తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 3, 2022, 9:09 PM IST

  • సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్​..

CM KCR in Muchital: హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నిన్న(ఫిబ్రవరి 2) ప్రారంభమైన శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. చిన జీయర్​ స్వామితో కలిసి దివ్యక్షేత్రమంతా కలియ తిరుగుతూ.. ఏర్పాట్లను, క్రతువులను పర్యవేక్షించారు.

  • జాతరకు 4వేల ప్రత్యేక బస్సులు..

MEDARAM Special Busses : మేడారం సమ్మక్క సారలమ్మను ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ దర్శించుకున్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • ప్రత్యక్ష తరగతులపై స్టేకు నో..

HC on Covid and Online Classes: కొవిడ్ దృష్ట్యా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐతే నెలాఖరు వరకు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాఠశాలలకు వెళ్లలేని వారికి ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. సమ్మక్క, సారక్క జాతరలో కొవిడ్ జాగ్రత్తలు ఉండాలని ఆదేశించింది.

  • విద్యార్థుల భద్రతపై కేంద్రం కొత్త గైడ్​లైన్స్​..

Covid Guidelines In Schools: పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు భౌతిక తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లల భద్రత విషయంలో సవరించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. పాఠశాలల్లో పిల్లల మధ్య ఆరు అడుగులు దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

  • రాజ్యసభలో రాజ్యాంగ రగడ..

New Constitution issue in Rajyasbha: రాజ్యసభలో తెరాస, కాంగ్రెస్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్త రాజ్యాంగం విషయంలో రెండు పార్టీల వాగ్వాదం జరిగింది. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని భాజపా దెబ్బతీస్తోందని.. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని కేసీఆర్‌ ప్రతిపాదించారని కేకే వ్యాఖ్యానించారు. తెరాస ప్రతిపాదనను మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు.

  • అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి..

Attack on Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీ వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. 3-4 తూటాలు దూసుకెళ్లాయని చెప్పారు.

  • చైనాపై భారత్ కన్నెర్ర..

Beijing Olympics Torchbearer: బీజింగ్ వింటర్​ ఒలింపిక్స్ నేపథ్యంలో చైనా తీరుపై భారత్​ కన్నెర్ర జేసింది. గల్వాన్‌ ఘటనలో గాయపడిన ఆ దేశ ఆర్మీ అధికారిని ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా,, చైనా ఎంపిక చేసిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు హాజరుకాబోమని​ తెలిపింది.

  • చుక్కలు చూపిస్తున్న టెస్లా కార్లు..

Tesla Malfunction: "రెడ్ సిగ్నల్​ పడినా ఆగడం లేదు.. ఖాళీ రోడ్డుపై వేగంగా వెళ్తూ ఒక్కసారిగా బ్రేక్ వేస్తోంది".. టెస్లా ఆటో పైలట్​ కార్లపై ఇటీవల బాగా వినిపిస్తున్న ఫిర్యాదులివి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల్లో కింగ్​గా పేరుగాంచిన టెస్లాలో ఎందుకీ సమస్యలు? ఆటో పైలట్​ను గాడిన పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ ఏం చేస్తోంది?

  • కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు..

Kohli captaincy: టెస్టు సారథ్యాన్ని కోహ్లీ వదిలేస్తాడని అనుకోలేదని బౌలర్ శార్దుల్ ఠాకుర్ అన్నాడు. ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యతో తనను పోల్చొద్దని చెప్పాడు.

  • సినిమా కోసం ఏడు రిలీజ్ డేట్స్..

Nani new movie: నాని కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. అయితే తమ సినిమా ఈ తేదీల్లో రిలీజ్ చేస్తామంటూ ఏకంగా ఏడు విడుదల తేదీలను ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details