1. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం(10వ తేదీన) కొత్తగా 1,896 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 82,647కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. కరోనాను జయించినా వివక్షతో సమాజం చంపేసింది!
కరోనా నుంచి కోలుకున్నా అంటరానివాడిగా చూడటం వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైరస్ పోరులో నెగ్గినప్పటికీ.. సమాజ మూర్ఖపు దృష్టికోణం కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు. కర్ణాటకలోని శిరవాడ ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. దేశంలో ఒక్కరోజే 53 వేల కేసులు.. 871 మంది మృతి
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో 60 వేల చొప్పున నమోదైన కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 53,601 మందికి వైరస్ సోకింది. మరో 871 మంది మృతి చెందారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు, రికవరీలు
ప్రపంచంపై కరోనా విషపు వల విసురుతూనే ఉంది. అమెరికా బ్రెజిల్, రష్యా, కొలంబియా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకుపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. రికవరీల సంఖ్య కోటీ 31 లక్షలు దాటింది. మరోవైపు రష్యాలో కరోనా మరణాల సంఖ్య 15 వేలను అధిగమించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ట్వీట్ చేయగా.. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ప్రజలను కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6. నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమలలోకి ప్రవేశం
ఈ సారి శబరిమల అయ్యప్ప సందర్శనకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో.. దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబెపై వెబ్‌సిరీస్
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబె వెబ్‌సిరీస్ త్వరలో స్మార్ట్తెరపై కనిపించనుంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కోసం అనుమతులు పొందినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8. బ్యాంకింగ్ షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లు
బ్యాంకింగ్ షేర్ల దూకుడుతో లాభాల్లో మార్కెట్లుఅంతర్జాతీయ సానుకూలతలు, బ్యాంకింగ్ రంగ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 332 పాయింట్లు మెరుగుపడి 38 వేల 514 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 11 వేల 356 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9. ఐసీసీ ఛైర్మన్ ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం
ఐసీసీ కొత్త ఛైర్మన్ ఎవరన్నదానిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. నామినేషన్ ప్రక్రియ విషయంలోనే బోర్డు సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్ల చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ పదవి కోసం కోలిన్ గ్రేవ్స్, డేవ్ కామెరాన్, ఇమ్రాన్ ఖవాజా తదితరులు రేసులో ఉన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10. ఆమిర్‌ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' విడుదల అప్పుడే!
బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.