తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 1PM - TELANGANA TOP NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS: టాప్ న్యూస్ @ 1PM
TOP NEWS: టాప్ న్యూస్ @ 1PM

By

Published : May 19, 2022, 12:58 PM IST

  • రాముని గుడి అమ్మకం..

Ram Temple Sold By Pakistani: ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని రామ్​జానకీ దేవాలయాన్ని విక్రయించాడు ఓ పాకిస్థాన్​ జాతీయుడు. అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను తరలించాడు. దీనిపై స్పందించిన అధికారులు దానిని శత్రు ఆస్తులుగా ప్రకటించారు.

  • ఓటీటీలో ఫ్రీగానే ఆర్​ఆర్ఆర్..

'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జీ5 కీలక ప్రకటన చేసింది. 'పే ఫర్ వ్యూ' పద్ధతి లేకుండా.. జీ5 సబ్​స్క్రైబర్లు ఉచితంగానే సినిమా చూడవచ్చని ప్రకటించింది.

  • నామినేషన్ దాఖలు..

Gayatri Ravi Nomination: రాజ్యసభ స్థానానికి తెరాస అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) నామినేషన్ దాఖలు చేశారు. గాయత్రి రవి నామినేషన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

  • నా నోట్లో మట్టి కొట్టొద్దు..

కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహిత మొగులయ్య భాజపా నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు.

  • హాస్టల్‌ ఖాళీ చెయ్‌..

Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. పీహెచ్‌డీ సమర్పణ గడువు ముగిసిన విద్యార్థులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పలువురికి నోటీసులు జారీ చేసింది.

  • కూరగాయల ధరలు ఇలా..

Vegetables Price in Hyderabad Today: హైదరాబాద్​ మోడల్​ రైతుబజార్​ ఎర్రగడ్డలో గురువారం(19-05-2022) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • భారత్ ఆ స్థాయికి​ చేరాలి..

PM modi yuva shivir: ప్రపంచ శాంతిని నెలకొల్పే స్థాయికి భారత్​ను చేర్చాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయంగా అస్థిరత ఏర్పడినా శాంతియుత దేశంగా భారత్​ నిలిచిందని పేర్కొన్నారు.

  • అప్పటి వరకు మీరు ఆగండి..

Gyanwapi Case Supreme Court: వారణాసిలోని జ్ఞాన్​వాపి మసీదు వీడియోగ్రఫీ సర్వే వ్యవహారంపై తాము విచారణ చేపట్టే వరకు వారణాసి దిగువ కోర్టు విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

  • తగ్గిన బంగారం ధర..

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,970కు చేరింది. మరోవైపు బిట్​కాయిన్​ ధర భారీగా పడిపోయింది.

  • ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు..

IPL News: ఐపీఎల్​ మ్యాచ్​లను వచ్చే సీజన్​ నుంచి మళ్లీ సాయంత్రం 4, రాత్రి 8 గంటలకే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈమేరకు ప్రసార సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ టీవీ, ఓటీటీ ప్రసార హక్కుల ధరను రూ.32.8వేల కోట్లుగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details