ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుభాజపా ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తాం.. భాజపా వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భాజపా ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. భాజపా పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ముక్త్ భారత్ కోసం కలిసి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో రేపటి నుంచి కేంద్ర మంత్రుల పర్యటన..పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, మహేంద్రనాథ్ పాండే రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అందుతున్న విధానంపై కేంద్ర మంత్రులు ఆరా తీయనున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాల్లో పాల్గొననున్నారు.ప్రధాని మోదీపై కేటీఆర్ సెటైర్.. KTR Today Tweet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో పౌష్టికాహార లోపం పై చేసిన ప్రసంగంలో భోజనం అనడానికి బదులు భజన అన్న మాటకు మంత్రి కేటీఆర్ స్పందించారు. టెలిప్రాంప్టర్ తప్పు అయ్యి ఉంటుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు.గల్లీగల్లీలో గణేశుని సందడి..2022 రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విఘ్నేశ్వరుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు . అందంగా అలంకరించిన మండపాల్లో గణనాథులు కొలువుతీరారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.సోనియా కుటుంబంలో తీవ్ర విషాదం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో కన్నుమూశారు. ఈనెల 27న ఇటలీలోని తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. మంగళవారం పౌలా మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దేశంలో తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభందేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించింది దిల్లీ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఈ బడిలో చేరి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించవచ్చని తెలిపింది. ఇంతకీ ఈ వర్చువల్ స్కూల్ ఎలా పనిచేస్తుంది? పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఆ స్కూల్ సర్టిఫికేట్స్ ఎక్కడైనా చెల్లుతాయా?ట్రంప్‌కు మరిన్ని చిక్కులు రహస్య పత్రాల తరలింపు వివాదంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన దర్యాప్తు బృందం కొన్ని రహస్య పత్రాలను గుర్తించి, కోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిపై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.2022-23 క్యూ1లో జీడీపీ వృద్ధిరేటు 13.5%భారత ఆర్థిక వ్యవస్థ మరోమారు రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసింది. 2022-23 తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) స్థూల జాతీయోత్పత్తి 13.5శాతం మేర పెరిగింది. మనసు దోచేసిన వార్నర్ దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ విగ్రహాలను ఏర్పాట చేసుకుని పూజాపురస్కారాలు చేస్తున్నారు. మన క్రికెటర్లు కూడా సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది.బిగ్‌బాస్ సీజన్ 6 ఫస్ట్ గ్లింప్స్ ఆగయాBigboss first glimpse released రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.