తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్​ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY

By

Published : Aug 28, 2022, 11:01 AM IST

  • కానిస్టేబుల్‌ రాతపరీక్ష ప్రారంభం

Constable Exam in Telangana రాష్ట్రంలో కానిస్టేబుల్​ రాత పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,601 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్​ నియామక మండలి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిమిషం ఆలస్యం నిబంధనలు అమలులో ఉండటంతో.. పరీక్ష కేంద్రం వద్ద వేకువజాము నుంచే అభ్యర్థులు బారులు తీరారు.

  • నిండుకుండల్లా జలాశయాలు

Heavy Inflow to Reservoirs రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు అన్నీ నిండుకుండలుగా మారాయి. నాగార్జునసాగర్​ 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తరవాత నెలలో వచ్చే వరద నీరును సైతం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

  • సూపర్​ మార్కెట్​లో అగ్నిప్రమాదం

Fire accident in nizamabad నిజామాబాద్​లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని టీ మార్ట్ సూపర్ మార్కెట్‌లో మంటలు చెలరేగి వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

  • పిల్లలకు ఈత నేర్పిస్తానంటూ అత్యాచారం

Rape on Women అవసరాన్ని ఆసరాగా తీసుకున్నాడు. అదే అదునుగా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇంకేముంది మనోడి నిజస్వరూపాన్ని చూపించాడు. బ్లాక్​మెయిల్​ చేస్తూ వివాహితపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లో చోటు చేసుకుంది.

  • బిందెలో ఇరుక్కున్న బుడ్డోడు

Boy stuck పిల్లలు చేసే సరదా పనులు అప్పుడప్పుడు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు తలనొప్పిని తెప్పిస్తుంటాయి. వారికి లోకజ్ఞానం లేకపోవడమో లేదా ప్రమాదమని తెలవకపోవడం చేత కొన్ని సార్లు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అలాంటి సంఘటనే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

  • సోనాలీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

టిక్‌టాక్ స్టార్, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్‌ హత్య కేసుకు సంబంధించి మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. ఆమె బస చేసిన గదిలో ఉన్న డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు

  • కొత్తగా 9వేల కరోనా కేసులు

Corona Cases in India భారత్​లో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • వినోదాల మైదానంలో ఓటీటీ ఆట

నెలకు 5 గంటలకు పైగా ఓటీటీలను 50 శాతం మందికి పైగా వినియోగిస్తుండడంతో సినిమా థియేటర్‌ లాభాలను ఓటీటీలు తినేస్తున్నాయి. ప్రధాన స్టూడియోలు, నిర్మాణ సంస్థలు కూడా ఈ స్ట్రీమింగ్‌ సిరీస్‌లకున్న గిరాకీని గమనించాయి.

  • క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్

Rahul Dravid corona negative కరోనా బారిన పడిన టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ వైరస్​ బారి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసియా కప్​ కోసం దుబాయ్​ చేరుకుని జట్టుతో కలిశాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

  • జాతిరత్నాలు డైరెక్టర్‌ భారీ స్కెచ్‌

జాతిరత్నాలు సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కేవీ అనుదీప్​. ఆ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన వినోదాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం ఆయన హీరో శివ కార్తికేయన్‌తో ప్రిన్స్‌ సినిమా తీస్తూనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు కథను అందించారు. ఈ నేపథ్యంలో అనుదీప్​ సరికొత్త విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.

ABOUT THE AUTHOR

...view details