తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - top ten news till now

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS@1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM

By

Published : May 11, 2021, 1:00 PM IST

  • ఆగ్రహం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భళా.. బస్వాపూర్​...

గ్రామస్థుల సమష్టితత్వం.. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు.. నిబంధనలు పక్కాగా పాటించడం.. తదితర చర్యలతో ఆ పల్లెవాసులు కరోనాను దూరంగా తరిమికొట్టారు. ఇప్పటివరకు ఒక్కరంటూ ఒక్కరూ కూడా కొవిడ్‌ బారిన పడకపోవడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జాప్యమైతే ప్రాణాలకే ముప్పు...

ప్రస్తుతం ఆక్సిజన్‌ అవసరమయ్యే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడం ప్రాణవాయువు విషయంలోనూ, సిబ్బంది పెంపు పరంగా అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. సకాలంలో సరఫరా కాకపోయినా, ఆక్సిజన్‌ అందించడంలో హెచ్చుతగ్గులు తలెత్తినా ప్రాణాలకే ముప్పు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చావుబతుకుల్లో ఉన్నా...

చావుబతుకుల్లో ఉన్నామంటే శత్రువు కూడా కనికరం చూపిస్తాడు. కానీ చచ్చిపోతున్నా.. పోలీసులు అంబులెన్సులను అనుమతించడం లేదని రాష్ట్ర సరిద్దుల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనాపై కాంగ్రెస్ పోరు!...

కరోనా పోరులో భాగంగా 'స్పీక్అప్​ టు సేవ్​ లైవ్స్​' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ సహాయ పడాలని పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్యూలో ఉండగానే ప్రసవం!...

కొవిడ్ రిపోర్టు తీసుకొస్తేనే ఆసుపత్రిలో చేర్చుకుంటామని వెద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో.. టెస్టు చేయించుకునేందుకు వెళ్లిన ఓ గర్భిణి క్యూలో ఉండగానే ప్రసవించింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంతిమ యాత్రకు పోటెత్తిన జనం...

ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయు జిల్లాలో ఓ మత గురువు అంతిమయాత్రకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కొవిడ్​ నిబంధనల ఉల్లంఘించిన ఈ ఘటనను పోలీసులు సీరియస్​గా తీసుకోని.. కేసు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముగ్గురు తీవ్రవాదులు హతం...

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా బలగాలు అనుమానిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రతిష్ఠ దిగజారింది...

భారత స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్​ ఘటనతో భారత రెజ్లింగ్​ సమాఖ్య ప్రతిష్ఠ దిగజారిందని డబ్ల్యూఎఫ్​ఐ కార్యదర్శి వినోద్ తోమర్​ తెలిపారు. వార్షిక కాంట్రాక్ట్​ నుంచి సుశీల్​ను తప్పించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • కరోనా బాధితులకు హీరోయిన్​ ఆస్పత్రి నిర్మాణం​...

రోనా బాధితులకు అండగా నిలిచేందుకు బాలీవుడ్​ నటి హ్యూమా ఖురేషి ముందుకొచ్చారు. దిల్లీలో ఓ తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి అందులో ఆక్సిజన్​ సదుపాయంతో పాటు 100 పడకలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details