ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఆ వీడియో తీవ్ర క్షోభకు గురిచేసింది కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వనమా లేఖ విడుదల చేశారు. పాల్వంచ ఘటన దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రామకృష్ణ ఇంట్లో జరిగిన విషాదం తనను తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. 'వాళ్లకి సెలవుల్లేవ్..'DH Srinivas on Covid Third Wave: రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిద్ధం ఉందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో దశ నుంచి త్వరగా బయటపడవచ్చని చెప్పారు. ' రాఘవను వెంటనే అరెస్టు చేయాలి' Komatireddy Venkat reddy: వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాఘవ అరెస్టుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆ పార్టీలో నేతల మధ్య కొరవడిన సఖ్యత..!internal disputes in congress : కాంగ్రెస్ పార్టీలో.. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. తరచూ వివాదాస్పదం కావడం.. ఆ తర్వాత.. ఇలాంటి ప్రకటనలే చేయడం పరిపాటి.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరు పగ్గాలు చేపట్టినా పార్టీ బలోపేతం కంటే... ఈ సమస్యలే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పరిస్థితి ఇదే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రపతితో మోదీ భేటీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై మాట్లాడారు. ఈ విషయంపై రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.'అలా ఓటింగ్ సాధ్యమేనా?'virtual elections: కరోనా నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఉత్తరాఖండ్ హైకోర్టు. వర్చువల్‌గా ఎన్నికల ర్యాలీలు, ఆన్లైన్ ఓటింగ్ కల్పించటం సాధ్యమేనా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. జనవరి 12లోపు స్పందించాలని ఆదేశించింది. 'బుల్లీ బాయ్ యాప్' కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్Bulli bai controversy: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌ని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసోం నుంచి దిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.గర్భిణీపై ఆస్పత్రి అధికారుల కర్కశత్వంPregnant women not allowed to hospital: కరోనా మహమ్మారి.. మనుషుల్లో 'జాలి' అనే గుణాన్ని దెబ్బతీస్తోందనడానికి సాక్ష్యంగా నిలిచిన ఘటన ఇది. ఓ గర్భిణీ వద్ద కొవిడ్ పరీక్ష ఫలితం లేదన్న కారణంతో.. ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై... చివరకు తన బిడ్డను పోగొట్టుకుంది.ఆమె మాటలకు సమంత ఫిదాSamantha news: స్టార్ ప్రియాంక చోప్రా పోస్ట్ చేసిన వీడియోకు ఫిదా అయింది ముద్దుగుమ్మ సమంత. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? పంత్‌పై ఫైర్Gambhir fires on panth: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఔట్ అయిన తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గంభీర్ కూడా పంత్‌ను విమర్శిస్తూ మండిపడ్డాడు.