తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ 5PM - టాప్​న్యూస్ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Sep 4, 2022, 4:58 PM IST

  • టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ మిస్త్రీ మృతి

టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ సైరస్​ మిస్త్రీ కన్నుమూశారు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన కారు డివైడర్​ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • రీల్స్​ చేయబోయాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

సోషల్​ మీడియా వేదికగా ఫేమస్​ అయ్యేందుకు కొందరు చేస్తున్న పనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నా.. అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

  • 'రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు చోరీలు చేసేవారు'

రేవంత్​రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు చోరీలు చేసేవారని భాజపా నేత రాజగోపాల్​రెడ్డి ధ్వజమెత్తారు. డబ్బు సంచులతో తెరాస రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి.. ప్రజాస్వామ్య పాలన రావాలనే రాజీనామా చేసి భాజపాలో చేరానన్నారు.

  • పేద బిడ్డలు చదువుతుంటే ఓర్వలేవా కేసీఆర్?: రేవంత్​రెడ్డి

చదువుల తల్లి నీడలో పేదల బిడ్డలు ఆకలి కేకలు వేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. సరస్వతీ పుత్రులపై సీఎం కేసీఆర్ కక్షగట్టారన్న రేవంత్... పేద బిడ్డలు చదువుతుంటే ఓర్వలేవా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియోని ట్విటర్​లో పోస్ట్ చేశారు.

  • 'అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలి'

మంగళవారం నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్‌ పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సంయుక్తంగా టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

  • అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టిన మేనత్త.. దెబ్బలు తాళలేక..!

తరచూ అల్లరి చేస్తున్నాడనే కోపంతో ఓ మేనత్త తన పదేళ్ల మేనల్లుడిని ఇష్టానుసారంగా కొట్టింది. దెబ్బలు తాళలేక ఆ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

  • 'దేశంలో విద్వేషం పెరుగుతోంది.. ఆ ఇద్దరు మాత్రం లాభపడుతున్నారు'

భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విడగొడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల దేశంలో విద్వేషం అధికమవుతోందని అన్నారు. దీని వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారని ఆరోపించారు.

  • దాయాదితో పోరుకు సిద్ధం.. జడేజా స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

చిరకాల ప్రత్యర్థుల ఆటను తిలకించేందుకు మనకు మరో అవకాశం లభించింది. ఇప్పటికే దాయాది దేశంపై విజయంతో జోష్‌ మీద ఉన్న టీమ్‌ఇండియా.. సూపర్‌ 4లో భాగంగా పాక్​తో తలపడనుంది. అయితే కీలక ఆటగాడు రవీంద్ర జడేజాకు గాయం కావడం వల్ల అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

  • క్యాన్సర్​ వస్తే మరణం తప్పదా.. ఇది ఎంతవరకు నిజం?

క్యాన్సర్​ వచ్చిందంటే చాలు మరణం తప్పదని భావిస్తారు. అయితే ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన చాలా రకాల క్యాన్సర్లకు ఉత్తమ చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్‌తో మరణమనేది ప్రజలకున్న అపోహ మాత్రమే అని.. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • 'లైగర్‌' మూవీ ఎఫెక్ట్‌.. నిర్మాత ఛార్మి షాకింగ్‌ నిర్ణయం!

బాక్సాఫీస్ వద్ద 'లైగర్‌' సినిమా పరాజయంతో చిత్ర నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details