- లంకెబిందెల్లో 5 కిలోల బంగారం..
జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందెలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు అవాక్కయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హైకోర్టు అసంతృప్తి..
కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై వైద్యారోగ్యశాఖ, కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ వేర్వేరుగా నివేదికలు సమర్పించగా.. హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిధుల కొరత వల్లే..
గోల్నాక నుంచి రామంతపూర్ వరకు ఫ్లైఓవర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా, జీహెచ్ఎంసీ నిధుల కొరత కారణంగా ఆలస్యం అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 500 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం..
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 14 ఏళ్ల బాలుడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీపంలోని నందగ్రామ్‌లో ఓ మహిళపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫుట్‌పాత్ దుకాణాదారుల కొట్లాట..
చార్మినార్ వద్ద ఫుట్‌పాత్ దుకాణాదారులు దాడులు చేసుకున్నారు. స్థలం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 11 గంటలకు పోలింగ్ శాతమిలా..