ఇంకా అనుమతులు రాలేదు
కరోనా మందుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై కృష్ణపట్నం ఆనందయ్య స్పందించారు. తన మందుకు ఇంకా అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు ప్రస్తుతం సిద్దంగా లేవని వెల్లడించారు. ఎవరూ వదంతులు నమ్మి కృష్ణపట్నం గ్రామానికి రావొద్దని కొరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోసారి దర్యాప్తు
కరోనా మహమ్మారి మూలాలపై మరోసారి దర్యాప్తు చేపట్టాలన్న ప్రపంచ దేశాల డిమాండ్‌కు భారత్ మద్దతు పలికింది. ఈ విషయంపై విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పరువు హత్య
కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో జరిగింది. గ్రామంలో ఓ యువతిని ధనశేఖర్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ధనశేఖర్‌ను యువతి తండ్రి బాబు దారుణంగా హతమార్చాడు. బాబు పొలంలోనే ధనశేఖర్ మృతదేహం లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వెదర్ రిపోర్ట్
రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మోదీ, మమతా భేటీలో హైడ్రామా!
బంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో మమతా బెనర్జీ భేటీకి ముందు హైడ్రామా నెలకొంది. యాస్ తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష సమావేశం నిర్వహించగా.. ఆలస్యంగా వచ్చారు దీదీ. సుమారు 30 నిమిషాలపాటు మోదీని వెయిట్ చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.