ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమహిళపై దంపతుల అత్యాచారం మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన కేసులో దంపతులను కోల్‌కతాలో పోలీసులు అరెస్టు చేశారు. మరో ఘటనలో రన్నింగ్ ట్రైన్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి.కాంగ్రెస్ కొత్త అవతారం ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త అవతారంలో బరిలోకి దిగనుంది. గెలుపే ధ్యేయంగా యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు దఫాలుగా ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారే కావడం విశేషం.ఎర్రచందనం ఎందుకంత ప్రియం? అంతర్జాతీయ స్మగ్లర్లు ఎర్రచందనం కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా చెల్లిస్తారు. ఈ రక్త చందనానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం కొండలు. అసలింతకీ దానికంత డిమాండ్ ఎందుకు.. దేనికి వాడతారు.. ‘పుష్ప’ సినిమాతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ ఎర్ర చెక్క గురించిన కథాకమామీషు..!చిట్టీల పేరుతో రూ.20 కోట్లు బురిడీ అమాయకులకు చిట్టీల పేరుతో వల విసిరి వారి నుంచి రూ.20 కోట్ల వరకూ దండుకుంది ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ మహిళ. చేసేది చిరు వ్యాపారం.. కానీ చిట్టీల పేరుతో కోట్లకు కోట్లు వసూలు చేసింది.చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు దీర్ఘకాలంగా ఉన్న భూతగాదాలతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. కర్ణాటక హవేరి జిల్లా హంగల్ తాలూకాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాలుడిని చంపి బీరువాలో దాచిన మహిళ నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి కప్‌బోర్డులో దాచి పెట్టిన మహిళ ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గ్రామస్థులు.. ఆగ్రహంతో ఇంటిని కూల్చేశారు. ఈ ఘటన కేరళలోని కన్యాకుమారిలో జరిగింది.న్యూజిలాండ్ ప్రధాని వివాహం రద్దు? న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహ వేడుకను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆమెనే స్వయంగా ప్రకటించారు.ఇన్‌స్టాతో సంపాదన కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకొచ్చింది. ఈ మేరకు క్రియేటర్‌ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయాలంటే యూజర్లు డబ్బులు చెల్లించాలి.బన్నీ పాటకు రైనా స్టెప్పులు అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలోని 'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసి అలరించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.అమ్మ కోసం స్మారకం కట్టిన ప్రముఖ నిర్మాత ప్రముఖ సినీ నిర్మాత శరవణన్, అమ్మపై తనకున్న ప్రేమను విభిన్న రీతిలో చాటుకున్నారు. సొంతూరులో ఆమెకు స్మారకం నిర్మించి వార్తల్లో నిలిచారు.