ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు.. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపోటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వానతో.... వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.ఇక నుంచి తెలుగు తప్పనిసరి..ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పాఠశాలలతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ పాఠశాలలు కూడా కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్ఈ తదితర బోర్డుల పాఠశాలల పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ద్వితీయ భాషగా తెలుగును రాయాల్సిందేనని పేర్కొంది. తెలుగు సబ్జెక్టు బోధన అమలు చేయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.ఆ ఇన్‌స్పెక్టర్ నన్ను అత్యాచారం చేశాడు..! Woman accuses Inspector of rape : తన భర్తపై దాడి చేసి.. తనను అపహరించి ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేసుకున్నారు.'ఆ నలుగురు' రిపీట్..ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలను కోటశ్రీనివాస రావు అడ్డుకుంటాడు. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించే వరకు దహనసంస్కారాలు జరగనీయనని భీష్మించుకు కూర్చుంటాడు. దాదాపు ఇలాంటి సీనే జగిత్యాల జిల్లాలో రిపీట్ అయింది. కానీ ఇక్కడ చనిపోయింది ఓ భర్త. అంత్యక్రియలు అడ్డుకుంది మాత్రం బయట అప్పిచ్చిన వాళ్లెవరో కాదు. స్వయంగా అతని భార్యలే.సీజేఐకి నిందితుడి తల్లి లేఖ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణకు ఏపీలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణం విడుదల చేయాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు.16కు చేరిన మృతులు..అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 16కు పెరిగింది. పలువురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.టమాటల ట్రక్ బీభత్సం.. ఆరుగురు మృతి.. పికప్ ట్రక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న ఏడుగురి పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.స్వల్పంగా పెరిగిన బంగారం ధర..బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.లండన్ వీధుల్లో 'దాదా' చిందులు.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తన 50వ పుట్టినరోజు వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకున్నాడు. అక్కడి వీధుల్లో కుటుంబం, మిత్రులతో కలిసి పలు హిట్ సాంగ్‌లకు చిందులేస్తూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.మహేశ్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్మహేశ్బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించింది.