తెలంగాణ

telangana

ETV Bharat / city

TELANGANA TOP NEWS : టాప్ న్యూస్ @7AM - top news in telangana today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana today
top news in telangana today

By

Published : Feb 18, 2022, 7:00 AM IST

  • పెద్దమ్మ ఆగమనం

వనం వీడి.. జనం మధ్యకు వచ్చిన సమ్మక్కకు.. భక్తజనం జేజేలు పలికారు. తండోపతండాలుగా తరలివచ్చి తల్లికి దండాలుపెట్టారు. మొక్కులు చెల్లించుకొని చల్లంగా చూడాలని వేడుకున్నారు. వన దేవతలంతా గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు అర్ధరాత్రి వరకూ దర్శనాలు చేసుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.

  • 'నీట్‌ ఎండీఎస్‌ పరీక్ష 4-6 వారాలు వాయిదా'

నీట్‌ ఎండీఎస్‌-2022 పరీక్షను 4-6 వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. 2022 మార్చి 31తో పూర్తి కావాల్సిన ఇంటర్న్‌షిప్‌ గడువును జులై 31 వరకూ పొడిగించింది.

  • వీడని విభజన ముడి

తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరగ్గా.. రెండు అంశాలపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన అన్ని విషయాలపై సాంకేతిక అంశాలు అధ్యయనం చేసి.. నెల రోజుల్లో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

  • సింగరేణికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

సింగరేణి సంస్థకు గ్లోబల్​ సీఎస్​ఆర్​ అవార్డు లభించింది. పర్యావరణ హితంగా సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సీఎస్‌ఆర్‌ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది.

  • సాగులో పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం

పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తీరు ఏటా భారీగా పెరుగుతోంది. పైర్లు ఏపుగా పెరగాలనే ఆశతో రైతులు రసాయనాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయశాఖ 2020-21 సంవత్సరంలో చేసిన అధ్యయనంలో గుర్తించారు.

  • ఆ సమయంలో నిద్రపోతే.. బరువు తగ్గొచ్చు!

బరువు తగ్గించుకునే మార్గం పడకగదిలోనూ ఉందని గుర్తించారు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పరిశోధకులు. అధికబరువు గలవారు రాత్రిపూట మరో గంటసేపు అదనంగా నిద్రిస్తే తక్కువ తింటామని, తద్వారా బరువు తగ్గే అవకాశముందని తేల్చారు.

  • జిల్లాల్లో భూముల విక్రయంపై ఇవాళ ప్రీబిడ్ సమావేశాలు

జిల్లాల్లో భూముల అమ్మకానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశాలు జరగనున్నాయి. 8 జిల్లాల పరిధిలో ఎలాంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు భౌతిక వేలం పద్ధతిలో విక్రయించనున్నారు.

  • గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా పాలసీ నోటిఫై

గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా తయారు చేసే పాలసీని నోటిఫై చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌. 2030 కల్లా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

  • జోష్​లో టీమ్​ ఇండియా

విండీస్​పై వన్డేల్లో వైట్​వాష్​, తొలి టీ20లో విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమ్ఇండియా శుక్రవారం రెండో టీ20లో గెలిచి, సిరీస్​ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ టీ20తో మళ్లీ ఫామ్​లోకి రావాలని విండీస్​ జట్టు ఆశిస్తోంది.

  • ట్రెండ్ మారింది.. స్టోరీ సెలక్షన్ అదిరింది..!

ఒకప్పుడు తెలుగు చిత్రసీమ మూస ధోరణిలో అడుగులు వేసేది. ఏ సినిమా చూసినా అదే కథే అన్నట్టుగా ఉండేది. ఓ ప్రేమకథా చిత్రానికి విజయం దక్కిందంటే అందరూ అదే తరహా ప్రయత్నాలు చేయడంపైనే మొగ్గు చూపేవాళ్లు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. ఇప్పుడు పీరియాడిక్‌ కథలు మొదలుకొని.. ప్రేమకథల వరకు అన్ని రుచుల్నీ పంచేందుకు మన హీరోలు సిద్ధంగా ఉన్నారు. అందులో కొన్ని రాజకీయ కథలూ కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details