తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP  NEWS
టాప్ న్యూస్ @9PM

By

Published : Apr 24, 2022, 9:17 PM IST

  • వచ్చే ఎన్నికల్లో తెరాసకు పీకే సేవలు

సీఎం కేసీఆర్​, రాజయకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ మధ్య రెండు రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన చర్చలు ఈరోజు కూడా కొనసాగాయి. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, భవిష్యత్​ కార్యాచరణపై భేటీలో లోతుగా చర్చించినట్టు సమాచారం.

  • 'వారికి మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే'

Bandi Sanjay Comments on KCR: హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. వరి కొనకుండా కేంద్రంపై నిందలేస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అసత్య వాగ్ధానాలతో విసిగిన జనం, తెరాసను ఎలాగైనా గద్దె దించాలని మండుటెండలో పాదయాత్రకు మద్దతిస్తున్నారన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో పదకొండో రోజు నారాయణపేట జిల్లాలో బండి సంజయ్​ పర్యటించారు.

  • రాహుల్‌ సభపైనే కాంగ్రెస్​ దృష్టి!

Rahul Gandhi Tour: రాహుల్‌ గాంధీ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చేట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే తాము ఏమి చేస్తామో.. రాహుల్‌ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వనుంది.

  • 'నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు '

పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా ఇటీవల జాతీయ అవార్డులు పొందిన ఉత్తమ జడ్పీ, ఎంపీపీ, గ్రామ సర్పంచ్​లను మంత్రి ఎర్రబెల్లి ఘనంగా సన్మానించారు

  • 'నిత్యం రూ.20వేల కోట్ల లావాదేవీలు'

Modi Mann Ki Baat today: చిన్న ఆన్‌లైన్‌ చెల్లింపులే పెద్ద డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల డిజిటల్​ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మన్​ కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

  • 'కశ్మీర్​లో కొత్త పంథాలో అభివృద్ధి'

PM Modi Jammu: 370వ అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్​లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊపునిచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ఆదివారం జమ్మూ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.

  • లఖింపుర్‌ జిల్లా కోర్టులో లొంగిపోయిన ఆశిష్‌ మిశ్ర

Ashish Mishra surrender: లఖింపుర్​ ఖేరీ ఘటన నిందితుడు ఆశిష్ మిశ్ర.. జిల్లా కోర్టులో ఆదివారం లొంగిపోయారు. వారం రోజుల లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే జిల్లా కోర్టులో సరెండర్​ అయ్యారు.

  • 108 మంది దుర్మరణం

నైజీరియాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 100 మందికి పైగా కార్మికులు మరణించారు. అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ఇంతటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

  • 'కొరటాల వల్ల 'ఆర్​ఆర్​ఆర్​'.. రాజమౌళి వల్ల 'ఆచార్య''

Acharya: దర్శకుడు కొరటాల శివ వల్ల 'ఆర్​ఆర్​ఆర్'​లో భాగమయ్యానని, జక్కన్న వల్ల 'ఆచార్య'లో నటించానని అన్నారు మెగా హీరో​ రామ్​చరణ్​. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చరణ్​ చెప్పిన ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే.

  • కడక్​నాథ్ కోడిపిల్లల్ని కొన్న ధోనీ..

MS Dhoni Kadaknath chicks: నల్లగా నిగనిగలాడే కడక్​నాథ్ కోళ్లు.. ధోనీ ఫాంహౌజ్​కు చేరాయి. ధోనీ కోసం రెండు వేల కోడి పిల్లల్ని రాంచీకి తరలించారు మధ్యప్రదేశ్ అధికారులు. అసలు ఈ కోళ్లేంటి? వీటితో మహీ ఏం చేయనున్నాడు?

ABOUT THE AUTHOR

...view details