తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana top news 5పీఎం టాప్​న్యూస్ - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news 5Pm
Top news 5Pm

By

Published : Aug 28, 2022, 4:58 PM IST

  • పేకమేడల్లా కూలిన ట్విన్​ టవర్స్

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో అక్రమంగా నిర్మితమైన వంద మీటర్లు ఎత్తయిన జంట టవర్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ముంబయికి చెందిన ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డిమాలిషన్స్‌ కలిసి ఈ పని విజయవంతంగా చేపట్టాయి.

  • కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారు

కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

  • రైతు సంఘాల నేతలతో రెండో రోజు కొనసాగుతోన్న సీఎం కేసీఆర్​ సమావేశం

దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కర్షక సంఘాల నేతలతో సీఎం కేసీఆర్​ రెండో రోజు సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగ సంక్షేమం, పరిస్థితులు, వ్యవసాయ రంగ సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాలపై రైతు సంఘాల నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు.

  • మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌ ఆత్మహత్య, అసలేమైంది

తెలంగాణ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో చనిపోయాడు.

  • దంపతుల దారుణ హత్య, కర్రతో కొట్టి, కత్తితో గొంతు కోసి

ఆంధ్రప్రదేశ్‌ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దోపిడీ కోసం వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం జిల్లాలో సంచలనం సృషించింది.

  • దిల్లీ లిక్కర్‌ స్కాంలో వైఎస్ భారతి, విజయసాయి సూత్రధారులన్న ఆనం

దిల్లీ లిక్కర్‌ స్కాంకు వైఎస్​ భారతి, ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులని తెలుగుదేశం ఆరోపించింది. అందుకే దిల్లీలో తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ఆ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

  • చిన్నారి కళ్లు, నోట్లో ఫెవిక్విక్ పోసి చెరువులో పడేసిన ఉన్మాది, కుక్కపై అత్యాచారం

ఆరేళ్ల చిన్నారి కళ్లతో పాటు నోటిలో ఫెవిక్విక్​ గమ్ పోసి అతికించి దారుణంగా ప్రవర్తించింది ఓ మహిళ. అనంతరం ఆ పిల్లవాడిని చెరువులో పడేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది. మరోవైపు మహారాష్ట్రలోని పుణెలో కుక్కపై పలుమార్లు అసహజ చర్యకు పాల్పడుతున్న ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • ఫ్యాన్స్​ జాగ్రత్త, భారత్​ పాక్​ మ్యాచ్ చూస్తే రూ.5 వేలు జరిమానా

ఆసియా కప్‌ 2022లో భాగంగా నేడు జరగనున్న టీమ్​ఇండియా పాకిస్థాన్​ మ్యాచ్​ చూడారాదంటూ ఓ కాలేజీ ఆంక్షలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

  • స్టేజ్‌పై అభిమాని కాళ్లకు నమస్కరించిన స్టార్​హీరో, ఎందుకంటే

అభిమాని కాళ్లకు నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్ . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అభిమాని కాళ్లకు హృతిక్‌ ఎందుకు నమస్కారం చేశారంటే?

  • ఆస్కార్​ రేసులో అలియా భట్​ సినిమా

సినీ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఆస్కార్‌' వేదికపై ఈసారి భారతదేశం నుంచి పోటీ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్', శ్యామ్​సింగరాయ్​ వంటి చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ బరికి నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు రాగా.. ఇప్పుడు, మరో బీటౌన్‌ సినిమా పేరూ వినిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details