తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

top news in telangana today
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

By

Published : Dec 20, 2021, 6:00 AM IST

Updated : Dec 20, 2021, 10:02 PM IST

21:56 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 10 PM

  • మోతెత్తిన చావుడప్పు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ‘ఊరూరా చావు డప్పు’ పేరుతో నిర్వహించిన నిరసనల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

  • 'భాజపాకు త్వరలోనే చెడ్డ రోజులు.. ఇదే నా శాపం'

మాదకద్రవ్యాల చట్ట సవరణ బిల్లుపై చర్చ సమయంలో రాజ్యసభలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో సమాజ్​వాదీ పార్టీ నేత, ఎంపీ జయా బచ్చన్​.. అధికార భాజపా సభ్యులపై మండిపడ్డారు. భాజపా త్వరలోనే గడ్డురోజులను ఎదుర్కొంటుందని శపించారు.

  • కేంద్ర ఖజానాలోకి రూ. 4.55లక్షల కోట్లు

పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.4.55లక్షల కోట్ల మేర ఆదాయం లభించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు.

  • ఐపీఎల్ వేలం ఈసారి హైదరాబాద్​లో!

ఐపీఎల్​ వేలంకు లైన్​ క్లియర్ అయింది. 2018 తరహాలోనే ఈసారి కూడా రెండురోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

  • సమంత స్పెషల్ సాంగ్ రచ్చ

'ఊ అంటావా ఊహు అంటావా' అంటూ సమంత చేసిన సందడి దుమ్ములేపుతోంది. వ్యూస్​తో ఈ సాంగ్ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే గీతం సరికొత్త మార్క్​ను చేరుకుంది.

21:13 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

  • 'వేగవంతం చేయాలి'

కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో బీఆర్కే భవన్​లో సమావేశం నిర్వహించారు.

  • 'కోళ్లు, ఎడ్ల పందేలకు అనుమతివ్వాలి'

కోళ్లు, ఎడ్ల పందేలు నిర్వహంచుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ ఏపీ సీఎం జగన్​కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. జల్లికట్టు కంటే ఈ పందేలు ప్రమాదమైనవి కాదని.. పండుగల సమయంలో ప్రజలు జైలుకెళ్లే పరిస్థితి రాకుండా చూడాలని పద్మనాభం విజ్ఞప్తి చేశారు.

  • నీళ్లు కావాలంటే నల్లాలను వేడి చేయాల్సిందే!

లద్దాఖ్​లోని లేహ్​ ప్రజలపై 'శీతాకాలం' ప్రభావం పడింది. అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్​లోకి జారుకోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల చిన్ననీటి జలవనరులు పూర్తిగా మంచుగడ్డలుగా మారిపోయాయి. మంచినీరు కావాలంటే నల్లాలను వేడిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.

  • చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ అల్లుడు

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అల్లుడు మహమ్మద్ హురైరా చరిత్ర సృష్టించాడు. దేశవాళీ టోర్నీలో త్రిశతకం చేయడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

  • 'ఆర్ఆర్ఆర్' కోసం చరణ్ తారక్ ఇలా..

ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్​చరణ్, ఎన్టీఆర్ మేకోవర్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

19:48 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 8PM

  • వారు అర్హులే

గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల అర్హత వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

'జమ్ములో కొత్తగా ఆరు.. కశ్మీర్​లో ఒకటి

జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజనకు ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది డీలిమిటేషన్​ కమిషన్​. జమ్ములో 6, కశ్మీర్​లో ఒక స్థానం అదనంగా పెంచాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి జమ్ముకశ్మీర్​లోని ప్రధాన పార్టీలు.

  • రైలు ఇంజిన్​నే అమ్మేశాడు..

రైల్లో దొంగతనం చేయడం విన్నాం. కానీ ఏకంగా రైలు ఇంజిన్​నే దొంగిలించి అమ్మేయడం ఎప్పుడైనా విన్నారా? అవును ఈ ఘనకార్యం చేసింది ఎవరో కాదు. అదే స్టేషన్​లో పనిచేసే ఓ రైల్వే ఇంజినీర్​.

  • 375కు చేరిన మృతులు

ఫిలిప్పీన్స్‌లో రాయ్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మృతుల సంఖ్య 375కు చేరింది. ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కు పైగా మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇంకా 56మంది గల్లంతైనట్లు వివరించారు.

  • అరుదైన గౌరవం

దిగ్గజ షట్లర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్​ కమిషన్ సభ్యురాలిగా సింధు ఎంపికైంది.

18:52 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 7PM

  • సివిల్ సప్లై ఉద్యోగులకు వేతనాలు పెంపు

పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు వేతన సవరణ వర్తించనుంది. 261 మంది రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • రేపే క్రైస్తవ సోదరులకు విందు

ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులకు ఇచ్చే విందు ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ విందును ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్... క్రైస్తవ సోదరులతో కలిసి రేపు భోజనం చేస్తారని చెప్పారు.

  • 'ఆయన బయటెందుకు?'

అనారోగ్యకారణాల దృష్ట్యా విరసం నేత వరవరరావు(83)కు బాంబేహైకోర్టు పలుమార్లు బెయిల్​ పొడిగించడాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) వ్యతిరేకించింది. వైద్య చికిత్స అవసరం ఉన్న చాలామంది వృద్ధులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని స్పష్టం చేసింది. వరవరరావును జైలుకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది ఎన్​ఐఏ.

  • నాదల్​కు కరోనా

అబుదాబి ఎగ్జిబిషన్​ ఈవెంట్​లో పాల్గొన్న ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నాదల్​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు.

  • 'యశోద'లో మరో స్టార్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హరిహర వీరమల్లు, యశోద, అతిథి దేవోభవ, సుధీర్​బాబు, దుల్కర్​ సల్మాన్​కు సంబంధించిన కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

17:47 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 6PM

  • 23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం

కేఆర్​ఎంబీ ఆధ్వర్యంలో ఈ నెల 23 న చైన్నై తాగునీటి కమిటీ భేటీ కానుంది. తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై సమావేశంలో చర్చ జరగనుంది. భేటీలో ఐదు రాష్ట్రాల అధికారులు, కేఆర్​ఎంబీ ప్రతినిధులు పాల్గొననున్నారు.

  • ప్రభుత్వానికి రాహుల్​ సవాల్

విపక్షాలు లేవనెత్తిన ప్రజా ప్రయోజన అంశాలపై చర్చ చేపట్టాలని కేంద్రానికి సవాల్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. సమస్యలను లేవనెత్తకుండా తమ గొంతుకను అణచివేయలేరని స్పష్టం చేశారు. మరోవైపు.. విభజించు-పాలించు సూత్రంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత మల్లిఖార్జున్​ ఖర్గే.

  • 'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!'

కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్​ ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నప్పటికీ.. అధిక తీవ్రతను కలిగించదని అందరూ భావిస్తున్నారు. అయితే.. అలా నమ్మేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

  • కిదాంబి శ్రీకాంత్​కు ప్రశంసలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో రజత పతకం సాధించిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీతో సహా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ ఇతడిని మెచ్చుకుంటూ ట్వీట్లు

  • 'పుష్ప' పార్ట్-2 తగ్గేదే లే

'పుష్ప' సినిమా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాలోని హీరోహీరోయిన్ మధ్య లవ్​ట్రాక్​.. తన నిజజీవితంలో నుంచి స్ఫూర్తితో తెరకెక్కించానని సుకుమార్ అన్నారు. ఈ విషయం తెలిసిన తన భార్య.. తిట్టిందని చెప్పారు.

16:32 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 5PM

  • గ్రీన్‌ సిగ్నల్‌

ఓటరు ఐడీని ఆధార్​తో అనుసంధానం చేసే బిల్లుకు లోక్​సభ ఆమోదం లభించింది. బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్‌ కార్డుతో అనుసంధానించేలా కేంద్రం ఈ బిల్లును రూపొందించింది.

  • బయో సీఎన్‌జీ ప్లాంటుతో అనేక లాభాలు

సిద్దిపేటలో బయో గ్యాస్​ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ ప్లాంటుతో అనేక లాభాలున్నాయని హరీశ్​ అన్నారు. చెత్తను తగలబెట్టకుండా ఆదాయ వనరులుగా మారుస్తూ.. భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

  • ధాన్యం పంచాయితీ ‌

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీశ్​ రెడ్డి, పువ్వాడ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం హస్తినకు వెళ్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో దిల్లీ వెళ్లిన మంత్రుల బృందం... కేంద్రమంత్రి, ప్రధానమంత్రితో భేటీకి యత్నాలు చేస్తున్నారు.

  • మార్కెట్లపై ఒమిక్రాన్​ పంజా

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ఒమిక్రాన్​ కేసులు పెరుగుదల భయాలతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ 1190 పాయింట్లు నష్టపోయి 56వేల దిగువకు చేరింది. నిఫ్టీ 371 పాయింట్ల దిగజారింది.

  • తిరుపతిలో 'పుష్ప' సక్సెస్​మీట్

పుష్ప' గ్రాస్​ కలెక్షన్, సక్సెస్​మీట్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నిర్మాతలు. తిరుపతిలో ఈ ఈవెంట్​ జరుగుతుందని వెల్లడించారు.

15:32 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 4PM

  • కళతప్పిన ఫ్రూట్ మార్కెట్

ఎప్పుడూ వివిధ రకాల ఫలాలతో కళకళలాడే పండ్ల మార్కెట్‌ ఇప్పుడు కళతప్పింది. దూర ప్రాంతాల నుంచి లారీలు, ట్రక్కుల్లో వచ్చిన పండ్లను స్థానిక వ్యాపారులు ఆటోలు, ట్రాలీల్లో తీసుకెళ్తూ హడావిడిగా కనిపించే గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌... ఇప్పుడు వాహన చప్పుడు లేకుండా నిశ్శబ్ధంగా ఉంది. వ్యాపార కార్యక్రమాలు లేక 73 రోజులుగా వ్యాపార బోసిపోతోంది.

  • బ్లాక్​ ఇడ్లీ..

దక్షిణ భారత దేశంలో ఫేమస్ అల్పాహారం ఇడ్లీ. ఇడ్లీలను సులభంగా చేసుకోవచ్చు. తింటే తేలికగా జీర్ణం అవుతాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టపడుతుంటారు. అయితే.. ఇడ్లీలు అనగానే తెలుపు రంగులోనే ఉంటాయి కదా? మరి నలుపు రంగులో ఉండే ఇడ్లీలను ఎప్పుడైనా చూశారా?

  • స్మగ్లర్ల తెలివికి అధికారులు షాక్

ముంబయి విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కెన్యా నుంచి వచ్చిన మహిళల వద్ద 3.8 కిలోల పసిడిని పట్టుకున్నారు.

  • రెండో టెస్టూ ఆసీస్​దే

యాషెస్ సిరీస్​లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ కావడం వల్ల.. 275 పరుగుల తేడాతో విజయం సాధించింది కంగారూ జట్టు.

  • కంటతడి పెట్టించిన హిజ్రాలు

ప్రతివారం కొత్త కొత్త కాన్సెప్ట్​లతో అబ్బురపరుస్తూ వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ'.. ఈసారి కంటతడి పెట్టించింది. అలానే ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అలరిస్తోంది.

14:42 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 3PM

  • ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్​

పనామా పత్రాల కేసులో ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్​ ఈడీ ముందు హాజరయ్యారు. దిల్లీ జామ్​నగర్​ హౌస్​లోని ఈడీ కార్యాలయంలో విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారు అధికారులు.

  • ఇంటర్‌ ఫలితాలపై వామపక్షాల ఆందోళన

ఇంటర్ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ... పలు వామపక్ష విద్యార్థి సంఘాలు ఇంటర్ విద్యాసంస్థల బంద్ పాట్టిస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామన్న మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

  • రెండేళ్లలో 12 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులు

తెలంగాణ సర్కార్ పచ్చదనానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో పచ్చదనంపై అవగాహన పెంచుతోంది. ఇందులో భాగంగా హెచ్​ఎండీఏ.. పార్కులు, పచ్చదనం పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది. నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం నుంచి వాటిని నాటడం, సంరక్షణ బాధ్యతలను స్వయంగా నిర్వహిస్తోంది.

  • బిగ్​ బుల్​కు బేర్​ దెబ్బ

దిగ్గజ మదుపరి రాకేశ్​ ఝున్​ఝున్​వాలా కేవలం పది నిమిషాల్లో రూ. 230 కోట్లు సంపద కోల్పోయారు. టైటాన్​, టాటా మోటార్స్​ షేర్లు పతనం అవడమే ఇందుకు కారణం.

  • ప్రేక్షకులు లేకుండానే

టీమ్ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్​ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని చూస్తోంది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

13:59 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 2PM

  • కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస

TRS Protest Over Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబడుతున్న తెరాస.... పోరును కొనసాగిస్తోంది. సీఎం కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పలువురు ప్రజాప్రతినిధులు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

  • ఈ కిట్​.. ఒమిక్రాన్​ను పసిగట్టేస్తుంది!

Kit for Omicron detection: ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ఐసీఎమ్​ఆర్​.. ఓ కొత్త కిట్​ను రూపొందించింది. దీనిని వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచనలో ఉంది ఐసీఎమ్​ఆర్​.

  • వానరం ప్రేమ

Monkey Carrying Puppy: ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్​ జిల్లా పడరౌనా నగర్​లో ఓ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొద్ది రోజులుగా ఓ కోతి.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతోంది. కుక్క పిల్లకు కోతి పాలు కూడా ఇచ్చి సంరక్షిస్తోందని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

  • మీడియాకు విరుష్క కృతజ్ఞతలు

Anushka Sharma thanks Paparazzi: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ.. వారి గారాలపట్టి వామికా ఫొటోలు, వీడియోలు బయటపెట్టొద్దని మీడియాను కోరారు. మరోసారి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు అనుష్క. వామికా ఫొటోలు, వీడియోలను బాహ్య ప్రపంచానికి చూపించకుండా తమ విన్నపానికి విలువ ఇచ్చిన ఫొటోగ్రాఫర్లు, మీడియా వ్యక్తులకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని తెలిపారు.

  • ముంబయి వీధుల్లో విజయ్-రష్మిక

12:39 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 1PM

  • అందుకే దిల్లీ వచ్చాం..

Paddy Procurement in Telangana: యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు డిమాండ్‌ చేశారు. వర్షాకాలం పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే ఎక్కువ తీసుకోవడంపై రాత పూర్వక ప్రకటన కావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్​ చేశారు.

  • రైతు గోస దిల్లీకి వినిపిస్తాం..

TRS Protest Over Paddy Procurement : రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు తీసుకొస్తుంటే.. కేంద్రం మాత్రం తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. కేంద్రం తీరుకు నిరసనగా చావు డప్పు మోగించారు.

  • శబరిమలలో ఆంక్షల సడలింపు..

Sabarimala News: శబరిమలలో ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రోజుకు 60వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

  • 'గాడ్సే'గా సత్యదేవ్..

Deepika Padukone: కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొత్త చిత్రం టీజర్​ సహా సత్య దేవ్, రాశీ ఖన్నా సినిమాల విశేషాలున్నాయి.

  • నాపై లైంగిక దాడి జరగలేదు..

Peng Shuai U-Turn: చైనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షువాయి.. ఆ దేశ మాజీ వైస్ ప్రీమియర్​పై తాను చేసిన లైంగిన దాడి ఆరోపణలపై ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. తాను అసలు ఎవరిపై ఆరోపణలు చేయలేదని చెప్పింది.

11:47 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 12PM

  • 'ఆర్​ఆర్​ఆర్'​లో అదిరిపోయే సీన్..

Rajamouli: 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​తో సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి అదిరిపోయే ఓ సీక్రెట్​ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి.

  • ఆదివాసీ మహిళపై అమానుషం..

Women discrimination: తమిళనాడు దిండిగుల్​లో అమానుష ఘటన వెలుగు చూసింది. వ్యాపారం కోసం విల్లుపురం నుంచి దిండిగల్​ వెళ్లిన ఆదివాసీ మహిళను స్థానికంగా ఉండే ఓ వ్యక్తి బెదిరిచాడు. ఆ ప్రాంతంలో వ్యాపారం చేయొద్దని.. ఆమె వ్యాపార సామాగ్రిపై నీళ్లు పోశాడు.

  • పెరిగిన బంగారం ధర...

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాములు మేలిమి పుత్తడి ధర రూ.50వేల ఎగువన కొనసాగుతోంది. వెండి ధర కిలోకు రూ.388 తగ్గింది.

  • ఐశ్వర్య రాయ్​కు ఈడీ నోటీసులు..

Aishwarya ED notice: ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్​కు ఈడీ నోటీసులు పంపించింది. పనామా పత్రాల కేసులో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, సోమవారం విచారణకు రాలేనని ఐశ్వర్య.. ఈడీ వర్గాలకు తెలిపినట్లు సమాచారం.

  • కోహ్లీని తప్పిస్తే.. జరిగేది అదే!

Salman Butt on Kohli Test Captaincy: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. అలా చేస్తే కోహ్లీకి, రోహిత్​కు మధ్య విభేదాలు ఉన్నాయని అర్థమవుతుందని తెలిపాడు.


10:48 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 11AM

  • నిర్వాసితుల ఆవేదన

Edulapuram Reservoir Nirvasithulu : ఇళ్లు కట్టిస్తామన్నారు. పరిహారం చెల్లిస్తామన్నారు. ఎన్నో హామీలు గుప్పించి గ్రామాలను ఖాళీ చేయించారు. ఏడాది గడిచినా ఎలాంటి ప్రయోజనం లేదు. తాత్కాలిక నివాసాల్లో సౌకర్యాలు కల్పించకపోవటంతో.. వనపర్తి జిల్లా ఏదులాపురం రిజర్వాయర్‌ నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. 1300 కుటుంబాలు దినదినగండంగా జీవనం గడుపుతున్నాయి.

  • 572 రోజుల కనిష్ఠానికి

Covid Cases in India: దేశంలో కొత్తగా మరో 6,563 కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వ్యాక్సిన్​ పంపిణీ కూడా విస్తృతంగా సాగుతోంది. ఆదివారం 15,82,079 మందికి టీకాలు అందించారు.

  • దలాల్​ స్ట్రీట్​ ఢమాల్

అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. బ్యాంకింగ్​, రియాల్టీ, ఆటో, పవర్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, లోహ రంగాలు దాదాపు 2 నుంచి 3 శాతం పతనమయ్యాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్, స్మాల్​క్యాప్​ సూచీలు సైతం డీలా పడ్డాయి.

  • ఫైనల్​లో ఓడినా చరిత్రే

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అపురూప దృశ్యం చూడాలనుకున్న భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనుకున్న ఆశ నెరవేరలేదు. కానీ ఓడినా.. శ్రీకాంత్‌ది సరికొత్త చరిత్రే.

  • ఈ పాడు రోగం నీకు తగిలిందా!

Hamsa Nandini Cancer: సినీనటి హంస నందిని క్యాన్సర్ బారినపడ్డారు. రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్-3తో బాధపడుతున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. దాని కోసం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

09:56 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 10AM

  • సైబర్‌ కేటుగాడి ఆఫర్‌!

ఎక్కడుంటారో.. వారి పేరేంటో.. ఏం చేస్తుంటారో.. ఎవరో.. ఏం తెలియదు. కానీ స్నేహితుల్లా పరిచయమవుతారు. స్నేహంగా నమ్మిస్తారు. అమాయకుల అవసరాలను ఆసరా చేసుకుంటారు.

  • కానిస్టేబుళ్లపైకి కత్తిపీటతో దూసుకొచ్చి

Woman Police threatened: విచారణకు వెళ్లిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను కత్తిపీటతో బెదిరింపునకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తమిళనాడు మదురైకు చెందిన పెరుమాళ్​.. వారితో అసభ్యంగా మాట్లాడాడు.

  • బ్రాండ్ అంబాసిడర్​గా రిషబ్ పంత్

Pant as Brand Ambassador: టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్​ను రాష్ట్ర అంబాసిడర్​గా నియమించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.

  • కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు సోమవారం సెషన్​ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు కుప్పకూలాయి.

  • కప్పు కొట్టేశాడు ‘బిగిలూ’

VJ sunny: ఎంటర్​టైన్మెంట్​కు కేరాఫ్ అడ్రెస్ వీజే సన్నీ. బిగ్​హౌస్​లో ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించేవాడు. అన్నమాట మీద నిలబడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్​బాస్​ సీజన్​ 5 విజేతగా నిలిచాడు. అయితే ఈ గెలుపు అతడికి అంత సులువుగా దక్కలేదు. ఎన్నో అపనిందలు, అవమానాలను ఎదుర్కొన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూనే.. టైటిల్​ విన్నర్​గా నిలిచాడు.

08:43 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 9AM

  • గుజరాత్​లో డ్రగ్స్ కలకలం

Gujarat drugs seized: గుజరాత్ తీరంలో భారీగా మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించారు. పాకిస్థాన్​కు చెందిన ఓ పడవలో తరలిస్తున్న రూ.400 కోట్ల విలువైన డ్రగ్స్​ను సీజ్ చేశారు.

  • గాంధీజీ కఠిన శిక్ష కోరుకున్న వేళ

వినూత్న పద్ధతులతో జాతీయోద్యమ స్థాయిని పెంచి.. ఆంగ్లేయులకు కొరకరాని కొయ్యలా మారిన గాంధీజీ.. ఓసారి కఠినాతి కఠిన శిక్ష కోరుకొని ఇంగ్లిష్‌ న్యాయమూర్తిని ఇబ్బందుల్లో పడేశారు. చివరకు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి.. 'ఈ శిక్ష తగ్గితే అందరికంటే ఎక్కువ సంతోషించేవాడిని నేనే' అంటూ.. మహాత్ముడికి మానసికంగా తలవంచాడు.

  • పుస్తక ప్రియులకు ఆర్టీసీ ఆఫర్

TSRTC New Offer : పుస్తక ప్రియులకు తెలంగాణ ఆర్టీసీ ఓ ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్​ ఎన్టీఆర్ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించేలా రూ.100 టికెట్​పై 20 శాతం రాయితీ ప్రకటించింది.

  • పాటలు వింటూ రైలు పట్టాలపైకి

మ్యూజిక్ మనసుకు ఎంతో హాయినిస్తుంది. నిజమే కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ వింటే మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయం తప్పదు. చెవిలో ఇయర్​ఫోన్స్ పెట్టుకుని.. ఫుల్​సౌండ్​లో మాంచి మాస్ బీట్ పాట వింటూ వాహనాలు నడుపుతున్నారా..? రోడ్డు దాటేప్పుడు కూడా చెవిలో హెడ్​ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలా మ్యూజిక్ వింటూ రైలు పట్టాల మీద వెళ్లిన ఓ వ్యక్తికి ఏమైందో తెలుసా..?

  • తుపాను విలయంలో 208 మృతులు

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​లో సంభవించిన తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రకృతి విపత్తుకు 208 మరణించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

07:56 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 8AM

  • మరింత తగ్గిన రాజ్యసభ ఉత్పాదకత

Rajya Sabha productivity: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో వారం రాజ్యసభ ఉత్పాదకత భారీగా తగ్గింది. మూడో వారంలో షెడ్యూల్‌ చేసిన మొత్తం 27.11 గంటలకు సంబంధించి.. 10.14 గంటలు మాత్రమే సభ పనిచేసింది. విపక్షాల ఆందోళనలతో ఏర్పడిన అంతరాయాలు, తప్పనిసరి వాయిదాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

  • రాష్ట్రవ్యాప్తంగా తెరాస నిరసనలు

TRS Protests Today: ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా తెరాస మరో పోరుకు సిద్ధమైంది. నేడు ఊరూరా నిరసనలు, ర్యాలీలు, దీక్షలతో హోరెత్తించనుంది. రైతు గోస దిల్లీలో ప్రతిధ్వనించేలా ఆందోళనలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

  • భారత వృద్ధి రేటు 9-10 శాతం

దేశ జీడీపీ వృద్ధి బలంగా పుంజుకుని 9-10 శాతం మధ్య నమోదు కావొచ్చని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలిలో సభ్యులుగా ఉన్న సీఈఓలు అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం సేవలు, తయారీ రంగంపై పడుతుందనే ఆందోళన సీఐఐ నిర్వహించిన పోలింగ్​లో​ వ్యక్తమైంది.

  • బ్యాడ్మింటన్​లో పడిలేచిన కెరటం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు చైనా స్టార్‌ లిన్‌ డాన్‌. అతడిని ఓడిస్తే బ్యాడ్మింటన్‌ ప్రపంచాన్ని గెలిచినట్లే! శ్రీకాంత్‌ అదే పనిచేశాడు. శ్రీకాంత్‌ పేరు తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది 2014లో. ఆ ఏడాది చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో అతడి ప్రదర్శన ఓ సంచలనం. అనూహ్య విజయాలతో ఫైనల్‌ చేరడమే అద్భుతమంటే.. తుది పోరులో లిన్‌ డాన్‌ను అతడి సొంతగడ్డపైనే వరుస సెట్లలో మట్టికరిపించి ప్రకంపనలు సృష్టించాడు శ్రీకాంత్‌.

  • సూపర్‌హిట్‌ చిత్రానికి సల్మాన్ సీక్వెల్‌

Salman Khan: తన సూపర్​హిట్​ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్. 2015లో వచ్చిన 'బజరంగీ భాయిజాన్​' సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.

07:00 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 7AM

  • ఆధార్‌ అనుసంధానం!

ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు వీలు కల్పించే 'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021'ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

  • పెరిగిన చలి తీవ్రత

Cold weather in TS:రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. దీంతో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రాజధాని శివార్లలో 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • కోహ్లీ పంజాబీ మాట్లాడటం చూశారా

Virat Kohli Punjabi: భారత టెస్టు క్రికెట్‌ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ మాట్లాడటం చూశాం. కానీ కోహ్లీ పంజాబీ మాట్లాడుతుండటం ఎవరూ చూడలేదు కదూ!. అయితే.. ఈ వీడియో చూడాల్సిందే మరి!.

  • బిగ్​బాస్-5 విజేతగా సన్నీ

బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg boss telugu 5) విజేతగా నటుడు వీజే సన్నీ(VJ sunny) నిలిచాడు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌ (300sqr) సొంతం చేసుకున్నాడు.

  • ఆయుర్వేద చిట్కాలు

hair and skin care tips: కురులే ఆడవారికి సిరులు. అలాంటి కురులు పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వీటితో పాటు చర్మ సౌందర్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంట్లోనే ఉంటూ ఈ రెండింటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

04:59 December 20

టాప్​టెన్​ న్యూస్​@ 6AM

  • అప్పుడే సత్వర న్యాయం

కోర్టులను ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆదివారం వరంగల్‌లో ‘పది కోర్టుల భవన సముదాయం’ ప్రారంభోత్సవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మతో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయస్థాన భవనాల సముదాయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

  • 'పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యం'

CJI Justice NV Ramana: పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్సార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

  • రాష్ట్రాలు సహకారం అందించాలి

CJI NV Ramana Tour: కోర్టుల ఆధునీకకరణతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం కోర్టుల ఆధునికతకు తోడ్పాటు నందిస్తోందని సీజేఐ ప్రశంసించారు

  • జీఎస్టీ అమలును ఉపసంహరించుకోండి

Ktr Letter On Textile Gst: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 12 శాతానికి పెంచడంపై చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.

  • మధ్యాహ్న భోజనం బంద్​

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అటకెక్కింది. బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వంట కార్మికులందరూ ఆందోళనకు దిగారు. అప్పులు చేసి అన్నం పెడుతున్న తమను విద్యాశాఖ తిప్పలు పెడుతోందంటూ వాపోయారు. దీంతో మహిళా కార్మికులు సమ్మె బాట పట్టడంతో మధ్యాహ్న భోజనం ఆగిపోయి లక్షల మంది పేద విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

  • 8 ఏళ్ల సహజీవనం తర్వాత..!

Gay marriage in Hyderabad: తెలంగాణ‌లో ఘనంగా తొలి గే మ్యారేజ్ జరిగింది. దీనికి హైదరాబాద్​ వేదికైంది. 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఇద్దరు పురుషులు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లు హాజరై గే జంటను ఆశీర్వదించారు.

  • ముగ్గురు యువకులు గల్లంతు

Youngsters drown in canal: ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో విషాదం నెలకొంది. ఎన్‌ఎస్పీ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • రెచ్చిపోయిన ఉగ్రమూక

Militants Firing On Police: జమ్ముకశ్మీర్​లో ఓ​ పోలీస్​ ఫాలోవర్​పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు అధికారి గాయపడ్డారు.

  • ఒక్క నిమిషంలో ఇన్ని చేస్తున్నారా?

A Minute on The Internet in 2021: కరోనా వేళ ఫోన్లు, స్మార్ట్​టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోయిన ప్రజలు.. ఇంటర్నెట్​ను మహాజోరుగా వాడేశారు. కాలక్షేపం కోసం సామాజిక మాధ్యమాల నుంచి ఓటీటీల్లో వీడియో స్ట్రీమింగ్​ వరకు దేన్నీ వదలకుండా నెట్టింట్లో గడిపారు! అయితే ఒక నిమిషం వ్యవధిలో ఇంటర్నెట్​లో ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ఓసారి చూద్దాం..

  • కిదాంబికి సిల్వర్​- అయినా రికార్డే..

World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​ షిప్స్​ ఫైనల్లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్​ ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్​లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Last Updated : Dec 20, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details