తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - తెలంగాణ ప్రధాన వార్తలు

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Sep 14, 2021, 5:53 AM IST

Updated : Sep 14, 2021, 10:10 PM IST

22:06 September 14

టాప్​ న్యూస్​ @ 10 PM

14,400 మంది ఖాతాల్లో దళిత బంధు నిధులు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో దళిత బంధు పథకం (Dalitha bandhu) కింద నిధులు జమచేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే సర్వే పూర్తి కాగా వలస వెళ్లిన వారి కుటుంబాలు.. తొలిదశలో మిగిలి పోయిన వారి వివరాలను సేకరించే అంశంపై దృష్టిని సారించింది. మొత్తం 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమచేసింది. ఒక్కొక్కరి ఖాతాలో 10 లక్షల చొప్పున జమచేసింది.   

పట్టిస్తే రూ. 10 లక్షలు

బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.  సమాచారాన్ని 94906 16366 నంబర్‌కు లేదా 94906 16627 నంబర్‌కు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని ఇంకా పట్టుకోకపోవటంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు.
 

మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం

వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్​ (Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిర్వహకులు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించనున్నట్లు కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. 

మావోయిస్టు​ అరెస్ట్​

ఒడిశా పోలీసులు దుబాషీ శంకర్​ అనే మావోయిస్టును అరెస్టు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై రూ. 20లక్షల రివార్డు ఉంది. గతంలో అనేకమార్లు భద్రతాదళాలపై భీకర దాడులకు పాల్పడ్డాడు శంకర్​.


మరో 15వేల కరోనా కేసులు

కేరళలో కొత్తగా 15,876 కరోనా కేసులు నమోదయ్యాయి. 25వేల మందికిపైగా కొవిడ్​ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఒడిశాలో (Corona Update) కొత్తగా 428 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి.

చైనా ఉక్కుపాదం!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కఠిన ఆంక్షలను విధించే చైనా.. న్యాయం చేయాలంటూ వస్తున్న మహిళలపై సైతం అదే పంథాను కొనసాగిస్తోంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని.. అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. సదరు బాధితురాలిని, ఆమెకు సహకరించే వారిని ఇబ్బందులు పెడుతోంది.


జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్!

జీఎస్​టీ మండలి 45వ సమావేశం ఈ శుక్రవారం జరగనుంది. కొవిడ్ విజృంభణ తర్వాత జరగనున్న తొలి ప్రత్యక్ష భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్​ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చకు రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.


సినిమా లేనట్టేనా?

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ తుదిదశకు చేరుకుంది. అయితే ఈ సినిమా పూర్తవ్వగానే జక్కన్న తెరకెక్కిచనున్న సినిమా ఏదనే విషయంపై ఇప్పుడు చిత్రసీమలో చర్చ నడుస్తోంది.


పాక్​తో టెస్టు సిరీస్​

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ అనంతరం ద్వైపాక్షిక సిరీస్​ కోసం పాకిస్థాన్​ క్రికెటర్లు బంగ్లాదేశ్​ పయనం కానున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత పాక్​ టీమ్​ బంగ్లా గడ్డపై అడుగుపెట్టనుంది. ఆ సిరీస్​కు సంబంధించిన షెడ్యూల్​ను మంగవారం విడుదల చేశారు.

21:14 September 14

టాప్​ న్యూస్​ @ 9 PM

చిన్నారి కిడ్నాప్... కాపాడిన పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీ కంచన్​బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్​కు గురైన ఆరు సంవత్సరాల పాపను కంచన్​బాగ్ పోలీసులు సురక్షితంగా కాపాడారు. వీరికి సాయం చేసిన సంతోశ్​నగర్ పోలీసులను దక్షిణ మండల డీసీపీ గజరావు అభినందించారు.


తుక్కుతో ఉక్కు

వాడిన ఇనుప వస్తువులతో ప్రధాని నరేంద్రమోదీ నిలువెత్తు రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి కళాకారులు. 14 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం తయారీకి.. రెండు టన్నుల ఇనుము ఉపయోగించారు. విగ్రహ రూపకల్పనకు రెండు నెలల సమయం తీసుకున్న కళాకారులు.. ముఖభాగం తయారీకే 20 రోజల పాటు శ్రమించారు.


షియోమీ బ్రాండ్​ లోగోతోనే ఎంఐ

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంఐ బ్రాండ్​ ప్రోడక్ట్స్​ను కూడా.. షియోమీ లోగోతోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్​ నుంచే కొత్త లోగోతో ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది.


కొత్త జట్ల కోసం ఈ-బిడ్డింగ్!

వచ్చే సీజన్​ నుంచి 10 జట్లతో ఐపీఎల్ (Ipl 2022) జరిగే అవకాశం ఉంది. కొత్తగా రానున్న రెండు జట్ల కోసం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ.. అక్టోబర్ 17న ఈ-బిడ్డింగ్ నిర్వహించాలని భావిస్తోంది.


ఏదైనా 'మా' కోసమే!

'మా' ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. సభ్యుల సంక్షేమం కోసం తాము రెండేళ్లపాటు పనిచేస్తామని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్​రాజ్ అన్నారు. ఛారిటీ అసోసియేషన్​ల తయారైన 'మా' అసోసియేషన్​ను సభ్యుల సంక్షేమం కోసం కృషిచేసేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అక్టోబర్ 10న అసోసియేషన్​కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రకాశ్​రాజ్ సినీ కళాకారుల మద్దతు కూడగడుతూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ తన ప్రణాళికను కళాకారులకు వివరిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు కూడా సీనియర్ నటులను సన్మానిస్తూ నిశ్శబ్దంగా సభ్యుల మద్దతు కోరుతూ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.


 

19:52 September 14

టాప్​ న్యూస్​ @ 8 PM

పట్టుకుంటే రూ. 10 లక్షలు

బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.  సమాచారాన్ని 94906 16366 నంబర్‌కు లేదా 94906 16627 నంబర్‌కు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని ఇంకా పట్టుకోకపోవటంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు.

ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్‌ మెట్రో రైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో జరుగుతున్న భేటీకి మెట్రో, ఎల్ అండ్ టీ అధికారులు హాజరయ్యారు. మెట్రో రైల్‌ ప్రస్తుత పరిస్థితులు, విస్తరణ ప్రణాళికలపై సమాలోచనలు జరుపుతున్నారు.

మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. మట్టి వినాయకుని  విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని కమిటీ పేర్కొంది.

నాకు గర్ల్​ఫ్రెండ్​​ దొరకట్లేదు సారూ

ఓ యువకుడు రాసిన లేఖను చదివి కంగుతిన్నారు మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే. తనకు గర్ల్​ఫ్రెండ్​ లేదంటూ ఆ యువకుడు గోడు వెళ్లబోసుకోవడమే ఇందుకు కారణం.

హైవేపై ఏనుగు

హరియాణాలోని కలేసర్ అటవీ పార్కు నుంచి ఓ ఏనుగు.. యమునా నగర్- పోంటీ సాహెబ్ రహదారిపైకి వచ్చింది. దొరికిన ఆకులను తింటూ.. చాలాసేపు రోడ్డుపైనే సందడి చేసింది. ఒక్కసారిగా రహదారిపై ఏనుగును గమనించిన వాహనదారులు.. భయంతో ఏనుగు అడవిలోకి వెళ్లేంతవరకు రోడ్డుపక్కనే వాహనాలను నిలిపివేశారు. గజరాజును వీడియో తీశారు. ఫలితంగా దాదాపు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం అయింది.

భారీ ఉగ్రకుట్ర భగ్నం

పాకిస్థాన్​లో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు సహా ఆరుగురిని దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. పండుగ సీజన్​లో భారీ పేలుళ్లకు పాల్పడి దేశంలో అలజడులు సృష్టించేందుకు వీరు ప్రణాళికలు రచించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరి వెనక దావూద్​ ఇబ్రహీం సోదరుడు అనీశ్​ ఇబ్రహీం ఉన్నట్టు పేర్కొన్నారు.



 

18:46 September 14

టాప్​ న్యూస్​ @ 7 PM

జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్! శుక్రవారం నిర్ణయం!!

జీఎస్​టీ మండలి 45వ సమావేశం ఈ శుక్రవారం జరగనుంది. కొవిడ్ విజృంభణ తర్వాత జరగనున్న తొలి ప్రత్యక్ష భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్​ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చకు రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

గడువు పొడిగింపు

రాష్ట్రంలోని అన్ని విభాగాల విద్యార్థులు స్కాలర్​షిప్​లు అప్లై చేసుకునేందుకు ఉన్న గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ- పాస్​ వెబ్​సైట్​లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.


నలుగురు కలిసి...

మహిళను వివస్త్రను చేసి, లైంగికంగా వేధించిన కేసులో.. నిందితులపై 10 వేర్వేరు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఈ కేసుకు సంబంధించి వైరల్​ అయిన వీడియోలో.. సదరు మహిళ బంగారు ఆభరణాల చోరీకి పాల్పడినట్లు నిందితులు చెప్పటం వల్ల కేసును అన్నికోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.


మలింగ గుడ్​బై

టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు శ్రీలంక స్టార్​ క్రికెటర్ లసిత్ మలింగ. దీంతో అంతర్జాతీయ క్రికెట్​కు అతడు పూర్తిగా గుడ్​బై చెప్పేసినట్లు అయ్యింది.


చైనా ఉలికిపాటు

ప్రపంచంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా నేతృత్వంలో ఏర్పాటైన క్వాడ్‌ కూటమి ఈ నెల 24న భేటీ కానుంది. కూటమికి చెందిన దేశాధినేతలు తొలిసారిగా సమావేశం కానున్నారు. కరోనా కట్టడి సహా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు పగ్గాలు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు వంటి అంశాలను చర్చించనున్నారు. ఈ భేటీ కోసం అమెరికా వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోవైపు 'క్వాడ్'పై చైనా నిప్పులు చెరిగింది. ఆ​ కూటమికి భవిష్యత్తు లేదని మండిపడింది.

17:55 September 14

టాప్​ న్యూస్​ @ 6 PM

ఎన్​కౌంటర్ చేయాలి..​ చేస్తం

సైదాబాద్​లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని ఎన్​కౌంటర్​ చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. కచ్చితంగా ఆ నిందితున్ని పట్టుకుని ఎన్​కౌంటర్​ చేస్తామని ప్రకటించారు. మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... సమావేశం ముగించుకుని వెళ్లేటప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు గానూ ఈ విధంగా స్పందించారు. ప్రశ్న వినగానే కోపంతో ఊగిపోయిన మంత్రి.. నిందితున్ని ఎన్​కౌంటర్​ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలిపారు.

ఎప్పటికీ ఒక్కటి కావు

తెరాస, భాజపా ఎప్పటికీ ఒక్కటి కావని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. మెదక్‌లో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే కలుస్తాయని చెప్పారు.

మరో సీఎం మార్పు..

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​ దిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం భాజపా సీనియర్​ నేతలతో ఆయన భేటీకానున్నారు(jai ram thakur news). అయితే ఠాకూర్​ను సీఎం పదవి నుంచి తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలే కర్ణాటక, గుజరాత్​లో సీఎంలను పార్టీ మార్చడం ఇందుకు కారణం.


అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

అంతర్జాతీయ క్రికెట్​ మండలి మంగళవారం విడుదల చేసిన మహిళల వన్డే క్రికెట్​ ర్యాంకింగ్స్​లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. వన్డేల్లో కెప్టెన్​ మిథాలీ రాజ్​(Mithali Raj Ranking), టీ20ల్లో షెఫాలీ వర్మ(Shafali Verma Ranking) అగ్రస్థానంలో నిలిచారు.


పెళ్లిసందD మామూలుగా లేదు!

యువ కథానాయకుడు రోషన్​, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో రూపొందిన చిత్రం 'పెళ్లిసందD'. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్​ను(PelliSandaD Teaser) 'కింగ్​' నాగార్జున విడుదల చేశారు.


 

16:54 September 14

టాప్​ న్యూస్​ @ 5 PM

ఇంకా దొరకని కామాంధుడు..

ఆరేళ్ల చిన్నారిపై హత్యచారం చేసిన నిందితుడు పోలీసులకు ఇంకా చిక్కలేదు. పది బృందాలుగా జల్లెడ పడుతున్నా... ఎక్కడా పోలీసులకు దొరకకపోవటంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న స్థానికులు.. నిందితున్ని పట్టుకోకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు మాత్రం సీసీటీవీల దృశ్యాల ఆధారంగానే కాకుండా.. నిందితుని స్నేహితుడు చెబుతున్న విషయాల ఆధారంగా ముమ్మర ధర్యాప్తు సాగిస్తున్నారు.


రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఏపీలో రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులు, మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.


మళ్లీ నైట్​​ కర్ఫ్యూ

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి 25 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనుంది.


దాదా ఏమన్నాడంటే?

టీమ్​ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిపై(ravi shastri corona) ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని తెలిపాడు బీసీసీఐ అధ్యుక్షుడు గంగూలీ. ఐదో టెస్టు​ రద్దుపై(Fifth Test cancelled) వస్తోన్న విమర్శలకు మరోసారి వివరణ ఇచ్చాడు.


అరుదైన గౌరవం

15:52 September 14

టాప్​ న్యూస్​ @4PM

  • అసెంబ్లీపై సమావేశాలపై కేబినెట్​ భేటీ..

రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్​లో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశంపై కూడా చర్చ జరగనుంది.

  • దీదీ నామినేషన్​ తిరస్కరించాలని..

బంగాల్​ భవానీపుర్​ ఉప ఎన్నికకు(Bhabanipur By Election) సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్​ను తిరస్కరించాలని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​​ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆమె సమర్పించిన అఫిడవిట్​లో పెండింగ్​లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి చేప్పలేదని ఆరోపించారు.

  • పరీక్ష సరిగా రాయలేదని...

నీట్​ పరీక్ష(NEET 2021) సరిగ్గా రాయలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని అరియాలుర్​ జిల్లాలో సోమవారం జరిగింది. ఈ విద్యార్థిని కొన్ని నెలల క్రితం విడుదలైన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో 93.6 శాతం ఉత్తీర్ణత సాధించింది.

  • ఒకప్పటి ఖైదీలే ఇపుడు బాస్​లు...

తాలిబన్ల చేతుల్లోకి వచ్చాక అఫ్గానిస్థాన్​లో(Afghanistan Taliban) ఎన్నో మార్పులు వచ్చాయి. వారికి భయపడి.. ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. వారి రక్షణ చూసే పోలీసులు లేరు. స్టేషన్ల సంగతి దేవుడెరుగు. ఇక కాబుల్​ను(kabul) ఆక్రమించుకున్నాక తాలిబన్లు.. జైళ్లలో ఖైదీలను విడిచిపెట్టారు. ఒకప్పుడు.. అక్కడ ఖైదీలుగా శిక్ష అనుభవించిన తాలిబన్లే ఇప్పుడు ఆ జైళ్లకు బాస్​లుగా మారారు.

  • తేజ్​ పరిస్థితి మెరుగవుతోంది...

రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej accident) హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి(sai dharam tej health condition) నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.



 


 

14:33 September 14

టాప్​ న్యూస్​ @3PM

  • గణేశ్​ నిమజ్జనంపై సుప్రీంకు...

భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు మంత్రి తలసానిని కలిశారు. హుస్సేన్ సాగర్​లో మంత్రి తలసానిని కలిసిన భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని... దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తలసాని తెలిపారు.

  • నితిన్​ గడ్కరి వ్యంగ్యాస్త్రాలు...

దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పుకొచ్చారు. మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యే, సీఎం పీఠం దక్కలేదని మంత్రులు అసంతృప్తిగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాజపా తరచూ సీఎంలు మార్చుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా పరోక్షంగా ఛలోక్తి విసిరారు.

  • నదిలో పడవ బోల్తా...

మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గాలేగావ్​ సమీపంలో వార్దా నదిలో పడవ బోల్తా పడి 11 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.

  • ఆ ఎంపీ ఇంటిపై రెండోసారి బాంబు..

బంగాల్ భాజపా ఎంపీ అర్జున్ సింగ్ (MP Arjun Singh) నివాసంపై వారం రోజుల్లో రెండో సారి బాంబు దాడి (West Bengal MP bomb) జరిగింది. ఆయన ఇంటికి 200 మీటర్ల సమీపంలోని ఖాళీ ప్రాంతంలో బాంబులు పేలాయని పోలీసులు తెలిపారు. ఉత్తర పరగణాలు జిల్లా భాట్​పరాలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

  • తాలిబన్ల వెనక పాక్​ కుట్ర నిజమే...

అఫ్గాన్​ను​ తాలిబన్లను ఆక్రమించుకోవడం వెనుక పాక్ కుట్ర ఉందనే విషయం తేటతెల్లమవుతోంది. తాలిబన్లు(Afghan Taliban) అధికారం చేపట్టాక తొలి వాణిజ్య విమానం సోమవారం కాబుల్‌లో(Kabul Airport) ల్యాండ్‌ అయ్యింది. అది పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ విమానం కావడమే ఇందుకు నిదర్శనం. తాలిబన్లకు గుర్తింపు కోసం పాక్​ ఈ ప్రయత్నాలు చేస్తోంది. అటు చైనా కూడా వీరికి అండదండగా నిలుస్తోంది.

  • పుకార్లపై సమంత క్లారిటీ...

నాగచైతన్య-సమంత(Samantha Naga Chaitanya)ల జోడీపై కొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు చెక్​ పెట్టేలా.. ఓ ట్వీట్​ చేశారు నాగచైతన్య. దీంతో వారి ఫ్యాన్స్​కు పుకార్ల‌పై కాస్త క్లారిటీ వ‌చ్చింది. 'లవ్​ స్టోరీ' ట్రైలర్​ను ప్రశంసిస్తూ.. సమంత చేసిన ట్వీట్​కు చై రిప్లే ఇచ్చారు.​

13:55 September 14

టాప్​ న్యూస్​ @2PM

  • నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ ఫోకస్

గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులో కొలను ఏర్పాటు చేశారు. ప్రజలంతా ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.

  • రేపో మాపో మరో ఉద్యోగాల భర్తీ

త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో పర్యటించారు.

  • కర్ణాటకకూ 'నిఫా' వ్యాప్తి

కేరళలో నిఫా వైరస్(Nipah Kerala)​ మళ్లీ కలకలం సృష్టిస్తున్న వేళ.. కర్ణాటకలో ఓ వ్యక్తికి వైరస్​ సోకినట్లు అనుమానాలున్నాయని ఆ రాష్ట్ర హెల్త్​ కమిషనర్ కేవీ తిలక్ చంద్ర తెలిపారు. అనుమానితుడి నమూనాలను పుణె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్ష కోసం పంపినట్లు వెల్లడించారు.

  • చైనాలో మళ్లీ కరోనా కలకలం-

చైనాలో కరోనా మహమ్మారి(Corona Pandemic) మరోమారు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌(Delta Variant) కేసులు క్రమంగా పెరిగిపోతుండటం డ్రాగన్​ దేశాన్ని కలవరపెడుతోంది. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో ఒక్క రోజు వ్యవధిలో డెల్టా వేరియంట్‌ కేసులు రెట్టింపు కావడం చూసి ‌అధికారులు అప్రమత్తమయ్యారు. కఠిన ఆంక్షలను విధించి ప్రజలెవరూ అనవసరంగా బయటకి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

  • శ్రీకాంత్​కు నరేశ్​ కౌంటర్​

'మా' ఎన్నికల (MAA Elections) ప్రచారం ఊపందుకున్న వేళ తెలుగు సినీ పరిశ్రమలో మాటలు యుద్ధం సాగుతోంది. ఇటీవల నటుడు శ్రీకాంత్​ మాట్లాడిన మాటలపై.. మా అధ్యక్షుడు నరేశ్​ స్పందించారు. బైట్స్​ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

12:57 September 14

టాప్​ న్యూస్​ @1 PM

 

  • ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి?

ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే కేసీఆర్ స్పందిస్తారు అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా.. వాటిని భర్తీ చేయకపోవడాన్ని ఆమె తప్పబట్టారు.

  •  కుమారుడితో సహా తండ్రి అదృశ్యం!

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తండ్రీకుమారుడు అదృశ్యమయ్యారు. మూడు రోజుల కిందట స్నాక్స్‌ కోసమని బయటకు వెళ్లిన వాళ్లు... తిరిగిరాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికంగా ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని వాపోయారు.

  • యోగి సర్కార్​పై మోదీ ప్రశంసల జల్లు

అలీగఢ్​లో రాజా మహేంద్ర ప్రతాప్​ సింగ్​ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు

గత ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన బంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఈసారి భవానీపుర్‌ నుంచి విజయ గర్జన చేసి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఆమె సంకల్పం నెరవేరడం అసాధ్యమేమీ కాదు. 'దెబ్బతిన్న పులి'ని అని చెప్పుకొంటున్న మమతపై పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌(Priyanka Tibrewal) కానీ, సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్‌ బిశ్వాస్‌ కానీ దీదీకి దీటైనవారు కాదు. భాజపా అభ్యర్థి ఖాతాలో ఇంతవరకు రాజకీయ విజయాలేవీ లేవు.

  • కృష్ణంరాజు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల కీలక ప్రకటన

సీనియర్​ నటుడు కృష్ణంరాజు(krishnam raju health condition) ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు ఆయన కుటుంబసభ్యులు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు స్పష్టం చేశారు.


 

12:05 September 14

టాప్​ న్యూస్​ @12PM

  • అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల

ఫార్మసీ, వ్యవసాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. దాదాపు 93శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

  • ఎల్​జేపీ ఎంపీ పాసవాన్​పై రేప్​ కేసు

ఎల్​జేపీ ఎంపీ ప్రిన్స్ పాసవాన్​పై (MP Prince Paswan) అత్యాచారం​ కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు కేసు బుక్​ చేసినట్లు వెల్లడించారు.

  • నడిసంద్రంలో 'ధ్రువ్​' రెస్క్యూ ఆపరేషన్​

సముద్రంలో చిక్కుకున్న ఓ నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు తీర ప్రాంత రక్షణ దళం సాహసం చేసింది. దీవ్​ తీరంలో భీకర గాలుల మధ్య రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తీర ప్రాంత రక్షణ దళం విడుదల చేసింది. సోమవారం రాత్రి వాతావరణం సవాల్‌ విసిరే కఠిన పరిస్థితుల మధ్య ధ్రువ్‌ హెలికాఫ్టర్‌ ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి మునిగిపోతున్న పడవ నుంచి ఏడుగురు సిబ్బందిని కాపాడామని వెల్లడించింది. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.

  • కొత్త జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే?

ఐపీఎల్​ రెండో దశలో(IPL 2021) తమ తొలి మ్యాచ్​ను బ్లూ కలర్​ జెర్సీ ధరించి ఆడబోతున్నట్లు తెలిపింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(rcb new jersey 2021 phase 2). కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్​ లైన్​ వారియర్స్​కు సంఘీభావం తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

  • 'పోనీటేల్‌' లుక్​తో అదరగొట్టిన హీరోలు

హీరోలు సినిమా సినిమాకు వైవిధ్యంగా కనిపిస్తుంటారు. ఇటీవల రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రం 'ఆర్‌సీ15' ప్రారంభోత్సవానికి కూడా రణ్‌వీర్‌ సింగ్ 'పోనీటేల్‌' హెయిర్‌ స్టైల్‌తో సందడి చేసి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్,​ బాలీవుడ్​లో పోనీటేల్‌ హెయిర్‌స్టైల్‌లో అలరించిన హీరోలు ఎవరో చూద్దాం..

10:43 September 14

టాప్​ న్యూస్​ @11AM

  • 100పడకల ఆస్పత్రికి కేటీఆర్ శంకుస్థాపన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్.. గద్వాల పర్యటన(Minister Ktr visit in gadwal) మొదలైంది. అలంపూర్ నియోజకవర్గం చేరుకున్న మంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మరికొన్ని అభివృద్ధి పనులు, భవనాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ప్రారంభిస్తారు.

  • సైదాబాద్ హత్యాచారం కేసులో వీడని చిక్కుముడి

సైదాబాద్ హత్యాచారం కేసులో నిందితుడు రాజు కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు జనగామ, యాదాద్రి జిల్లాల్లో పోలీసుల గాలిస్తున్నారు. నిందితుడి తల్లి, అక్కాబావలను ప్రశ్నిస్తున్నారు. నిందితుడు తప్పించుకునేందుకు స్నేహితుడి సహకారం చేసినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

  • ఒక్క రక్తపరీక్షతో నిర్ధరణ!

50 రకాలకుపైగా క్యాన్సర్లను సులువుగా గుర్తించగల ఈ పరీక్షను గ్రెయిల్‌ అనే బయోటెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసింది. కచ్చితత్వాన్ని నిర్ధరించేందుకుగాను బ్రిటన్‌కు చెందిన 'నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)' ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ట్రయల్‌కు సోమవారం శ్రీకారం చుట్టింది.

  • ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం..

మానసిక ఒత్తిడి.. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్తపోటు, గుండెపోటు వంటి ఎన్నో రోగాలకు కారణమవుతుంది. ప్రశాంతతను నాశనం చేస్తుంది. దీంతో ఎక్కువ స్థాయిలో స్ట్రెస్​ హార్మోన్లు విడుదలై ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి కారణంగా జీవక్రియల క్రమం తప్పుతుంది. మానసికంగా, శారీరకంగా మనిషిని కుంగదీస్తుంది. ముఖ్యంగా శృంగార జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అయితే శృంగార జీవితంపై ఒత్తిడి ప్రభావమెంత?

  • కొవిడ్​ మరణాలకు ప్రధాన కారణం

కరోనా మరణాలకు వైరస్​తో పాటు... కొవిడ్​ కారక సార్స్​-కొవీ-2 పెద్ద మొత్తంలో ఉండటమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మహమ్మారితో చనిపోయిన వారి ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్​ 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వెల్లడించారు.

09:57 September 14

టాప్​ న్యూస్​ @10AM

  • గద్వాలలో అఖిలపక్ష నేతల అరెస్ట్

గద్వాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కేటీఆర్‌ పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో... అలంపూర్‌లో అఖిలపక్షం నాయకులను అరెస్టు చేసి ఐజ పోలీసుస్టేషన్​కు తరలించారు.

  • దేశంలో కొత్తగా 25 వేల కేసులు

దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల (India covid cases) సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్తగా 25 వేల కేసులు బయటపడ్డాయి. 339 మంది మృతి చెందారు.

  • బ్రిటన్​ ప్రధానికి మాతృవియోగం

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson Mother) తల్లి చార్లెట్ జాన్సన్ వాల్(79) కన్నుమూశారు. ఈ విషయాన్ని డెయిలీ టెలిగ్రాఫ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

  • తగ్గిన బంగారం ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు (Gold prices) తగ్గాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా పతనమయ్యాయి. పెట్రోల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

  • 'వంటలక్క'లో ఇంత అందం దాగి ఉందా!

ప్రేమి విశ్వనాథ్(వంటలక్క)​.. ఈ పేరుకు తెలుగు బుల్లితెరపై ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'కార్తీకదీపం' సీరియల్​లో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటి హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో దీపకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

08:57 September 14

టాప్​ న్యూస్​ @9AM

  • అక్టోబరులో తెరాస ప్లీనరీ..

తెరాస ప్లీనరీ, పార్టీ ద్విదశాబ్ధి బహిరంగ సభను అక్టోబరులో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అదే నెలలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్వహించనున్నట్లు తెలిపారు.

  • ఐదుగురు రైతుల ఆత్మహత్య

ఆకలి తీర్చే అన్నదాతకు బతుకు భారమైపోతుంది. మట్టినే నమ్ముకున్న రైతు... సాగు సాగరాన్ని దాటలేక బలవంతంగా తనువు చాలిస్తున్నాడు. పంటకు పట్టిన చీడను వదిలించడానికి తెచ్చిన పురుగుమందు అన్నదాతకు ఆయువు తీస్తుంది. సాగులో కష్టాలు, అప్పుల బాధను తాళలేక రాష్ట్రంలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

  • ఎలుగుబంట్ల ఫుట్​బాల్ ఆట

ఒడిశాలో రెండు ఎలుగుబంట్లు ఫుట్‌బాల్‌తో ఆడుకోవడం (Bear playing Football) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నవరంగ్‌పూర్‌ జిల్లా సుకిగావ్‌ ప్రాంతంలో.. తల్లి, పిల్ల ఎలుగుబంట్లు తమకు దొరికిన ఫుట్‌బాల్‌తో.. చాలా సేపు ఆడుకున్నాయి. అనంతరం ఫుట్‌బాల్ తీసుకుని అడవిలోకి పారిపోయాయి. అడవి జంతువులు ఫుట్‌బాల్‌తో ఆడుకోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. 

  •  క్వాడ్ సమావేశానికి మోదీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన సెప్టెంబర్​ 24న జరిగే క్వాడ్​ శిగరాగ్ర సదస్సులో(Quad Summit 2021) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజే ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ(UNGA 2021) ప్రసంగించనున్నారు.

  • రూ.400కోట్లతో అజయ్​దేవగణ్​ కొత్త సినిమా!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్​ హీరో అజయ్​దేవ్​గణ్​.. మరో భారీ బడ్జెట్‌ చిత్రానికి(Ajay Devgan latest upcoming movie) సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కొత్త సినిమా కథపై కొంతమంది రచయితల బృందం పని మొదలుపెట్టినట్టు సమాచారం.

07:40 September 14

టాప్​ న్యూస్​ @8AM

  • 'సారంగపూర్‌ మునక' వెనుక  కోణాలు

నిజామాబాద్​ జిల్లాలో నిర్మిస్తున్న సారంగపూర్​ పంపుహౌస్​ మునక ఘటనకు కారణాలను పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఈనెల ఏడో తేదీ అర్ధరాత్రి పంపుహౌస్‌లోకి నీళ్లు వచ్చాయి. ‘సారంగపూర్‌ మునక’ వెనుక పలు కోణాలు ఏంటో కింది కథనం చదివి తెలుసుకుందాం.

  • రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వైద్యశాఖ తనవద్దే ఉండడంతో.. దాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రణాళికలు రూపొందించాలని వైద్యవర్గాలకు సూచించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి అనుమతి కోరుతూ... జాతీయ వైద్య కమిషన్‌కు వచ్చే ఏడాది దరఖాస్తు చేయనున్నారు.

  • గాంధీ మెచ్చిన నినాద ధీరుడు

భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపి.. బ్రిటిష్‌వారిని ఇరకాటంలో పెట్టిన ఈ నినాదాల సృష్టికర్త యూసుఫ్‌ మెహర్‌ అలీ. కుటుంబ సభ్యులు వద్దంటున్నా వినకుండా భార్దా హైస్కూల్‌లో చదువు కాగానే స్వాతంత్య్రోద్యమంలో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమానికి ఆ పేరు సూచించింది కూడా ఈయనే.

  • ఆ శునకానికి ఐసీసీ అవార్డు

ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులు ప్రకటించే ఐసీసీ(ICC news) ఈసారి ఓ శునకానికి(Dog Cricket Ball) ప్రత్యేక పురస్కారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎందుకంటే?

  • సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాం'

'జయలలిత' సినిమా తెరకెక్కించడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు 'తలైవి'(Thalaivi Movie) చిత్ర నిర్మాత విష్ణువర్ధన్​. కంగనను(Thalaivi Kangana Ranaut) ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే..

06:35 September 14

టాప్​ న్యూస్​ @7AM

  • విష జ్వరాల కలవరం..

ఆ రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా.. చిన్నపిల్లలను కలవరపెడుతున్నాయి. తీవ్ర జ్వరం, విరేచనాల కారణంగా గడచిన రెండు రోజుల్లోనే 130 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారంటే అక్కడి జ్వరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

  • మలేసియా మైత్రీ గీతం..

రాజకీయ అస్థిరత నెలకొన్న మలేసియాలో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య సామరస్య ఒప్పందం కుదిరింది. ఓటర్ల అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేలా తక్షణ చట్టం సహా.. పలు అంశాలపై ఇరు వర్గాలు ఓ అవగాహనకు వచ్చాయి.

  • మెగా ఈవెంట్​కు 'యాపిల్'

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా మెగా ఈవెంట్​కు 'యాపిల్' సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం జరగనుంది. మరి అందులో ఏయే ప్రొడక్ట్స్ విడుదల చేస్తారు? తదితర విశేషాలు మీకోసం.

  • డివిలియర్స్​ కామెంట్​

సీనియర్​ బ్యాట్స్​మన్​ ఎప్పటికప్పుడు రీఫ్రెష్​ అవ్వాలని అన్నాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ab de villiers rcb) బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​. ప్రస్తుతం ఐపీఎల్​ రెండో దశ కోసం అతడు సన్నద్ధమవుతన్నాడు.

  • ఫిట్​గా ఉండాలంటే... !

శరీరం ఫిట్​గా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. అందుకు సరైన పోషకాహారం, మంచి జీవనశైలి ఎంతో ముఖ్యం. వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన శరీరం ఎల్లప్పుడూ ఫిట్​గా (Fitness), ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి డైట్​ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

05:31 September 14

టాప్​ న్యూస్​ @6AM

  • నలుదిక్కులా దళితబంధు..

దళితులను ఆర్థికంగా అభివృద్ధిపరిచి తరతరాలుగా వెంటాడుతోన్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలు కొట్టాలన్న అత్యున్నత ఆశయం, సామాజిక బాధ్యతగా నిర్ధిష్టమైన లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.

  • తగ్గేదే లే..

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. జీహెచ్​ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

  • గద్వాల పర్యటన..

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. రూ.106 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిల్లాకు ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని.. కేటీఆర్​కు జిల్లాకు వచ్చే నైతిక అర్హత లేదంటూ విపక్ష నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు.

  • మోస్తరు వర్షాలు..

రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది.

  • డిగ్రీ లేదని వివాహం రద్దు..

నిశ్చితార్థం అయ్యాక వివాహం రద్దు కావడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని పీఎస్​ వద్ద ఈ ఘటన జరిగింది. వరుడు డిగ్రీ చదవలేదనే కారణంతో అమ్మాయి బంధువులు వివాహం రద్దు చేసుకున్నారు.

  • నేటికి వాయిదా..

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించి సాక్షి వెబ్​ మీడియా ట్వీట్​పై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌(Contempt petition on Sakshi web)పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు.. నేటికి వాయిదా వేసింది.

  • మరోసారి పరిశీలించండి..

కొవిడ్ మృతులకు చెల్లించే పరిహారంపై పునరాలోచించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. మహమ్మారి సోకిన సమయంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వబోమని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

  • దేనికి సంకేతం..

ఆ రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా.. చిన్నపిల్లలను కలవరపెడుతున్నాయి. తీవ్ర జ్వరం, విరేచనాల కారణంగా గడచిన రెండు రోజుల్లోనే 130 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారంటే అక్కడి జ్వరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

  • బీసీసీఐ క్లారిటీ..

భారత క్రికెట్​ జట్టు సారథి(Kohli Captaincy) మార్పు విషయంలో వస్తున్న వార్తలను బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధూమాల్​(Arun Dhumal BCCI) కొట్టిపారేశారు. ప్రస్తుతం సోషల్​మీడియాలో ట్రెండ్​ అవుతున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

  • నితిన్ జీవించేశాడు..

'మాస్ట్రో' సినిమా విశేషాలు వెల్లడించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ.. నితిన్​పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఓటీటీలో సెప్టెంబరు 17న రిలీజ్ అవుతోంది.

Last Updated : Sep 14, 2021, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details