- బోనమెత్తిన భాగ్యనగరం..
ఊరూవాడా అంతా కలిసి సంబురంగా జరుపుకునే బోనాల పండుగు ఇవాళే షురూ అయింది. ప్రతిఏడులాగే ఈ ఏడు ఈ ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమయ్యాయి. భక్తులు.. జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కరోనా నిబంధనలు పాటించేలా చూస్తూ.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో జోరు వాన..
రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిరు జల్లులో అధికారులు..
పచ్చని అటవీ ప్రాంతంలో... వాన చినుకులు కురుస్తున్న వేళ వావ్ ఎంత బాగుంటుందో కదా. ఆ ప్రకృతి అందాలకు సీనియర్ సివిల్ సర్వీస్ మహిళా అధికారులు స్మితా సబర్వాల్, క్రిస్టినా, ప్రియాంక వర్గీస్ ముగ్ధులయ్యారు. అందుకే ఆ చిరుజల్లుల్లో తడిసి మురిసిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ దారిలో ప్రయాణం.. ఆహ్లాదకరం..
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పచ్చదనం తాండవిస్తోంది. రహదారికి ఇరువైపులా కనువిందు చేస్తున్న వృక్షాలు.. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల మెుక్కల పెంపకం సరిగా నిర్వహించడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంత్యక్రియలకు ఏర్పాట్లు..
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన కత్తి మహేశ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత కాన్సులేట్ మూసివేత!