోని గంగానదిలో మరోసారి మృతదేహాలు కొట్టుకురావటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఒడ్డున పూడ్చిపెట్టిన శవాలు నీళ్లలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ట్విట్టర్​కు హైకోర్టు షాక్!

నూతన ఐటీ నిబంధనలు ట్విట్టర్ పాటించాల్సిందేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నియమాలను ట్విట్టర్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • PF ఖాతాదారులకు అలర్ట్..

పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానించే గడువు నేటితో ముగియనుంది. జూన్ 1 నుంచి ఈ బాధ్యత ఉద్యోగి యజమానిపై పడనుంది. ఒకవేళ యజమాని ఆధార్ అనుసంధానం చేయకపోతే.. పీఎఫ్ ఖాతా ఎలక్ట్రానిక్ ఛలాన్లు నిలిచిపోతాయి. యజమాని వాటా సైతం ఆగిపోతుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • బయటకు వస్తోన్న సుశీల్ నేరాలు!

రెజ్లర్​ సాగర్​ హత్య కేసు దర్యాప్తు వేగం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే అరెస్టయిన రెజ్లర్ సుశీల్ నేర స్వభావ ఘటనలు క్రమక్రమంగా బయటపడుతున్నాయి.​ పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • పెళ్లి పీటలెక్కిన ప్రణీత..

హీరోయిన్ ప్రణీతా సుభాష్ పెళ్లీ పీటలెక్కింది. వ్యాపారవేత్త నితిన్ రాజును అతికొద్ది మంది సమక్షంలో మనువాడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details