తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - తెలంగాణ తాజా వార్తలు

TOP NEWS HEADLINES OF THE HOUR
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Aug 8, 2021, 6:00 AM IST

Updated : Aug 8, 2021, 9:45 PM IST

21:39 August 08

టాప్​ న్యూస్ @ 9 pm

  • బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌

ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్​ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. ఐపీఎస్​కు రాజీనామా అనంతరం.. పూలే, అంబేడ్కర్, కాన్షీరాం బాటలోనే పోరాటం చేస్తానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు.

  • థాంక్యూ జపాన్​ : మోదీ

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించి దేశాన్ని గర్వించేలా చేశారని భారత అథ్లెట్లను కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయవంతంగా క్రీడలను నిర్వహించిన జపాన్​ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • మూడు రోజులు శవాల మధ్యే ఉన్నా..

చిన్నప్పటి నుంచీ సినిమా కలలు కనడం వేరు.. అకస్మాత్తుగా పరిశ్రమలోకి వచ్చి కెరీర్‌ని నిలుపుకోవడం వేరు. ఎత్తూపల్లాలూ, ఆటుపోట్లూ ఇద్దరికీ ఒకటే అయినా.. అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చినవాళ్లకి అవి విసిరే సవాళ్లు చాలా పెద్దవి. ఆ సాహసాల ప్రయాణం అతని మాటల్లోనే..

  • సాకర్​ స్టార్​​ 'మెస్సీ' భావోద్వేగం

దిగ్గజ ఫుట్​బాల్​ ప్లేయర్​ లియోనల్​ మెస్సీ కన్నీరు పెట్టాడు. సుదీర్ఘ కాలం బార్సిలోనా ఫుట్​బాల్​ క్లబ్​కు ప్రాతినిధ్యం వహించిన అతడు క్లబ్​కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు.

  • టైప్​ చేయకుండానే వాట్సాప్​ మెసేజ్

మనం తీరికలేని పనిలో ఉంటాం. ముఖ్యమైన మెసేజ్‌లు వస్తుంటాయి. వాటికి రిప్లయ్‌ ఇవ్వక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో పనిచేసుకుంటూనే వాట్సాప్ మెసేజ్‌లను పంపొచ్చు. అదెలాగంటే..?

20:05 August 08

టాప్​ న్యూస్ @ 8 pm

  • కేసీఆర్‌, హరీశ్‌కు ఈటల సవాల్‌

ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి హరీశ్​రావులకు భాజపా నేత ఈటల రాజేందర్​ సవాల్​ విసిరారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో తనపై పోటీ చేయాలన్నారు. ఓటమి భయంతోనే తెరాస వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని విమర్శించారు.

  • మోదీని ప్రశ్నిస్తూ విపక్షాల వీడియో

పెగసస్ అంశంపై మోదీ ప్రభుత్వం చర్చకు సహకరించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్​లో ఈ వ్యవహారంపై చర్చించేందుకు విపక్ష సభ్యులు చేసిన ప్రయత్నాలపై వీడియో వీడియో విడుదల చేశాయి. పార్లమెంట్​లో అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించాయి.

  • కరోనా భయపెట్టినా..

టోక్యో నగరంలో వేగంగా కరోనా వైరస్​ వ్యాపిస్తున్నా.. ఒలింపిక్స్​పై ఎలాంటి ప్రభావం పడలేదు! ఆగస్టు 5న అత్యధికంగా 5 వేలకుపైగా కేసులు నమోదైనా.. ఒలింపిక్​ గ్రామానికి మినహాయింపే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​తో కొట్టుమిట్టాడుతుంటే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జపాన్​ ప్రభుత్వం విజయవంతంగా విశ్వక్రీడలను నిర్వహించింది. 

  • విదేశీ ప్రయాణికులకు షాక్

భారత్​ నుంచి విదేశాలకు వెళ్లే విమానాల్లో ఎకానమీ టికెట్టు ధరలు జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో భారీగా పెరిగాయని ఈస్​మైట్రిప్​.కామ్ తెలిపింది. విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడం వల్లే ధరలు పెరిగాయని చెప్పింది.

  • బడ్జెట్ స్మార్ట్​వాచ్​లు

స్మార్ట్​వాచ్ ఇప్పుడో ట్రెండ్! ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం సహా.. జీవనశైలికి స్మార్ట్​నెస్​ను జోడించేందుకు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి సాధారణ బడ్జెట్​లో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్​వాచ్​ల గురించి తెలుసా?

19:20 August 08

టాప్​ న్యూస్ @ 7 pm

  • ఉప ఎన్నిక రావాల్సిందేనా

ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తీసుకురావాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. 

  • ఆ పరిష్కారం కోసమే వచ్చా

పేదల సంక్షేమం కోసం కేంద్రం నిరంతరం శ్రమిస్తోందని కేంద్రమంత్రి భగవంత్ కూబ(Bhagwanth Khuba) అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎరువుల గురించి వివరించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

  • ఐటీబీపీలో అపూర్వ ఘట్టం

తొలిసారి ఇద్దరు మహిళలకు కదనరంగంలో సేవలందించే అవకాశాన్ని ఇండో-టిబెటన్ సరిహద్దు దళం కల్పించింది. ఆదివారం ఉత్తరాఖండ్​ ముస్సోరిలో మొత్తం 53 మంది అధికారుల పాసింగ్​ ఔట్ పరేడ్​ కార్యక్రమం జరిగింది. 

  • శారద మరణించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు

విభిన్న భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయిక, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శారద.. మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంత?

  • పతకాల పట్టికలో భారత్​ ఎక్కడ?

కరోనా మహమ్మారిని అధిగమించి టోక్యో ఒలింపిక్స్​ను విజయవంతంగా ముగించింది జపాన్​ ప్రభుత్వం. అమెరికా, చైనా తీవ్రంగా పోటీపడినప్పటికీ.. మళ్లీ అగ్రస్థానం అగ్రరాజ్యాన్నే వరించింది. జపాన్​, భారత్​లు ఈ విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాయి. వాటి స్థానాలెంత?

19:20 August 08

టాప్​ న్యూస్ @ 6 pm

  • టీ-హబ్​లో ప్రైవేటు దందా

నిరుపేదలకు ఉచితంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయాల్సిన ఆదిలాబాద్‌ టీహబ్‌ కేంద్రం ప్రైవేటు వ్యక్తుల సేవలో తరిస్తోంది. ఇటీవల రిమ్స్‌ ఆసుపత్రిలో బినామీ వ్యక్తులు విధులు నిర్వహిస్తూ, తమ ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి సేకరించిన నమూనాలకు నిర్ధరణ పరీక్షలు చేసిన వైనం కలకలం సృష్టించింది. 

  • మానవహక్కుల ఉల్లంఘన విచారకరం

జైళ్లలో ఇప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళనకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పోలీసులు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ న్యాయ సేవ కేంద్రం(నల్సా) మొబైల్ యాప్ ప్రారంభించిన కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

  • వెంకీ కన్నీటికి కారణమేంటి?

వచ్చే వారం ప్రసారంకానున్న 'జబర్దస్త్'​ ప్రోమో అలరిస్తోంది. కంటెస్టంట్​లు వేసిన పంచులు నవ్వులు పూయించాయి. అయితే స్కిట్​ అనంతరం వెంకీ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకీ అతని కన్నీటికి కారణమేమిటంటే?

  • విశ్వక్రీడలు దిగ్విజయం

రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించిన టోక్యో ఒలింపిక్స్​ ముంగిపు కార్యక్రమం (Olympics Closing Cenrmony) అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్​ నుంచి దాదాపు 10 మంది అథ్లెట్లు/ అధికారులు హాజరయ్యారు.

  • నిద్రలేమి వెంటాడుతోందా?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. నిద్రతో సతమతమవుతున్న మనపై కరోనా మరింత భారాన్ని పెంచింది. వైరస్​ భయంతో నిద్రకు దూరమయ్యారు చాలామంది. ఈ నేపథ్యంలో.. నిద్ర పోకపోతే జరిగే నష్టాలు.. అసలు ఎన్ని గంటలు.. ఎలా నిద్ర పోవాలి?. తదితర జాగ్రత్తలతో ఈ కథనం మీకోసం..

16:51 August 08

టాప్​ న్యూస్ @ 5 pm

  • ఎన్‌జీటీకి మధ్యంతర నివేదిక

రాయలసీమ ఎత్తిపోతలపై NGTకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక అందించింది. పూర్తిస్థాయి నివేదికకు 3 వారాల గడువు కోరింది. 

  • ఆ హోదా నాకొద్దు 

తనకు కేబినెట్​ హోదాను కేటాయిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప కోరారు. తనకు మాజీ ముఖ్యమంత్రులకు ఉండే వసతులు మాత్రమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

  • వర్షం కారణంగా ఐదో రోజు ఆలస్యం

వర్షం కారణంగా ఇంగ్లాండ్​-ఇండియా తొలి టెస్టు ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజంతా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఫలితం తేలే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్ఇండియా.

  • వింత చేప..!

దంతాలు ఉన్న చేపను మీరు ఎప్పుడైనా చూశారా..? అదీ అచ్చం మనిషి దంతాలను పోలి ఉండటాన్ని చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. అంతేకాక ఈ చేప గొర్రె తలను పోలి ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ చేప తెగ వైరల్ అవుతోంది. ఈ వింత చేపను మీరూ చూసేయండి..

  • పోస్టు కార్డులో వీర్యం

జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఎలుక వీర్యం నమూనాలను గ్లాస్ బాటిళ్లలో కాకుండా.. ప్లాస్టిక్ షీట్లలో ఇతర ప్రాంతాలను తరలిస్తున్నారు. దీనివల్ల బాటిళ్లు పగిలి వీర్యం నిరుపయోగమయ్యే సమస్య ఉండదు. 

15:55 August 08

టాప్​ న్యూస్ @ 4 pm

  • కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం

గోదావరి, కృష్ణాయాజమాన్య బోర్డుల అత్యవసర సమావేశానికి హాజరుకాలేమని రాష్ట్రప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. రేపు సమావేశానికి రాలేమని బోర్డుల ఛైర్మన్లకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు

  • రేవంత్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని... పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామని చెప్పినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. భువనగిరి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

  • ఉగ్రవేటలో ఎన్​ఐఏ

రెండేళ్ల క్రితం నిషేధం విధించిన జమాత్​-ఏ-ఇస్లామీ మత సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విస్తృత సోదాలు నిర్వహించింది. జమ్ముకశ్మీర్​లోని 45 ప్రాంతాల్లో ఆదివారం ఈ తనిఖీలు చేపట్టింది. మరోవైపు.. కర్ణాటక బెంగళూరులోనూ ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది.

  • ఎన్టీఆర్​కు ఏమైంది..

ఎన్టీఆర్​ ముఖంపై ఉన్న గాయం గురించి క్లారిటీ ఇచ్చింది 'ఆర్​ఆర్​ఆర్'(RRR movie) చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఉక్రెయిన్​లో జరుగుతోంది.

  • ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​' రేసులో వీరే..

జులై నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' (ICC POTM) నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ (ICC). పురుషుల క్రికెట్​ నుంచి ముగ్గురు, మహిళలు ముగ్గురు ఉన్నారు. వారి ప్రదర్శనలు ఎలా ఉన్నాయంటే..

14:36 August 08

టాప్​ న్యూస్ @ 3 pm

  • కేటీఆర్​ గిఫ్ట్​ ఏ స్మైల్​

హైదరాబాద్ జలవిహార్​లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేశారు. తన మీద అభిమానంతో దివ్యాంగులకు వాహనాలు అందజేసేందుకు ముందుకొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు.

  • రాష్ట్రవ్యాప్తంగా సీరో సర్వే

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో సీరో సర్వే చేయనున్నారు. కొవిడ్ వ్యాప్తి మూడోదశ హెచ్చరికల నేపథ్యంలో ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్ సీరో సర్వే చేయనుంది.

  • పైథాన్​ కోసం ప్రత్యేక గది

ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లా కేంద్రంలో ఓ భారీ పైథాన్​ను అటవీ శాఖ సిబ్బంది 2 నెలల పాటు సురక్షితంగా చూసుకున్నారు. దాని కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి.. గుడ్లు పొదిగేలా సౌకర్యాలు కల్పించారు. 

  • పసిడితో నీరజ్​ మెరిసే

టోక్యో ఒలింపిక్స్​లో దేశానికి స్వర్ణం తెచ్చిన నీరజ్​ చోప్డాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇతడు విజయం సాధించగానే ఒలింపిక్​ గ్రామంలోని భారత శిబిరంలో ఉన్న అథ్లెట్లు ఆనందంతో పులకరించిపోయారు. కేరింతలు కొడుతూ నీరజ్​ను హత్తుకుని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

  • సొంతింటి కల సాకారానికి

గృహరుణాల వడ్డీ రేట్లు ఇప్పుడు 6.6 శాతం నుంచి మొదలువుతున్నాయి. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇవ్వడంతోపాటు కొత్త రుణగ్రహీతలను ఆకట్టుకునేందుకు బ్యాంకులు కొత్తగా కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు.. పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.

13:50 August 08

టాప్​ న్యూస్ @ 2pm

 

  • వంద రకాల పండ్ల చెట్లున్నాయి..

అందమైన చెరువు... ఆ పక్కనే అడవిని తలపించే చెట్లు. అందులోనూ ఆ చెట్లన్నీ పండ్ల చెట్లే. దాదాపు వంద రకాల పండ్లు ఈ తోటలో మనకు దర్శనమిస్తాయి. దేశవాళి నుంచి విదేశీ రకాల పండ్ల వరకు అన్నీ ఇక్కడ చూడొచ్చు. అదెక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా...! అయితే ఈ కథనం చదివేయండి.

  • ఎయిర్​పోర్ట్​కు బాంబు బెదిరింపు

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్​ఖైదా ఉగ్రవాదులు బాంబు దాడికి పథక రచన చేసినట్లు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిర్​పోర్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్.. విమానాశ్రయాన్ని పూర్తిగా జల్లెడ పట్టింది. చివరకు, ఈ బెదిరింపులు అవాస్తవమని అధికారులు నిర్ధరణకు వచ్చారు.

  • అసమ్మతి శాఖోపశాఖలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. కానీ, అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడం వల్ల అసమ్మతి స్వరం ప్రతిధ్వనిస్తోంది. తమకు కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.


  • ఫలితాలే మార్కెట్లకు కీలకం

ఈ వారం స్టాక్ మార్కెట్లకు మొదటి త్రైమాసిక ఫలితాలు, పరిశ్రమల ఉత్పత్తి, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. వీటన్నింటితో పాటు ద్రవ్యోల్బణం గణాంకాలపై కూడా మదుపరులు దృష్టిసారించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • సన్నీ లియోనీ డైట్ సీక్రెట్..

హాట్​ హాట్​ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది బాలీవుడ్​ నటి సన్నీలియోనీ. నలభై ఏళ్ల వయసులోనూ నాజూగ్గా కనిపిస్తూ.. యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. అంతటి అందంతో పాటు కచ్చితమైన శరీరాకృతితో ఫిట్​నెస్​ను ఎలా కొనసాగిస్తోందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఆమె రోజూ అనుసరించే డైట్​ ఎంటో మీరూ చదివేయండి.

12:56 August 08

టాప్​ న్యూస్ @ 1pm

  • 'దీర్ఘకాల కొవిడ్​' తప్పదా?

కరోనాతో ప్రపంచం అస్తవ్యస్తంగా మారింది. కొవిడ్​ అంతు తేల్చేందుకు ఓవైపు పరిశోధనలు జరుగుతుంటే.. కరోనా మాత్రం ఎన్నో సవాళ్లను విసురుతోంది. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న తర్వాత వైరస్​ సోకితే, దీర్ఘకాల కొవిడ్​గా మారే అవకాశాలు ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు వేధిస్తోంది. దీనికి సమాధానం కనుగొనేందుకు ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

  • చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు

కాలిఫోర్నియాను కార్చిచ్చు కమ్మేసింది. అడవులు, కొండలను దహించివేస్తోంది. భారీగా ఎగసిపడుతున్న మంటల దాటికి మారుమూల గ్రామాల్లోని పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

  • రెండు కలిపితే సూపర్ ఫలితం!'

కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మిక్సింగ్​పై ఐసీఎంఆర్ కీలక విషయాలు వెల్లడించింది. ఈ రెండు వ్యాక్సిన్లను కలపడం సురక్షితమేనని పేర్కొంది. ఈ మిక్సింగ్ టీకా ద్వారా మెరుగైన రోగనిరోధక స్పందనలు కలిగాయని తెలిపింది.

  • ఇష్టమైన ఆహారానికి ఆర్నెళ్లు దూరం!

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం నెగ్గిన నీరజ్‌ చోప్డా(neeraj chopra gold medal).. వందేళ్ల భారత క్రీడాభిమానుల కలను సాకారం చేశాడు. ఈ క్రమంలో విశ్వక్రీడల కోసం తనకిష్టమైన కొన్ని వంటకాలను తినడం మానేశానని చెప్పాడు. అవేంటంటే..

  • ఛీ కొట్టిన వాళ్లే శెభాష్ అనేలా!

నటనతో పాటు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫహాద్​ ఫాజిల్​. తండ్రి నిర్మాత స్థాయిలో ఉన్నా తొలుత తడబాటుకు గురై.. నెమ్మదిగా యాక్టింగ్​పై పట్టు సాధించాడు. మొదట్లో ఛీ అన్న వారి చేతే శెభాష్​ అనుకునేలా ఎదిగాడు. ఈ మలయాళీ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

11:48 August 08

టాప్​ న్యూస్ @ 12pm

  • వరుస భూప్రకంపనలు

పులిచింతల సమీపంలో వరుస భూప్రకంపనలు (EarthQuake)సంభవించాయి.  ఉదయం 7.15 నుంచి 8.20 గంటల మధ్య భూప్రకంపనలు వచ్చాయి. పులిచింతల పరిసర ప్రాంతాల్లో మూడుసార్లు భూప్రకంపనలు రాగా... భూకంపలేఖినిపై తీవ్రత 3, 2.7, 2.3గా నమోదు అయింది.

  • సాగర జలాల్లో త్రినేత్రం

సముద్ర జలాల్లో దాడి సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది భారత్​. ఇందులో భాగంగా స్వదేశీ విమానవాహక నౌక సాగర ప్రవేశం చేయడం భారత నౌకాదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జలాంతర్గాములతో పాటు కనీసం మూడు విమానవాహక నౌకలు ఉండాలన్నది ఈ దళం ఆకాంక్ష.

  • రైతుల పిల్లలకు స్కాలర్​షిప్​!

ప్రత్యేకంగా రైతుల పిల్లల కోసం రూపొందించిన ఉపకార వేతన(స్కాలర్‌షిప్​) పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై.. తొలి కేబినెట్​ సమావేశంలోనే రైతుల పిల్లల ఉన్నత విద్య కోసం ఈ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

  • భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

గత వారం రోజుల్లో ఐడీబీఐ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్, ఎన్ఎల్​సీ ఇండియా, ఇర్కాన్ ఇంటర్నేషనల్, బీఈఎల్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. వాటి వివరాలు తెలుసుకుందాం..

  • లంగా ఓణీలో వయ్యారాలు..

యాంకర్, నటి శ్రీముఖి సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటుంది. తరచూ ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా స్టన్నింగ్ లుక్స్​తో నెటిజన్ల మతిపోగొట్టింది ముఖి. ఆ ఫొటోలు చూద్దాం.

 

10:42 August 08

టాప్​ న్యూస్ @ 11am

  • మహోగ్ర ఉద్యమం

గాంధీజీ పిలుపిచ్చిన క్విట్‌ ఇండియా ఉద్యమం ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఊహించని రీతిలో సాగింది. నాయకులు లేకపోవటం వల్ల కట్టలు తెగిన ప్రవాహంలా ఉవ్వెత్తున సాగింది. దశాదిశ నిర్దేశించే వారు లేకపోవటంతో 'డూ ఆర్‌ డై' అన్న నినాదం భారతీయలు మనోభావాలను తట్టిలేపింది. బ్రిటీష్ వారి పాలన నుంచి ఎలాగైనా విముక్తి పొందాలన్న స్వాతంత్ర్యకాంక్ష హింసాత్మక రూపు దాల్చింది. దమననీతితో ఉద్యమాన్ని అణిచివేసినా.. నాటిపోరు భవిష్యత్‌ చిత్రాన్ని బ్రిటీష్ పాలకుల కళ్లముందుంచగలిగింది. తక్షణ స్వాతంత్ర్యం కోరుతున్న భారత ప్రజల డిమాండ్‌ను ఎప్పటికైనా నెరవేర్చక తప్పని పరిస్థితిని కల్పించింది.

  • కిడ్నాప్ కలకలం..

హైదరాబాద్​లో స్థిరాస్థి వ్యాపారి కిడ్నాప్​, హత్య ఘటన మరవకముందే.. నిర్మల్‌లో మరో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టంచింది. వ్యాపారి విజయ్‌చందర్ దేశ్‌పాండేను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తన్వి అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో ఉన్న విజయ్‌చందర్‌ కిడ్నాప్ చేశారని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  • తాళ్లతో కట్టేసి.. కర్రలతో కొట్టి

ఓ మానసిక రోగిని తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ చందౌలీలో జరిగింది. మహారఖా గ్రామంలో ఇద్దరు యువకులు, ఓ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టారు. రోగిని కర్రలతో విపరీతంగా కొట్టగా బాధితుడు మృతిచెందాడు. ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు అలీనగర్​ పోలీసులు తెలిపారు.

  • సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్‌ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్‌ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి అందించినట్లు పేర్కొంది.

  • సక్సెస్​ మంత్రం ఇదే!

న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్.. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మ్యాచ్​ ఫలితం ఎలా ఉన్నా సరే ముఖం మీద చిరునవ్వుతో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడు. అందుకే విజయవంతమైన క్రికెటర్​గా కొనసాగుతున్నాడు. నేడు(ఆగస్టు 8) అతడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

09:42 August 08

టాప్​ న్యూస్ @ 10am

  • మరో 39వేల కేసులు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 39,070 మందికి కరోనా సోకింది. కొవిడ్​తో మరో 491 మంది మృతి చెందారు.

  • రైతులకు శుభవార్త..

తదుపరి విడత పీఎం కిసాన్ సమ్మాన్​​ నిధి ఆగస్టు 9న విడుదల చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీని కింద సుమారు 9.57 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ఈ విడతలో భాగంగా కేంద్రం రూ. 19 వేల 500 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమచేయనుంది.

  • అభివృద్ధికి నోచుకోని భువనగిరి కోట..

రామప్ప గుడికి యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అంతే చారిత్రక ప్రాధాన్యం ఉన్న భువనగిరి కోటకు(Bhongir Fort) సరైన గుర్తింపు దక్కడం లేదని స్థానికులు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అద్భుతమైన కోట మసకబారుతోందని అంటున్నారు. కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఒక్కటీ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • సైకత శుభాకాంక్షలు

టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించిన నీరజ్​ చోప్డాకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా పూరీ బీచ్​లో సైకత శిల్పాన్ని రూపొందించారు. భారత్​కు గోల్డెన్ మూవ్​మెంట్స్​.. తీసుకువచ్చిన చోప్డాకు శుభాకాంక్షలు అనే అర్థం వచ్చేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • సెలవు పెట్టని నటి ఈమె!

నెలవంక సైతం అసూయపడే అందం తనది. అలా చూస్తూ ఉండాలనే తపన అభిమానులది. ఆ ముఖం చూసి జాబిలే మబ్బు చాటుకు జారిపోతుంది. ఆ కన్నుల వెలుగును చూసి చుక్కలే సిగ్గుతో మాయమైపోతాయి. ఆ బుగ్గమీద పుట్టుమచ్చ నిండుచంద్రుడిలో మచ్చను గుర్తుచేస్తుంది. అందం, అభినయ మిశ్రమంతో విశ్రమించని బ్రహ్మ పరిశ్రమించి సృజించిన అప్సరస ఆమె. అసలు పేరు కుసుమ కుమారి. తెరపై మహా సుకుమారి. జానపదాల్లో రాకుమారి. ఆ వయ్యారి అభినయిస్తే ఓ నాట్యమయూరి. తన రాకతో తెలుగుతెరకు అందాలు అద్దారు. పోతపోసిన సౌందర్యరాశి ఆ స్త్రీ. ఆమె రాజశ్రీ..

08:46 August 08

టాప్​ న్యూస్ @9am

  • మరో ఏడాది..

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా రాజీవ్‌ గౌబాను మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1982వ బ్యాచ్‌ ఝార్ఖండ్‌ కేడర్‌కు చెందిన ఆయన పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అయితే, నియామకాల మంత్రివర్గ సంఘం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ శనివారం రాత్రి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • ఉద్యమానికి బాటలు ఇలా..

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చిట్టచివరిది అతిపెద్ద ప్రజా పోరాటంగా పేరొందింది క్విట్‌ ఇండియా ఉద్యమం. బ్రిటీష్‌ వారి పాలనపై తీవ్రవ్యతిరేకత తెలియజేసిన ఉద్యమం. భారత ప్రజలు నాయకుల అభిప్రాయాలకు విలువలేకుండా తమపై పెత్తనం చెలాయించడమే కాకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే బ్రిటీష్ వారి అరాచకాలను ధిక్కరించిన ఉద్యమం. తక్షణమే భారత దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని మహాత్ముడి పిలుపు వెనుక కారణాలు చూస్తే బ్రిటీష్ వారి ఏకపక్ష నిర్ణయాలు ఆయన సహనాన్ని అహింసవాదాన్ని ఎంతగా పరీక్ష పెట్టాయో తెలుస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమాన్నే ఆగస్ట్ క్రాంతి ఉద్యమంగానూ పిలిచినా ముఖ్య ఉద్దేశం బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సహాయనిరాకరణ చేయడమే. గాంధీజీ పిలుపుమేరకు 1942 ఆగస్ట్ ఎనిమిదిన ప్రారంభమైన ప్రజాపోరాటంలో తొలిసారిగా హింసకు దారితీసింది. ఈ ఉద్యమం వెనుక బలమైన కారణం ప్రజా ప్రభుత్వాల అభిప్రాయాలతో పనిలేకుండా బ్రిటీష్‌ పాలకులు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడమే.

  • ఆ ఊళ్లో అగ్గి రోజూ రాజుకుంటోంది..

ఎవరు చేస్తున్నారో తెలియదు.. ఎలా జరుగుతుందో తెలియదు.. ఇదేమైనా మాయనా.. ఊరంతా కాపలా కాసినా కూడా ఎలా జరుగుతుందో తెలియదు. అగ్గి మాత్రం రాజుకుంటోంది. అది కూడా ఇంట్లో దుస్తులకు, గడ్డివాములకు లేదా పశువుల కొట్టాలకు ఒక్కసారిగా అగ్గి రాజుకొని తగలబడుతున్నాయి. ఇదేదో రాత్రివేళల్లో జరుగుతున్న తంతు కాదు.. ఇదంతా మిట్టమధ్యాహ్నం జరుగుతోంది ఆ గ్రామంలో. ఎవరి ఇంట్లో దుస్తులు కలిపోతాయో, ఎవరి గడ్డి వాములకు నిప్పు అంటుకుంటుందో, ఎవరి పశువుల కొట్టాలు తగలబడతాయోనని భయంతో గడుపుతున్నారు ఆ గ్రామస్థులు. ఇంతకీ ఇది ఎలా జరుగుతుంది.. ఆ మాయ ఎంటి అంతుచిక్కని మిస్టరీతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ గ్రామస్థులు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

  • 10 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు

రహదారి ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపి.. ప్రమాదాలకు కారణమయ్యే వాళ్లపై హత్య కేసు నమోదు చేస్తున్నారు.

  • కాలం కలిసొస్తుందా?

పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు కొవిడ్‌ పరిస్థితుల వల్ల కొత్త సవాళ్లెదురవుతున్నాయి. వీటి విడుదల అన్ని రాష్ట్రాలతో ముడిపడి ఉన్న వ్యవహారం. అన్ని చోట్లా థియేటర్లు తెరవడానికి అనుకూలమైన వాతావరణమున్నప్పుడే.. ఆ సినిమాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతమైతే ఆ వాతావరణం ఏ చిత్రసీమలోనూ కనిపించడం లేదు.

07:47 August 08

టాప్​ న్యూస్ @8am

  • భాగ్యనగరానికి తెలుసు..

ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కల ఫలించింది. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్​ చోప్రా మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణం గెలిచి నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్రకు తొలి అడుగు పడింది ఈ నవాబుల నగరంలోనే..

  • తెలంగాణ హాజరవుతుందా?

రేపు జరగబోయే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పూర్తి స్థాయి సమావేశాలకు రెండు రాష్ట్రాలు హాజరవుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ హాజరు కావాలని నిర్ణయించుకోగా, సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల కారణంగా వాయిదా కోరిన తెలంగాణ హాజరువుతుందా లేదా చూడాల్సి ఉంది.

  • మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలున్నాయి. రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్​లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

  • ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​ నాగౌర్‌లోని కుచామన్‌లో ట్రక్కు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ విచారం వ్యక్తం చేశారు.

  • ఫేవరేట్లుగా వెళ్లి..

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) వీళ్లకు పతకాలు పక్కా.. పోటీపడటమే తరువాయి.. ఇలా అనుకున్న కొందరు భారత అథ్లెట్లు పూర్తిగా నిరాశపరిచారు. మధ్య రౌండ్లలో ఓడి, పతకాన్ని తేలేకపోయారు. ఫేవరేట్లుగా బరిలోకి దిగినవారిలో కొందరు మరీ నిరాశాజనక ప్రదర్శన చేశారు. అలాంటి అథ్లెట్ల గురించే ఈ కథనం.

06:53 August 08

టాప్​ న్యూస్ @7am

  • వందేళ్ల భారత నిరీక్షణకు తెర

ఒలింపిక్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం.. పతకం నెగ్గిన ముగ్గురు అథ్లెట్ల జాతీయ జెండాలు పైకెగురుతున్నాయ్‌.. అందులో మన మువ్వన్నెల జెండా కూడా ఉంది.. భారత జాతీయ గీతం వినిపిస్తోంది.. పోడియంపై భారత క్రీడాకారుడూ ఉన్నాడు. అతడి మెడలో పతకం పడుతోంది.. ఇది 1900లో భారత తొలి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ విశ్వ క్రీడల్లో అడుగు పెట్టినప్పట్నుంచి కంటున్న కల! అది టోక్యో వేదికగా శనివారం నిజమైంది.

  • పూర్తయిన స్టాప్‌లాక్ గేట్ పనులు..

పులిచింతల ప్రాజెక్టులో గేటు ఊడిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న స్టాప్‌లాక్‌ గేటు పూర్తయ్యాయి. 11 ఎలిమెంట్లు ఏర్పాటు చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని గేట్లు మూసి ఎగువ ప్రవాహంతో జలాశయాన్ని నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • సీఎం కాన్వాయ్‌కి అడ్డువెళ్లిన పిల్లలు..

సీఎం కాన్వాయ్‌కి పిల్లలు అడ్డువెళ్లారు. చోరీ చేసిన బైకుతో రాంగ్‌రూట్‌లో ప్రయాణం చేస్తూ.. సీఎం కాన్వాయ్​కు ఎదురుగా వెళ్లారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించరేం?

అనేక ప్రభుత్వ రంగ సంస్థల పరీక్షలన్నీ దాదాపుగా హిందీ, ఆంగ్ల భాషల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో హిందీయేతర ప్రాంతాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ భాషను ప్రోత్సహించాలని, జాతీయ స్థాయి ఉద్యోగ పరీక్షలు ప్రాంతీయ భాషలో నిర్వహించాలని పలువురు నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు.

  • పద్ధతి మారాలి!

నేటి (ఆదివారం)తో ఒలింపిక్స్​ ముగియనుంది. గత విశ్వ క్రీడలతో పోలిస్తే ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసింది భారత్. అయితే మన దేశ జనాభాలో నాలుగోవంతైనా లేని దేశాలు పదుల సంఖ్యలో పతకాలను ఎగరేసుకుపోయాయి. మన క్రీడారంగ దుస్థితికి కారణం బహిరంగ రహస్యమే. పతకాలు గెలుపొందినవారిని ఆకాశానికి ఎత్తేయడంలో పోటీపడే ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో మౌలిక వసతుల పరికల్పన, ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన బాధ్యతలను గాలికి వదిలేస్తున్నాయి.

05:08 August 08

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

 గౌరవం ఉట్టిపడేలా నిర్మాణం 

పాలనారీతులకు అద్దంపట్టేలా.. తెలంగాణ గౌరవం ఉట్టిపడేలా సచివాలయ నిర్మాణ కౌశలం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాక్షించారు. సెక్రటేరియట్‌ నిర్మాణ పురోగతిని పరిశీలించిన సీఎం త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు

ఆ రంగంలో పెరిగిన ఉపాధి 

రాష్ట్రంలో సేవా రంగంలో ఉద్యోగిత శాతం పెరిగింది. స్థిరాస్తి వ్యాపారం, పరిశ్రమల ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. అత్యధికులు సేవా రంగంలో ఉపాధి పొందుతున్వట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ అధ్యయనంలో వెల్లడైంది.


 మహిళలకు వీహబ్​ 

మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన వీ-హబ్‌ మరో ముందడుగు వేసింది. అంకుర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ క్యూ మార్ట్‌తో వీ-హబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

 బీఎస్పీలోకి  ప్రవీణ్ కుమార్

ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 

అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్‌ 

వికారాబాద్​ జిల్లా అనంతగిరి హిల్స్‌లో రూ.150 కోట్లతో అడ్వెంచర్‌ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నటుడు మంచు మనోజ్ కుమార్ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆసక్తి చూపారని ఆయన వెల్లడించారు.

' తొలి రాష్ట్రం మాదే'

దేశంలో జాతీయ విద్యా విధానం-2020ను అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అశ్వథ్​ నారాయణ్​ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు.

'మూడేళ్లలో అలాంటి జాతీయ రహదారులు'

రాబోయే మూడేళ్లలో భారత్​లో రహదారులు పూర్తిగా మారనున్నాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతంలో రోజుకు కిలోమీటర్ కన్నా తక్కువ రోడ్ల నిర్మాణాలు జరిగేవని.. ప్రస్తుతం 38 కి.మీ.ల మేర నిర్మిస్తున్నట్లు చెప్పారు.

వేగంగా వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా జులై నెలలో 13.45 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. సగటున 43.41 లక్షల మందికి రోజూ వ్యాక్సిన్లు అందించినట్లు వెల్లడించింది.

'ఒలింపిక్ రికార్డ్​కూ ట్రై చేశా.!'

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించటం 'నమ్మశక్యం కాని అనుభూతి' అని జావెలిన్​ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా అన్నాడు. స్వర్ణం వస్తుందని అనుకోలేదన్నాడు. తన స్వర్ణాన్ని పరుగుల వీరుడు మిల్కాసింగ్​కు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. 

విజయానికి చేరువలో.!

నాటింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్​ఇండియా. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52/1​ పరుగులు చేసింది.

Last Updated : Aug 8, 2021, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details