1. నాయిని అల్లునికి సమన్లు...
ఐఎంఎస్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణికి ఈడీ సమన్లు జారీ చేసింది. 10 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కుంభకోణంలో శ్రీనివాస్‌రెడ్డి, ముకుందారెడ్డి, దేవికారాణిదే కీలకపాత్రగా ఈడీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రేపు ఓరుగల్లుకు కేటీఆర్...
వరంగల్ మహానగరంలో మంత్రి కేటీఆర్ రేపు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో త్వరలోనే పుర పోరుకు నగారా మోగనున్న నేపథ్యంలో.. కేటీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మాస్క్ తప్పనిసరి...
రాష్ట్రంలో రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి వేగంగా చెందుతోంది. రోజువారీ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. కానీ కొంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికీ మాస్క్ తప్పనిసరి చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మూడు రోజులు జల్లులు...
రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ... వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రదేశాల్లో... రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ రాష్ట్రాల్లోనే 70 శాతం కేసులు...
ఓవైపు కరోనా టీకాల ప్రక్రియ జోరుగా సాగుతుండగానే మరోవైపు కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. దేశంలో తొలిసారి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటడం గమనార్హం. అయితే 70శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.