తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

By

Published : May 31, 2021, 5:00 PM IST

  • సెలవులు పొడిగింపు..

రాష్ట్రంలో పాఠశాలలు, ఇంటర్ కాలేజీల వేసవి సెలవులు జూన్ 15వరకు పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాయంత్రంలోగా దీనిపై ఉత్తర్వులు వెలుపడే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • బ్యాంకుల పనివేళల్లో మార్పులు..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమయాలను పొడిగించడంతో రేపటి నుంచి బ్యాంకుల పని వేళలు మారనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని బ్యాంకులు పని చేస్తాయని ఎస్‌ఎల్‌బీసీ స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కఠినంగా లాక్‌డౌన్‌..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు మేరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • భార్యతో గొడవపడి... విద్యుత్​ వైర్లు పట్టుకుని..

మద్యానికి డబ్బుల కోసం భార్యతో గొడవపడి విద్యుత్ తీగలు పట్టుకున్నాడు. దీంతో విద్యుత్​షాక్​ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌ మలక్‌పేటలో చోటు చేసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ప్రేమించలేదని ఉన్మాదం..

యువతిని ప్రేమించమంటూ ఆమెకు కాబోయే భర్తపై ఓ ఉన్మాది కత్తితో దాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించటంతో పాటు ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో జరిగింది.పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • సీఎంల మాటల యుద్ధం..

వ్యాక్సినేషన్​పై దేశంలోని ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీకా నిర్వహణ సరిగ్గా చేపట్టాలని ఒకరు హితవు పలికితే.. మేం వ్యాక్సిన్లనేమీ దాచుకోవడం లేదని మరొకరు మండిపడ్డారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కొత్త వేరియంట్లకూ చెక్!

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో బహుళ వేరియంట్లను సైతం సమర్థంగా నిరోధించే ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • పెరిగిన బంగారం ధర..

పసిడి ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.48,608 చేరింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ధోనీ సలహాతో రెచ్చిపోతున్నా!

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ(MS Dhoni) ఇచ్చిన ఓ సలహా ఇప్పటికీ తనకు ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా (Jadeja) అన్నాడు. షాట్ల ఎంపిక బాగా లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సలహా ఇచ్చి తన బ్యాటింగ్​ మెరుగు పడేందుకు ధోనీ సహాయపడ్డానని తెలిపాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • అజాగ్రత్తగా ఉండొద్దు..

కరోనా సెకండ్​ వేవ్​లో ఎక్కువ శాతం కేసులు నమోదైనప్పటికీ దేశ జనాభాతో పోల్చితే చాలా తక్కువన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి (s.s rajamouli). మూడో దశలో ఎవరికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది, ఎలా అప్రమత్తమవ్వాలనే అంశాలపై లిటిల్ స్టార్ హెల్త్ కేర్ వైద్యులు డాక్టర్ జి.సతీష్​తో వర్చువల్ పద్ధతిలో రాజమౌళి ప్రత్యేకంగా చర్చించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details