తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News : టాప్​న్యూస్ @ 3PM - telangana topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 25, 2022, 2:52 PM IST

  • సాయంత్రం దిల్లీకి సీఎం కేసీఆర్​.. అందుకోసమేనా..?

ముఖ్యమంత్రి కేసీఆర్​ సాయంత్రం దిల్లీ వెళ్లనున్నారు. రెండు, మూడు రోజుల పాటు దిల్లీలోనే ఉండనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్​ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

  • అక్కన్నపేటలో చిరుతపులుల సంచారం

చిరుతపులుల సంచారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో అలజడి సృష్టిస్తోంది. రాత్రి పూట చిరుతల సంచారం ధర్మారం-కొండరాజుపల్లి గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

  • మత్తు మందు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆపై..!

ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చిన వివాహితపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. ఆపై నగ్న చిత్రాలు తీసి బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

  • పరీక్షకు అరగంట ముందు సెంటర్ మార్పు

నిజామాబాద్ జిల్లాలో జేఈఈ మెయిన్ పరీక్షలో గందరగోళం నెలకొంది. పరీక్షకు అరగంట ముందు సెంటర్‌లో మార్పు చేసినట్లు చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ముందుగా వచ్చిన విద్యార్థులను మార్పు చేసిన పరీక్షా కేంద్రానికి తరలించారు.

  • వేధింపులు భరించలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య..

ఓ యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది దళిత విద్యార్థిని. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​లో జరిగింది. ఓ ప్రైవేట్​ స్కూల్​ హాస్టల్​ లోపల 12వ తరగతి విద్యార్థిని విగతజీవిగా కనిపించిన ఘటన తమిళనాడులో జరిగింది.

  • మరణించిన కొడుకు బతికొస్తాడని 30 గంటలు పూజలు..

తాంత్రికులతో పూజలు చేయిస్తే మరణించిన కొడుకు బతుకుతాడని ఆశ పడ్డారు తల్లిదండ్రులు. సుమారు 30 గంటలు పాటు పూజలు చేయించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

  • 'పవర్​ కట్'​తో విమానం క్రాష్.. ట్రైనీ పైలట్ భావన సేఫ్​

మహారాష్ట్ర పుణె జిల్లాలో చిన్నపాటి విమానం కూలగా.. పైలట్ శిక్షణలో ఉన్న భావనా రాఠోడ్​(22) స్వల్ప గాయాలతో బయటపడింది. ఇందాపుర్​ మండలం కడ్బన్వాడీలో సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో జరిగింది ఈ ఘటన.

  • బంగారం ధర నేటి లెక్కలు ఇలా...

తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల పసిడి ధర రూ.52,460 ఉండగా.. కిలో వెండి ధర రూ.55,850 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • మయన్మార్​లో నలుగురు రాజకీయ నేతలకు ఉరి..

మయన్మార్ సైన్యం నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష వేసింది. అందులో ఒక మాజీ చట్టసభ సభ్యుడు, మరొక ముగ్గురు ప్రజాస్వామ్య కార్యకర్తలు ఉన్నారు.

  • కత్రినా కైఫ్- విక్కీ కౌశల్​ జంటకు చంపేస్తామని బెదిరింపులు

బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్​కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details