ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు స్టార్ట్.. TS Schools to Reopen: ఫిబ్రవరి 1 న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను పునఃప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 95,355 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 3,590 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,160 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.వ్యక్తి హత్య.. తల, మొండెం వేర్వేరు ప్రాంతాల్లో.. Brutal murder: సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ హత్య కలకలం సృష్టించింది. వ్యక్తిని చంపి.. తల, మొండెం వేర్వేరు చేసి.. వేర్వేరు మండలాల్లో పడేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది.ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు.. Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రజలను ఆకర్షించడానికి నాయకులు సామాన్యులతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు.'కుర్మీ' వర్గం మెప్పు పొందేదెవరు? Up election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓబీసీ ఓట్లను ఒడిసి పట్టేందుకు పోటీ పడుతున్నాయి రాజకీయ పార్టీలు. అందులో 'కుర్మీ' సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఐదు శాతం జనాభా ఉన్న కుర్మీలకు యూపీ ఎన్నికల్లో ఎందుకింత ప్రాధాన్యం? ఎన్ని స్థానాల్లో వారి ప్రభావం ఉంటుంది? ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుక.. Beating Retreat Ceremony: గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ ఘనంగా జరిగింది. దేశ రాజధాని దిల్లీలోని విజయ్‌చౌక్‌లో కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.పెగసస్‌పై సుప్రీం కమిటీ దర్యాప్తు.. Pegasus spyware controversy India: న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెలువరించిన క్రమంలో పెగసస్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. 2017లోనే భారత్ కొనుగోలు చేసిందన్న వార్తలపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో పెగసస్ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు కమిటీ దర్యాప్తు చేస్తోందని, నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.ఆ దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్! BA.2 Variant Omicron: సింగపూర్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇప్పటికే భారత్ సహా 50కు పైగా దేశాల్లో బయటపడ్డ బీఏ2 ఒమిక్రాన్ వేరియంట్ సింగపూర్‌లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. 198 మంది ఈ ప్రమాదకర వేరియంట్‌తో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.దక్షిణాఫ్రికా పర్యటనలో లోపించింది అదే.. Salman Butt on Team India: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో వికెట్ టేకింగ్ బౌలర్లు కరవయ్యారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. అయితే.. వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు బౌలర్లకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశంసించాడు.త్వరలోనే నవ్వుల జర్నీ.. F3 Movie Release Date: వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న 'ఎఫ్3' చిత్రం టాకీ పార్ట్ పూర్తైంది. ఇక థియేటర్లలో నవ్వులు పూయించడమే తరువాయి అంటోంది చిత్రబృందం.