1. పర్వత యుద్ధతంత్రంలో భారత్ మేటి.!
గల్వాన్ లోయలో చైనాతో జరిగిన భీకర పోరులో భారత సైన్యం మరోమారు తన ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటిచెప్పింది. పర్వత యుద్ధతంత్రంలో ప్రపంచంలోనే అత్యుత్తమైన దళం భారత్ వద్ద ఉంది అని సాక్షాత్తూ చైనా సైనిక నిపుణుడు హువాగ్ గ్వాజీ చెప్పారు. అసలు భారత్ తన సైన్యాన్ని ఇంత పటిష్టంగా ఎలా తీర్చిదిద్దగలిగింది? పర్వత యుద్ధతంత్రంలో ప్రావీణ్యం ఎలా సంపాదించింది?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. త్రైపాక్షిక చర్చలు
భారత్, చైనా, రష్యా మధ్య నేడు త్రైపాక్షిక కూటమి సమావేశం జరగనుంది. ఇందులో మూడు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. కరోనా వైరస్ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అయితే భారత్- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. లద్దాఖ్‌లో సైన్యాధిపతి
భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి నరవాణే లద్ధాఖ్‌కు ఈ రోజు వెళ్లనున్నారు. అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మాటల యుద్ధం
భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ అంశంపై అధికార, విపక్ష నేతల మధ్య మాటలు, ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందా? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ హయాంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ, హస్తం పార్టీల మధ్య అలాంటి ఒప్పందం కుదిరిందని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మోదీ విధానాలతోనే సంక్షోభం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. కరోనా వైరస్ సహా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేతలు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ ప్రభుత్వం చేపట్టే విధానాలే కారణమని ఆరోపించారు సోనియా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.