ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమస్క్కు కేటీఆర్ ట్వీట్ KTR Tweet to Elon Musk: భారత్ మార్కెట్‌లోకి టెస్లా విద్యుత్ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.పోలీసు శాఖలో వైరస్ వ్యాప్తి.. Corona cases in police Department: పోలీస్ శాఖలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హోంగార్డు నుంచి ఐపీఎస్‌ల వరకు క్రమంగా వైరస్ బారిన పడుతున్నారు. గత రెండు దశలతో పోలిస్తే.. ఈసారి కొవిడ్ ప్రభావం పోలీసుల పైన ఎక్కువగానే ఉంది. 'టీచర్లను విడుదల చేయండి' Bandi sanjay on GO 317: జీవో 317ను సవరించాలంటూ ప్రగతిభవన్ వద్ద ఆందోళన చేపట్టిన టీచర్లను వెంటనే విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే భాజపా తరఫున ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.భాగ్యనగరంలో పతంగుల పండుగ Kite Festival in Hyderabad: భాగ్యనగరంలో పతంగుల పండుగను చిన్నాపెద్ద కలిసి సందడిగా చేసుకుంటున్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సోనూ సోదరికి టికెట్ Punjab Election 2022: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్‌కు చోటు దక్కింది.'అమెరికా వెళ్లినా.. బైడెన్లా చేయరట!' Kerala CM US visit: అమెరికా వెళ్లినా.. ముఖ్యమంత్రి బాధ్యతలను తానే నిర్వర్తిస్తానని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. వేరే వ్యక్తికి పాలనాపగ్గాలు అప్పగించేది లేదని స్పష్టం చేశారు.సినిమా ఛాన్స్ పేరుతో లైంగిక దాడి! Film maker sexual assault: సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఆశ చూపి.. ఓ బాలికను లైంగికంగా వేధించాడు ఓ ఫిల్మ్ మేకర్. నిందితుడిని ముంబయి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరోవైపు, ఒడిశాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.డ్రైవర్‌కు ఫిట్స్.. కాపాడిన మహిళ ! Woman Drives Bus: పర్యటకులతో ప్రయాణిస్తున్న ఆ మినీ బస్సు హఠాత్తుగా నడిరోడ్డుపై ఆగిపోయింది. డ్రైవర్ సొమ్మసిల్లి పడిపోయాడు. పిల్లలు ఏడవడం ప్రారంభించారు. అప్పుడే ఓ మహిళ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సచిన్‌కు షాక్- రూ. 410 కోట్ల ఆస్తుల జప్తు! SRA fraud case: మనీలాండరింగ్ కేసులో ఓంకార్ గ్రూప్, యాక్టర్ సచిన్ జోషికి(వైకింగ్ గ్రూప్) చెందిన రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జప్తు చేసింది.సీఎస్కే సారథిగా జడ్డు..! Ravindra Jadeja CSK: ఈ సారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా రవీంద్ర జడేజా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే పలువురు మాజీలు కూడా ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్ అయ్యే అర్హత జడేజాకే ఉందని అభిప్రాయపడ్డారు.