ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుదిల్లీ పీఠాన్ని వణికించిన ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో.. దిల్లీ పీఠం మాటే శాసనంగా చెలామణి అయ్యే కాలమది..! సమాఖ్య స్ఫూర్తికి పాతరేసి.. ప్రజాప్రభుత్వాలను కూలదోసే దొడ్డిదారి రాజకీయం రాజ్యమేలుతున్న రోజులవి..!! కేరళలో రాష్ట్ర సర్కారును కూలదోసిన విధంగానే.. తెలుగునాట సైతం గవర్నర్ అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రంలోని కాంగ్రెస్. దెబ్బ తిన్న బెబ్బులిలా తిరిగి అధికారం చేపట్టిన అన్నగారు.. దేశంలోనే కాంగ్రెస్ పెత్తనం లేకుండా చేసేందుకు దిల్లీనే ఢీకొట్టారు. దేశవ్యాప్తంగా ప్రముఖపాత్ర పోషిస్తున్న నేతలను ఏకతాటిపైకి తెచ్చి.. హస్తం పార్టీపై యుద్ధం ప్రకటించారు. రాజీలేని పోరాటంతో.. దిల్లీ పాదుషాల గుండెల్లో వణుకు పుట్టించారు..!!!'ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తా...'NTR 100TH Birth Anniversary: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం TRS Leaders Tribute to NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు.'తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్'NTR 100th Anniversary: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు నివాళులు అర్పించారు.' దానిని ఎవరూ అడ్డుకోలేరు' Kishan Reddy on KCR: కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం దివాలా దిశగా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు కచ్చితంగా తెరాస పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.' వారు ప్రధానులయితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారు'Bhatti Vikramarka: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడం పట్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ఖండిస్తూ సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రదర్శన చేపట్టిన యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.నేను ఆ పని నేను చేయలేదు PM Modi news: మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పనేదీ తాను చేయలేదని పేర్కొన్నారు.'ఆప్' సర్కార్ మరో కీలక నిర్ణయంPunjab Govt Withdraws Security: పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు భద్రతను తొలగించింది. మొత్తం 424 మందికి పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించింది.భారత్‌లో ప్లాంట్‌పై మస్క్ క్లారిటీ Tesla car india: భారత్‌లో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుపై మస్క్ క్లారిటీ ఇచ్చారు. ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్‌లో టెస్లా ప్లాంట్ స్థాపించే ఆలోచనే లేదని తెలిపారు. మరోవైపు స్టార్‌లింక్ ఇంటర్ననెట్ సేవలను దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.నందమూరి ఫ్యామిలీ సినిమా సర్ప్రైజెస్ ఇవే!సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. నందమూరి కుటుంబసభ్యులు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను ఇచ్చి అభిమానుల్లో జోష్‌ను నింపారు. ఓసారి అవన్నీ చూసేద్దాం..