ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుతేజస్'వైపే మలేసియా మొగ్గు తేజస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు మలేసియా ఆసక్తి చూపుతోంది. తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్ తయారీ మిగ్-29 యుద్ధవిమానాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించిన మలేసియా.. తేజస్వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.విప్లవ జ్యోతి.. స్వరాజ్య సమర ఖ్యాతి.. మన అల్లూరిఅల్లూరి సీతారామరాజు ధైర్యం, తెగువ ఎనలేనిది. అల్లూరి త్యాగనిరతి చాలా గొప్పవని ఓ సారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన మహాత్మా గాంధీ ప్రశసించారు. ఆయన తిరుగుబాటుదారుడు కాదు.. యువతకు ఆదర్శప్రాయుడు అంటూ కీర్తించారు. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అల్లూరి ముందుకు సాగారు.జోష్‌లో కమలదళం.. 2023 ఎన్నికలే లక్ష్యం హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు, అనంతరం మోదీ విజయ సంకల్ప సభ విజయవంతంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పనిచేయాలని అగ్రనేతలు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వానికి అగ్రనేతల ప్రశంసలు కురిపించారు.కాకతీయ మెగా జౌళి పార్కుకు మోక్షం?రాష్ట్రంలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనతో ప్రభుత్వ, పారిశ్రామిక, జౌళి వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అర్హతలు.. వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా జౌళి పార్కుకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా ప్రకటన ఆశాజనకంగా మారింది.కొత్త పాసు పుస్తకాల జారీలో జాప్యం.. అసైన్డ్, ఇనాం లబ్ధిదారులకు శాపం రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది అసైన్డ్, ఇనాం భూముల లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూములు తమవే అయినా.. ఆ భూములపై ఎలాంటి హక్కులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017 సెప్టెంబరు ముందు వరకు ఈ భూములకు పాత పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయి. భూదస్త్రాల ప్రక్షాళన అనంతరం రెవెన్యూశాఖ వీటిలో చాలా భూములకు కొత్త పట్టా పుస్తకాలు జారీ చేయలేదు. ఫలితంగా పంటల సాగు కోసం రుణాలు పొందలేక, రైతుబంధు వంటివి అందుకోలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.ఐదు రూపాయల డాక్టర్ఈ రోజుల్లో చిన్న రోగం వచ్చి ఆస్పత్రులకు వెళ్తే చాలు.. వైద్య ఖర్చులకు జేబులన్నీ ఖాళీ అవుతున్నాయి. కానీ.. ఓ వైద్యుడు మాత్రం కేవలం ఐదు రూపాయలే ఫీజుగా తీసుకుని చికిత్స చేస్తున్నారు. పేద ప్రజల ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని చౌకగా మంచి మందులు ఇస్తున్నారు. 'ఐదు రూపాయల డాక్టర్'గా ప్రసిద్ధి చెందిన ఆయన ఎవరో మీరూ చూడండి.ఉద్యోగం ఊరికే రాదు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలతో దళారులు భాగ్యనగరంలో పాగా వేశారు. డబ్బును బట్టి మంచి అవకాశాలంటూ యువతకు వల వేస్తున్నారు. పలుకుబడితో కోరిన కొలువు ఇప్పిస్తామంటూ బేరసారాలు ఆడి వారిని నట్టేట మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్సైట్లు సృష్టించి మరీ.. వారి కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మార్గాల్లో డబ్బులకు ఉద్యోగాలిస్తామంటే నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.కొత్త ముష్కరులపై ఉక్కుపాదంజమ్ము కశ్మీర్లో ముష్కరులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతలో అధిక మంది తొలి ఏడాదిలోనే హతమవుతున్నట్లు తేలింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భద్రతా దళాల చేతిలో 90 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు నివేదికలో అధికారులు వెల్లడించారు. అందులో 26 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు స్పష్టం చేశారు.పెట్రోల్‌పై సుంకం తగ్గించినా.. ఖజానాకు నష్టం తక్కువే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. ఇందువల్ల ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఇంధనంపై ఎగుమతి సుంకం, ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను.. ఆ లోటును భర్తీ చేయనుందని తెలుస్తోంది.సెంచరీ కొట్టిన సెంటర్ కోర్టుటెన్నిస్ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో వింబుల్డన్ ఎంతో ప్రత్యేకం. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో ఉన్న సెంటర్ కోర్టుకు మరింత ప్రాముఖ్యం ఉంది. 1922, జులై 3న ప్రారంభమైన ఈ సెంటర్ కోర్టు ఆదివారం శతవసంతాలు పూర్తి చేసుకుంది. సాధారణంగా 14 రోజులు జరిగే వింబుల్డన్‌లో తొలి ఆదివారం విశ్రాంతి. కానీ సెంటర్ కోర్టు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కూడా పోటీలు నిర్వహించడం విశేషం.