ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుటొమాటో ఫ్లూ డేంజర్ బెల్స్.. Tomato Flu భారత్‌లో మరో వైరస్ కలకలం రేపుతోంది. టొమాటో ఫ్లూ అనే వైరస్ కేరళ, ఒడిశాలలో విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలకు సోకుతుందని ఓ అధ్యయనం తెలిపింది.ఆసరా అయోమయం..New Pensions in Telangana స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రతి మండలానికి కేవలం 48 కార్డులు మాత్రమే వచ్చాయి. వాటిని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు. అర్హుల జాబితాలు రాకపోవడంతో కొత్త ఆసరా పింఛన్లపై సందిగ్ధం నెలకొంది.భారీ బందోబస్తు నడుమ మునాషార్ కామెడీ షో.. Munawar Faruqui నాటకీయ పరిణామాల అనంతరం హైదరాబాద్ శిల్పకళావేదికలో మునాషార్ స్టాండప్ కామెడీ షో జరిగింది. షోను అడ్డుకుంటామన్న భాజపా హెచ్చరికలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షోను అడ్డుకునేందుకు యత్నించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.తమ్మినేని కుటుంబీకుల అసంతృప్తి..రాష్ట్రంలో సంచలనంగా మారిన తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై తన కుటుంబీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టుతో పాటు కేసు దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టులో తమ్మినేని కోటేశ్వర్‌రావును ఏ1 నిందితుడిగా చేర్చలేదని ఆరోపించారు.ఎవరికీ భయపడేది లేదు.. cm kcr comments in praja deevena sabha నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదన్న సీఎం విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాజపాను గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారన్న కేసీఆర్ ప్రజలు తెరాసను గెలిపించి భాజపాకు మీటర్ పెట్టాలని స్పష్టం చేశారు.మరో ఎస్సీ వ్యక్తికి సీఎం జగన్ ఉరి వేశారు..Chandrababu on CM Jagan ఏపీలో రోజుకో దళితుడు ప్రాణాలు కోల్పోతున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో కరుణాకర్ అనే యువకుడి ఆత్మహత్యకు వైకాపా నేతల వేధింపులే కారణమని ఆయన ధ్వజమెత్తారు.11 నెలల చిన్నారిని నదిలో విసిరేసిన తండ్రి.. గుజరాత్లో నిరుద్యోగం కారణంగా ఓ వ్యక్తి తన 11 నెలల చిన్నారిని నదిలో విసిరేశాడు. భిక్షాటన చేస్తూ జీవనం సాగించలేక ఈ పనిచేసినట్లు పోలీసులతో చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.కిమ్ ఎమోషనల్, కంటతడి పెట్టించేలా స్పీచ్..ఎప్పుడూ యుద్ధ నినాదాలు, అణు హెచ్చరికలతో మండే అగ్ని గోళంగా ఉండే ఉత్తర కొరియా నియంత కిమ్ తన హృద్యమైన ప్రసంగంతో కంటతడి పెట్టించారు. కరోనా వేళ దేశానికి అండగా నిలిచిన ఆర్మీ వైద్యులను ఉద్దేశించి కిమ్ చేసిన వ్యాఖ్యలు వారి హృదయాలను హత్తుకున్నాయి. తమ అధ్యక్షుడి మాటలతో తీవ్ర భావోద్వేగానికి గురైన వైద్యులు చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చారు. ఇంతకీ అసలు కిమ్ ఏం అన్నారు. రణరంగంలోనూ సేవలందించే ఆర్మీ వైద్యులు అంతలా ఎందుకు ఏడ్చారో ఈ కథనంలో చూద్దాం.భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం.. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది.సిల్వర్ కలర్ డ్రెస్‌లో శార్వరీ వా అందాల ఖజానా..శార్వరి వా... 'ప్యార్ కా పంచ్‌నామా 2', 'బాజీరావ్ మస్తానీ', 'సోనూ కె టిట్టు కీ స్వీటీ' సినిమాలకు పనిచేసింది. ఆ తర్వాత బంటీ ఔర్ బబ్లీ 2తో హీరోయిన్గా మారింది. ప్రస్తుతం మాహారాజా మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్‌మీడియాలో తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటోంది.