తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Sep 6, 2022, 9:00 AM IST

  • రూ.35వేల కోట్ల రుణాలకు కేంద్రం కోత

Telangana Loans News : ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో ప్రభుత్వం తీసుకునే రుణాల్లో కేంద్రప్రభుత్వం కోత విధించింది. ఏడాదికి రూ.8,814 కోట్ల మేర తగ్గించింది. దీంతో రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో తీసుకునే అప్పుల్లో ప్రతి ఏటా రూ.8,814 కోట్లు కోత పడనుంది.

  • బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత

food poison in wardhannapet girls hostel: బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో బల్లి పడిన అన్నం తిని 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 34 మంది విద్యార్థినుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందుతోందని.. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి సత్యవతి రాఠోడ్ భరోసా ఇచ్చారు.

  • 'బడిలో మత స్వేచ్ఛ ఉంటుందా?'

Hijab Supreme Court: ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే యూనిఫాం ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ హిజాబ్​ ధరించొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై జరిగిన వాదనల్లో పై వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు తమకు దేశంలో వైద్య విద్య కొనసాగించే అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

  • 'సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదానికి కారణాలు అవే'

Cyrus Mistry Car Accident: ప్రముఖ పారిశ్రామిక వేత్త​ సైరస్​ మిస్త్రీ.. కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడానికి మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్ణయ లోపమే కారణమని పోలీసులు తెలిపారు. దుర్ఘటన జరిగే సమయంలో వెనుక సీట్లో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నైపుణ్యంలేని డ్రైవర్లు అధునాతన కార్లు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

  • హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించిన మహిళ

Sleep Internship 2022: కంటి నిండా నిద్ర పోవడం వల్ల రూ.5 లక్షలు సంపాదించింది ఓ మహిళ. బంగాల్​కు చెందిన త్రిపర్ణా చక్రవర్తి.. భారత తొలి స్లీప్ ఛాంపియన్​షిప్ టైటిల్​ను దక్కించుకుంది. అసలు నిద్రపోవడం వల్ల ఎందుకు ఇంత డబ్బులు వచ్చాయి? అన్ని డబ్బులు ఎవరు ఇచ్చారు?

  • మన కార్లు ఎంత సురక్షితం?

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో మరోసారి వాహనాల భద్రతపై చర్చ మొదలైంది. ఇదివరకు కార్ల బడ్జెట్ గురించే ఆలోచించే వాహనదారుల ధోరణి ప్రస్తుతం మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. 'ఎంతవరకు సురక్షితం' అనే అంశమూ బడ్జెట్‌ కార్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొంటున్నారు.

  • లంకపై పోరుకు సిద్ధమైన భారత్

ఎన్నో అంచనాలతో.. మరెన్నో ఆశలతో ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌ కొట్టాలని బరిలో దిగిన టీమ్‌ఇండియాకు సంకటస్థితి. రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్‌కు కఠిన పరీక్ష. ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ది చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో రోహిత్‌ సేన తలపడుతుంది. సూపర్‌-4లో తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమితో దెబ్బతిన్న జట్టు.. లంకతో పోరులో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. బౌలింగ్‌ ప్రదర్శన మారితేనే జట్టు విజయం సాధించే అవకాశం ఉంది.

  • 'అర్ష్​దీప్​కు ఖలిస్థాన్​ ఉద్యమానికి లింకులు'.. కేంద్రం ఫైర్

క్రికెటర్​ అర్ష్​దీప్​ సింగ్​పై వికిపీడియాలో ప్రచురితమైన తప్పుడు సమాచారాన్ని ఖండించింది భారత ప్రభుత్వం. ఈ విషయమై ప్రముఖ వికిపీడియాను హెచ్చరించింది. అసలేమైందంటే..

  • 'ఉగ్ర' రూపంలో అల్లరి నరేష్​

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉగ్రం'. 'నాంది' వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. మిర్నా మేనన్‌ కథానాయిక. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. సోమవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది.

  • సంతోషంగా జీవించడం ఎలాగో చెబుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

కార్తికేయ 2’తో భారీ విజయాన్ని అందుకొని సంబరాల్లో మునిగి తేలుతుంది అనుపమ. సంతోషంగా జీవించడం ఎలా అని చెబుతానంటోంది ఈ ముద్దుగుమ్మ. అదెలాగో తెలుసుకుందామా

ABOUT THE AUTHOR

...view details