ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలుసోనియాకు ఈడీ 110 ప్రశ్నలు.. మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు విచారించిన ఈడీ.. అవసరమైనప్పుడు మరోసారి పిలుస్తామని తెలిపింది. మరోవైపు, ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎన్నికలెపుడొచ్చినా ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధం: బండి సంజయ్హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశం ప్రారంభమైంది. పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర నిర్వాహణ కమిటీ బాధ్యులతో బండి సంజయ్ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు.మూసీ ఉద్ధృతితో మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత.. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించటంతో.. మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద వెళ్తోంది. ఈ క్రమంలో పోలీసులు ఆ బ్రిడ్జిని మూసేశారు. వరద పెద్దఎత్తున రావటం వల్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాదారులకు ప్రత్యామ్నాయాలను సూచించారు. రాగల మూడురోజులు భారీవర్షాలు!గత కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు పురానాపూల్‌ని వరదలు ముంచెత్తాయి. భారీగా వరదనీరు చేరడంతో రెండు ఆలయాలు జలదిగ్బంధమయ్యాయి. ఆహర కొరతతో పురానాపూల్, జియాగూడ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఏడేళ్లుగా పెండింగ్‌లో సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.నుజ్జునుజ్జయిన కారు.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణంఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.స్కూటీని ఢీకొట్టిన ఎద్దు.. ఆమెకు గాయాలు.. గుజరాత్ నవ్సరిలో బైక్‌పై వెళ్తున్న మహిళపై ఓ ఎద్దు దాడి చేసింది. మహిళ వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎద్దు.. ఆమెను ఢీకొట్టింది. దీంతో మహిళ కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎద్దు యజమానికి ఫిర్యాదు చేయగా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.లక్కీ మ్యాన్.. అరగంటలో కష్టాలు ఉఫ్..అప్పుల్లో కూరుకుపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ వ్యక్తి తన ఇంటిని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. మరికాసేపట్లో ఆ ఇంటిని ఇంకొకరికి అప్పచెప్తాడు అనగా అదృష్టం తలుపు తట్టింది. అరగంట క్రితం రూ.50 పెట్టి కొన్న ఓ లాటరీ టికెట్.. అదృష్టంలా వరించింది. రూ.కోటి జాక్‌పాట్ అతని సొంతమైంది.'అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి'.. సాధ్యమేనా? రూపాయి.. అంతర్జాతీయ కరెన్సీగా మారడం సాధ్యమేనా? అందుకున్న ప్రధాన సవాళ్లేంటి? అధిగమించే దిశగా రిజర్వు బ్యాంకు, కేంద్రం ఏం చేస్తున్నాయి?ఆమెకు ఐదో కాన్పులోనూ కవలలే.. మొత్తం 10 మంది..'ఒక్కరు లేదా ఇద్దరు'... పిల్లల విషయంలో ప్రస్తుతం దాదాపు అందరి ఆలోచన ఇదే. కానీ.. ఆమె మాత్రం ఐదు సార్లు గర్భం దాల్చింది. ప్రతిసారీ కవలలకే జన్మనిచ్చింది. 10 మంది పిల్లల్ని పెంచడం నా వల్ల కాదంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు భర్త. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది భార్య.