తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
TOP TEN NEWS @3PM

By

Published : Apr 15, 2021, 2:56 PM IST

  • భక్తులు లేకుండా శ్రీరామనవమి వేడుకలు..

ఏకాంతంగా భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. భక్తులు లేకుండా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నోటిఫికేషన్‌ విడుదల..

మినీ పుర పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ పురపాలికల ఎన్నికలకు సర్వం సిద్దమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చరిత్రను కాపాడుదాం..

చారిత్రక కట్టడాల అభివృద్ధిపై కమిటీ ఏర్పాటు చేసి, ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 22లోగా కమిటీ తొలి భేటీ జరగాలని... చారిత్రక కట్టడాల అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచండి..

కొవిడ్​ రోగులకు పడకలు పెంచాలని అధికారులకు సీఎస్ సోమేశ్​కుమార్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొవిడ్​ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెరిగేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేసీఆర్‌ను వదలబోం..

హైదరాబాద్ ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో షర్మిల దీక్షకు పూనుకున్నారు. సాయంత్రం 5 వరకు ఈ దీక్ష కొనసాగనున్నది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కఠిన ఆంక్షల నడుమ 'మహా'నగరాలు..

మహారాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ తరహా ఆంక్షలు అమల్లోకి వచ్చాక నగరాలన్నీ బోసిపోయాయి. ముంబయి, పుణె, నాగ్​పుర్​లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కూరగాయల మార్కెట్లో మాత్రం రద్దీ విపరీతంగా ఉంటోంది. మరోవైపు కొవిడ్ ఆంక్షల భయంతో వలస కూలీలు సొంతూళ్లకు తరలిపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సుప్రీం జడ్జి నివాస సిబ్బందికి కరోనా..

సుప్రీం కోర్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే కోర్టులోని 40 మందికిపైగా కరోనా సోకగా.. తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా అధికారిక నివాసంలోని సిబ్బంది అందరికీ వైరస్​ పాజిటివ్​గా తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ..

దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం.. వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రివాల్ ప్రకటించారు. దిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలో బుధవారం 17, 282 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోహ్లీ ఔట్.. యాదృఛ్ఛికమేనా!

ఐపీఎల్​లో భాగంగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ కోహ్లీ ఇలాగే ఔటవ్వడం ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మనం మరిచిపోయేలా చేసే సినిమా ఇది!

ఆంటోనీ హాఫ్కిన్స్‌ కళ్లు చెదిరే నటనతో, ఊపిరి సలపని స్క్రీన్‌ప్లేతో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలిచింది 'ది ఫాదర్‌'. విమర్శకుల ప్రశంసలతో పాటు.. ఆస్కార్‌ పోరులో బలమైన సినిమాగా నిలిచింది. హృదయాన్ని కదిలించే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని.. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీదారుగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details