తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 26, 2022, 1:02 PM IST

  • BAD NEWS : కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం

కామన్‌వెల్త్ గేమ్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న నీరజ్​ చోప్రా.. ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు.

  • కార్గిల్​ అమర వీరులకు ఘన నివాళి

Kargil vijay diwas 2022: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని సైనిక అమరవీరులకు యావత్‌ భారత జాతి ఘననివాళి అర్పించింది. ఈ విజయం సైనికుల పరాక్రమానికి, దేశ గౌరవానికి చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కొనియాడారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులు, వారి కుటుంబాలకు దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

  • అర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది..!

Heavy Rain in Hyderabad : హైదరాబాద్​లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. ఇప్పటికే చెరువులన్నీ దాదాపుగా నిండిపోవటం.. ఊహించని రీతిలో మళ్లీ వర్షం రావటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. కాలనీలు, అపార్ట్​మెంట్లు జలమయం కావటంతో.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.

  • సెల్లార్​లోకి వరద .. నీటమునిగిన వాహనాలు

Flood at Apartment Cellar : రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ నాంపల్లి పటేల్​నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లోకి వరద నీరు చేరింది. సెల్లార్​ పూర్తిగా నీటితో నిండిపోగా.. పార్కింగ్​లో నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. ఫలితంగా అపార్ట్​మెంట్​ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • రహదారిపై అలుగు..

heavy rain in vikarabad :వికారాబాద్​ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు కోటిపల్లి నిండుకుండలా మారింది.

  • కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు

kadem Project latest news: ఇటీవల భారీ వరద తాకిడికి దెబ్బతిన్న.. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు మొదలుపెట్టారు. హైదరాబాద్​కు చెందిన ఓ కన్​స్ట్రక్షన్​ కంపెనీ మొత్తం ఎనిమిది మంది సభ్యులతో పనులు మొదలుపెట్టింది. గ్యాస్ వెల్డింగ్​తో దెబ్బతిన్న గేట్ల రేకులను తొలగిస్తున్నారు.

  • ఈడీ విచారణకు సోనియా.. పోలీసుల అదుపులో రాహుల్​

సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు చేపడుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాహుల్​ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్​ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్​ సహా 17 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం, పార్లమెంటు ఆవరణల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఖర్గే, కేటీఎస్ తుల్సీ, చిదంబరం, వివేక్​ తన్ఖా వంటి సీనియర్లు పోలీసుల అదుపులో ఉన్న నేతల జాబితాలో ఉన్నారు.

  • అనారోగ్యంతో ఉన్న కొండముచ్చుకు ఓఆర్​ఎస్

ఉత్తరాఖండ్​ హరిద్వార్​ పోలీసులు తమ మంచి మనసును చాటుకున్నారు. కావడి యాత్ర వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసుల వద్దకు ఓ కొండముచ్చు వచ్చింది. మొదట ఎందుకు వచ్చిందో తెలియని పోలీసులు తర్వాత కొండముచ్చు అనారోగ్యంతో ఉందని గ్రహించారు. వెంటనే జగ్వీర్​ రాణా అనే కానిస్టేబుల్ ఓఆర్​ఎస్ ద్రావణాన్ని వాటర్​ బాటిల్​తో కొండముచ్చుకు అందించి దాని దాహాన్ని తీర్చారు. పోలీసుల తీరు పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • ప్రముఖ నటుడు డేవిడ్ వార్నర్ కన్నుమూత

David Warner passed away: ప్రముఖ హాలీవుడ్​ నటుడు డేవిడ్ వార్నర్(80) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details