తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @3 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jun 12, 2021, 3:02 PM IST

Updated : Jun 12, 2021, 3:31 PM IST

TOP NEWS @3PM
టాప్‌టెన్ న్యూస్ @3 PM

  • సినారె అజరామరం...

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య సి. నారాయణ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. సాహిత్యానికి సినారె చేసిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం... భాషా, సాహిత్యాలు నిలిచి ఉన్నన్ని రోజులు... ప్రజల హృదయాల్లో సినారె బతికే ఉంటారన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • రాజకీయ కురుక్షేత్రమే...

హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే క్రమంలో... మొదటగా గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మరింత పెంచాం...

కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్​ను ఆయన ప్రారంభించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మూడో దశ అనివార్యం...

కొవిడ్​ వైరస్​ మూడో దశ ఉద్ధృతి అనివార్యమని అన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వైరస్​పై పోరాడేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా మాతా..

కరోనా నుంచి రక్షించాలని వేడుకుంటూ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామ ప్రజలు 'కరోనా మాత'కు పూజలు చేస్తున్నారు. వేపచెట్టు కింద దేవాలయాన్ని నిర్మించి అమ్మవారిని వేడుకుంటున్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • చైనా గూఢచారి...

భారత్‌- బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వేకు సంబంధించిన విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. హాన్ జున్వే.. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ తరపున భారత్‌లో గూఢచారిగా పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • 'సుప్రీం' ప్లీడర్​!...

సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్​ జనరల్ కేఎమ్​ నటరాజ్​..​ వ్యవసాయం చేస్తున్నారు. అంతపెద్ద హోదాలో ఉండి కూడా ఓ సాధారణ రైతులా పంచె కట్టుకుని పొలాన్ని దున్నుతున్నారు. యువత సాగురంగాన్ని ప్రోత్సహించాలని సందేశం ఇస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • చికిత్సకు వ్యక్తిగత రుణం...

కొవిడ్​ రోగులకు.. చికిత్స కోసం వ్యక్తిగత రుణాన్ని ఇస్తున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. ఎస్​బీఐ కవచ్​ పథకం కింద ఈ రుణాలిస్తున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • నాదల్​కు ఓటమా?...

ఫ్రెంచ్​ఓపెన్​ సెమీఫైనల్​లో జకోవిచ్​, నాదల్​ గెలుపోటమిపై పలువురు భారత క్రికెటర్లు స్పందించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ చేసిన ట్వీట్​ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • సినిమాలకు కాజల్ గుడ్​బై...

దక్షిణాదితో పాటు హిందీలోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. త్వరలో సినిమాలకు రిటైర్మెంట్​ ప్రకటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 12, 2021, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details