ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..ఫీవర్ సర్వే ఎలా సాగుతోంది..? Fever Survey in Telangana: కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. తొలిరోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్ కిట్ అందించారు. రాష్ట్రంలో రెండో రోజు జ్వర సర్వే కొనసాగుతుండగా... మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్వే తీరును పరిశీలించారు.సాకివాగు ఘటనపై మంత్రి సీరియస్.. Minister Satyavathi responds over Saakivagu incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం సాకివాగు అటవీ ప్రాంతంలో జరిగిన అమానవీయ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.అభివృద్ధిలో వాళ్లే కీలకం.. Modi interacted with District Magistrates: ఆశావహ జిల్లాల అభివృద్ధిలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధిలో ఆశావహ జిల్లాలు అడ్డంకులను తొలగిస్తున్నాయని చెప్పారు. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలతోనే సుపరిపాలన అవసరమని తెలిపారు.భాజపాకు మరో పెద్ద షాక్.. Laxmikant Parsekar News: అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాకు మరో పెద్ద షాక్ తగిలింది. గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. గోవా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇవ్వలేదని అందువల్ల రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.సీఎం అభ్యర్థిపై వెనక్కి తగ్గిన ప్రియాంక.. priyanka gandhi up election 2022: యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు.కరోనా వచ్చాక టీకా ఎప్పుడేసుకోవాలి..? Booster Dose: కరోనా మహమ్మారి బారిన వారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్ షీల్ లేఖలు రాశారు.కూతురిపై రేప్ చేసిన వ్యక్తిని కోర్టులోనే.. Rape accused shot dead: అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్ఎఫ్ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న కారణంతోనే చంపినట్లు తెలుస్తోంది.రేసింగ్ బైక్‌ల బీభత్సం.. వీడియో వైరల్.. Bike Accident: కేరళ కొల్లాం జిల్లాలో యువకులు సరదాగా చేసిన బైక్ రేసింగ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంలో సెల్ఫీ తీసుకుంటూ.. ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు ఓ రైడర్. ప్రమాద సమయంలో బైక్‌లు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.ఐపీఎల్లో ఖరీదైన ఆటగాడు రాహులే.. Rahul IPL record: ఐపీఎల్-2022లో కొత్త జట్టు లఖ్‌నవూకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. ఇతడిని రూ.17 కోట్లకు సొంతం చేసుకుంది ఫ్రాంచైజీ. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.చై-సామ్ విడాకులపై నాగ్ కామెంట్స్.. తన గురించి అసత్య వార్తలు రాస్తే పట్టించుకోనని, కానీ కుటుంబం గురించి రాయడం చాలా బాధించిందని హీరో నాగార్జున అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.