తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు - top news in telangana

top news
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

By

Published : Dec 15, 2021, 5:44 AM IST

Updated : Dec 15, 2021, 9:56 PM IST

21:42 December 15

టాప్​ న్యూస్​ @ 10 PM

  • మీడియాపై కేంద్ర మంత్రి అజయ్​ మిశ్ర ఫైర్

లఖింపుర్ ఖేరీ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తుపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని దుర్భాషలాడారు. మైక్‌ ఆఫ్‌ చేయు అంటూ ఓ విలేకరిని తోసేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

  • ఆ మార్గంలో ట్రాఫిక్​జాం

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్‌ దండుమల్కాపురం వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి. దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతుల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయినట్లు తెలుస్తోంది.

  • ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం!

ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు సమాచారం. లింగ భేదంతో సంబంధం లేకుండా.. సర్వీసులో ఉన్న వారి భాగస్వామి కూడా సర్వీసు అధికారుల విధంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్లమెంటు ముందుకు రానున్న ఈ బిల్లులో.. నాలుగు కీలక అంశాలను చేర్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

  • ఆ బ్యాంకులకు ఆర్​బీఐ షాక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆర్​బీఐ భారీ జరిమానా విధించింది. నియంత్రణపరమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకే ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.

  • ఐపీఎల్​లో ఆ జాబితాలోకి నరైన్

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త రికార్డు సాధించాడు. రూ. 100 కోట్లు సంపాదించిన రెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

20:43 December 15

టాప్​ న్యూస్​ @ 9PM

  • మళ్లీ తెర మీదికి రుణ యాప్‌ల కేసు

సంచలనం సృష్టించిన రుణయాప్​ల కేసు మరోసారి తెరమీదికొచ్చింది. ఈ కేసులో మరో రూ.51 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. గతంలో పీసీ ఫైనాన్షియల్‌కు చెందిన రూ.238 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ.. అదే సంస్థకు చెందిన రూ.51 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

  • ఆవిష్కరణలకు ఊతం

సెమీకండక్టర్స్​ తయారీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న నిర్ణయం.. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించటంతోపాటు.. తయారీని పెంచుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రూ.76వేల కోట్ల పథకానికి కేబినెట్​ ఆమోదం తెలిపిన క్రమంలో ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమాన్ని ఇది బలోపేతం చేస్తుందని ట్వీట్​ చేశారు.

  • 12 మంది సీఎంల ఎదుటే నదిలో దూకిన యువతి

ఓ వైపు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదిలో పూజలు చేస్తుండగా.. వారి ఎదుటే నీళ్లలోకి దూకింది ఓ యువతి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో జరిగింది.

  • బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) తెలిపింది. సమ్మె ప్రభావంతో పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వినియోగదారులను హెచ్చరించాయి బ్యాంకులు.

  • 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. భాయ్​కు ఆహ్వానం!

ధనాధన్ ప్రచారంతో దూసుకుపోతున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్​ స్టార్ హీరో, దర్శకుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

19:44 December 15

టాప్​ న్యూస్​ @ 8PM

  • జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈనెల 17 నుంచి వరుసగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి చర్చించనున్నారు. అనంతరం జిల్లాల పర్యటకు వెళ్లనున్నారు.

  • 'వారికి భారత్​ సొంత ఇంటిని ఇచ్చింది'

కోటి మంది శరణార్థులకు మద్దతుగా నిలబడి వారికి భారత్​ సొంత ఇంటిని ఇచ్చిందని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. బంగ్లాదేశ్​ విముక్తి పోరాట వేడుకల్లో పాల్గొన్న ఆమె.. ఇందిరా గాంధీ ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు.

  • కోవింద్​తో బంగ్లా ప్రధాని భేటీ

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యారు బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

  • ఆన్​లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీల రీఫండ్

తరచూ డిజిటల్​ చెల్లింపులు చేసే వారికి గుడ్​న్యూస్​. డిజిటల్​ చెల్లింపులపై వసూలైన ఛార్జీలను రీఫండ్​కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 1300 కోట్లు కేటాయించింది.

  • 'లైగర్​' కొత్త అప్డేట్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో యశోద, లైగర్, ఎటాక్, గూడుపుఠాణీ, ఓ డామిట్ డేవిడ్​రాజుకి పెళ్లైపోయింది చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

18:53 December 15

టాప్​ న్యూస్​ @7PM

  • తెలుగు అకాడమీ కేసులో పురోగతి

తెలుగు అకాడమీ కేసులో ఎట్టకేలకు కొంత పురోగతి కనిపించింది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. 10 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడానికి కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించారు.

  • ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్

దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బంగాల్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 60కి చేరింది.

  • గేమ్​ ఆడుతూ 'ఐస్​క్రీం' ఆర్డర్​- ఆ తర్వాత

గేమ్​ ఆడుతూ ఆన్​లైన్​లో ఓ ఫుడ్​ ఆర్డర్ పెట్టాడు ఐదేళ్ల కుర్రాడు. ఇందుకోసం తండ్రికి తెలియకుండా.. క్రెడిట్​ కార్డు వాడాడు. ఆర్డర్​ డెలివరీ సమయంలో బిల్లు చూసిన పిల్లాడి తండ్రికి చచ్చినంత పనైంది. ఏకంగా 1200 డాలర్లు(రూ. 91 వేలకుపైనే) బిల్లు వచ్చింది మరీ. అసలేమైందంటే..?

  • వాట్సాప్​ నుంచే జియో రీఛార్జ్

వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఫేస్​బుక్ మాతృ సంస్థ మెటాతో జట్టుకట్టింది జియో. మరోవైపు.. వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జియోమార్ట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్.

  • టెస్టు రిటైర్మెంట్​పై జడేజా క్లారిటీ

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు జట్టుకు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించాడు జడ్డూ. ఇప్పుడప్పుడే టెస్టు జట్టును వీడనని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశాడు.

17:40 December 15

టాప్​ న్యూస్​ @6PM

  • ఈనెల 18న మంత్రులు, కలెక్టర్లతో సీఎం భేటీ

ఈనెల 18న మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దళిత బంధు తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొననున్నారు.

  • కశ్మీర్​లో మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

కశ్మీర్​లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మోస్ట్ ​వాంటెడ్​ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. అతడ్ని.. పోలీసులు, పౌరులపై పలు దాడులు చేసిన హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రవాది ఫిరోజ్​ అహ్మద్​గా గుర్తించారు.

  • నాలుగో రోజూ నష్టాలే

దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్​ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయింది. ​చివరకు 329 పాయింట్లు నష్టపోయి 58వేల కిందికి దిగొచ్చింది.

  • బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా తప్పుకొన్న సమయంలో తనను సారథిగా ఉండమని తనకు ఎవరూ చెప్పలేదని విరాట్​ కోహ్లీ అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా విరాట్​ ఈ మాటలు అన్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • సుశాంత్ 'చిచ్చోరే' చైనాలో రిలీజ్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కురుప్, చిచ్చోరే, బ్రహ్మస్త్ర, హ్యాపీ బర్త్​డే చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

16:49 December 15

టాప్​ న్యూస్​ @5PM

  • సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సంయుక్త సమావేశం

ఎల్లుండి మధ్యాహ్నం 2 గం.కు తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు హాజరుకానున్నారు.

  • 'ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలి'

రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. మాస్కు మాత్రమే మనుషులను కాపాడగలదన్న డీహెచ్.. ఒమిక్రాన్ అంత భయంకరమైనది కాదని వివరించారు.

  • కిమ్​ జోంగ్ ఉన్​ తాత మృతి

ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్​ ఇల్​ సంగ్​ సోదరుడు, వర్కర్స్​ పార్టీ కీలక నేత కిమ్​ యోంగ్​ జు మృతి చెందారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు ప్రస్తుత అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.

  • జియో సూపర్ ఆఫర్

మార్కెట్లోని మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్న టెలికాం దిగ్గజం మరో ఆఫర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను తెచ్చింది. దీనితో 100ఎంబీ డేటాను పొందొచ్చు.

  • బాలయ్యతో రాజమౌళి సినిమా..!

అభిమానుల మనసులో ఎప్పటినుంచో ఉన్న ప్రశ్నను బాలయ్య.. స్టార్ డైరెక్టర్ రాజమౌళిని అడిగారు. తమ కాంబినేషన్​లో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే?

15:43 December 15

టాప్​ న్యూస్​ @4PM

  • 'ఒమిక్రాన్ వచ్చేసింది.. జాగ్రత్తగా ఉండాలి'

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగే అంచనాలున్నాయని... నిపుణులు సూచించిన జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఇప్పటికే 2 ఒమిక్రాన్‌ కేసులు బయటపడినందున.... అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 'లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమే'

లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లఖింపుర్​ ఖేరీ ఘటన జరిగిందన్న సిట్ నివేదికను ఆయన​ సమర్థించారు.

  • హెల్ప్ చేయమంటూ ఆమెపై అత్యాచార యత్నం

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి చెప్పుల దండ వేసి గ్రామస్థులు దండించిన ఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా బొమ్మనలా గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 55 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • జట్టులోకి అండర్సన్​.. ఇంగ్లాండ్​ టీమ్​ ఇదే

Ashes 2nd test 2021: యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

  • ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. సరికొత్త రికార్డు

అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఆరు రోజుల్లో 100 మిలియన్​ వ్యూస్​ సొంతం చేసుకున్న ప్రచార చిత్రంగా నిలిచింది.

14:54 December 15

టాప్​ న్యూస్​ @3PM

  • హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్​ తమిళనాడు పర్యటన ముగించుకుని హైదరాబాద్​ చేరుకున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు.

  • సొంత చెల్లినే వివాహమాడిన అన్న

Brother Married His Sister: సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. ఈ పెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో జరిగింది.

  • ఐఓఎస్​లో అదిరే అప్డేట్​

iOS 15.2 features: యాపిల్ ఐఓఎస్ 15.2 వెర్షన్ విడుదలైంది. కొత్తగా అనేక అప్​డేట్లను తీసుకొచ్చింది. ప్రైవసీ రిపోర్ట్స్​, మ్యూజిక్ ప్లాన్, షేర్​ ప్లే, లెగసీ కాంటాక్ట్స్ ఫీచర్లను తీసుకురావడం సహా.. పలు బగ్స్​ను తొలగించింది.

  • 'షునెల్'​ సీఈఓగా భారతీయురాలు

ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు భారతీయులు వరుసగా సీఈఓలుగా ఎంపికవుతున్నారు. ఇటీవల సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​ సీఈఓగా పరాగ్ అగర్వాల్​ పగ్గాలు చేపట్టగా.. తాజాగా భారత సంతతికే చెందిన లీనా నాయర్​(52) ఈ జాబితాలో చేరారు. షునెల్​ గ్లోబల్​ సీఈఓగా ఆమె నియామకం అయ్యారు.

  • 'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపాడు.

13:49 December 15

  • వాగులో పడిన ఆర్టీసీ బస్సు.. 8మంది మృతి

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు వాగులో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

  • మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. బత్తినపల్లి, ఎర్రంపాడు మధ్య మందుపాతర పేలి గ్రేహౌండ్స్‌ ఆర్‌ఎస్‌ఐకు గాయాలయ్యాయి.

  • అన్నదాతల విజయయాత్ర

దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన రైతులు.. విజయ యాత్రగా ఇళ్లకు బయలుదేరారు. గాజియాబాద్​, కౌశాంబి సహా పలు నిరసన ప్రదేశాలను ఖాళీ చేసిన రైతులు.. నృత్యం చేసి ఊరేగింపుగా ఇళ్లకు బయల్దేరారు. బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​ సహా అన్నదాతలంతా స్వస్థలాలకు తరలిపోతున్నారు.

  • మూగజీవాల మృత్యుఘోష

Kenya Drought: కెన్యాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాగేందుకు చుక్కనీరు లేక వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎక్కడికక్కడే కుప్పకూలి విగతజీవులుగా మారిపోతున్నాయి. ప్రాణాలు కోల్పోయి గుంపులు గుంపులుగా పడి ఉన్న జిరాఫీల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

  • 'నా ఇల్లు కరోనా హాట్​స్పాట్​ కాదు'

12:43 December 15

టాప్​ న్యూస్​ @1PM

  • మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలింపుపై సీజేకు 132 మంది విద్యార్థులు లేఖ రాశారు. ఐటీఐ భూమిని కంపెనీలకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేయగా.. లేఖను సుమోటో పిల్‌గా స్వీకరించిన సీజే ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • మృత్యువుతో పోరాడి ఓడిన వరుణ్​సింగ్​

హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన గ్రూప్​ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతిచెందారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

  • ఆ ఉద్యోగులకు సుప్రీంలో ఊరట

SC on relieved employees: ఆంధ్రా నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన 12 మంది ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు రిలీవ్​ అయిన ఉద్యోగులకు 3 వారాల్లోపు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని ఇరు తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్‌ జీతాలపై ఉద్యోగులు సుప్రీంను ఆశ్రయించారు.

  • గర్ల్​ఫ్రెండ్స్​కు గిఫ్టుల కోసం దొంగలైన వైద్య విద్యార్థులు

medicine students stole rings: డాక్టర్లై రోగులకు చికిత్స చేయాల్సిన వారే దొంగతనాలకు అలవాటు పడ్డారు. ప్రియురాలికి కానుకలు ఇవ్వడానికి నగల దుకాణాల్లో ఉంగరాలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కి.. కటకటాల పాలయ్యారు.

  • మహిళా కామెంటేటర్ డబుల్ మీనింగ్ డైలాగ్

Isa Guha Commentary: ప్రస్తుతం జరుగుతున్న బిగ్​బాష్​ లీగ్​లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ మహిళా కామెంటేటర్​ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్​కు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

11:39 December 15

టాప్​ న్యూస్​ @12PM

  • రాష్ట్రంలో తొలిసారిగా ఒమిక్రాన్​ కేసులు

తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • 'సెక్స్‌ వర్కర్లకు రేషన్‌ ఇవ్వండి'

SC on Sex workers: రేషన్​ కార్డులు కూడా లేకుండా రోడ్డునపడ్డ సెక్స్ వర్కర్లను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా రేషన్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వారికి సాయం చేయాలని కేంద్రానికి సూచించింది.

  • టోర్నడో బీభత్సం- ఎటుచూసినా మోడుబారిన చెట్లే..

Tornado in America: అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టోర్నడో ధాటికి తీవ్రంగా ప్రభావితమైన కెంటకీ రాష్ట్రంలో పలు ఇళ్లు, భవనాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. డాసన్​స్పింగ్​ పట్టణంలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చిందరవందరగా పడిన తమ సామగ్రిని వెతుక్కుంటున్నారు బాధితులు. చెట్లు కొమ్మలు విరిగి.. మోడుబారిపోయాయి. ఎటు చూసిన విషాద దృశ్యాలే తారసపడుతున్నాయి.

  • గూగుల్​ సంచలన నిర్ణయం

Google Employees: కొవిడ్​ వ్యాక్సినేషన్​ పాలసీని పాటించని ఉద్యోగులను తొలగించడం లేదా జీతాల్లో కోతలు విధించనున్నట్లు గూగుల్​ తెలిపింది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

  • బాలయ్యతో జక్కన్న, కీరవాణి సందడి

Rajamouli in Unstoppable with NBK: బాలయ్య టాక్​ షోలో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్​ చేసింది ఆహా. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

10:51 December 15

టాప్​ న్యూస్​ @11AM

  • హెల్మెట్​, స్టెతస్కోప్​లో రూ. 13 కోట్ల డ్రగ్స్!

Mumbai NCB Drugs: ముంబయిలో రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.13 కోట్ల విలువైన మత్తుపదార్థాలను ఎన్​సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్టెతస్కోప్, హెల్మెట్ వంటి పరికరాల్లో డ్రగ్స్​ను దాచి విదేశాలకు పంపేందుకు నిందితులు ప్రయత్నించినట్లు చెప్పారు.

  • విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ అరెస్ట్​

ACB Raids on EX DSP: హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో అనిశా సోదాలు నిర్వహించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దాడులు చేసింది. విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ బంధువుల ఇళ్లలోనూ అనిశా తనిఖీలు చేసి.. జగన్​ను అరెస్ట్ చేశారు.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా తగ్గింది. పసిడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.716 దిగొచ్చింది.

  • మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్​

Womens World Cup 2022: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళల ప్రపంచకప్-2022 పూర్తి షెడ్యూల్​ను ప్రకటించింది ఐసీసీ. ఈ టోర్నీ మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనుంది. తొలి మ్యాచ్​లో న్యూజిలాండ్​తో వెస్టిండీస్​ తలపడనుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్​లోనే దాయాది జట్టు పాకిస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

  • రామోజీఫిల్మ్​సిటీలో 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్​ ఈవెంట్​!

RadhyeShyam Trailer: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ చిత్రం ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను ఈ నెల 23న రామోజీ ఫిల్మ్​సిటీలో భారీగా నిర్వహించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట! అదే రోజున ట్రైలర్​ కూడా రిలీజ్​ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

09:46 December 15

టాప్​ న్యూస్​ @10AM

  • స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

India Covid cases: భారత్​లో తాజాగా 6,984 మందికి కరోనా సోకింది. మరో 247 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు. ఒక్కరోజే 8,168 మంది వైరస్​ను జయించారు.

  • కరోనా విలయం

US Covid Death Toll: ప్రపంచంలో అమెరికా అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసింది. కొవిడ్​ మృతుల సంఖ్య మంగళవారం 8 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన 5.3 మిలియన్ల మరణాలలో 15 శాతం కేవలం అమెరికాలోనే నమోదయ్యాయి.

  • నష్టాల్లో మార్కెట్లు

Stock Market: అంతర్జాతీయంగా మిశ్రమ పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 155 పాయింట్లు కోల్పోయి 57 వేల 960 వద్ద కొనసాగుతోంది.

  • రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

IND vs SA Series: దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలవాలని ఆత్రుతతో ఉంది టీమ్ఇండియా. కానీ ఈ సిరీస్​కు ముందే కోహ్లీసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు. దీంతో ఇతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తిగా మారింది.

  • కథ నచ్చితే మల్టీస్టారర్​కు రెడీ

Akhanda Team visit Indrakeelardi: ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని అఖండ చిత్ర బృందం దర్శించుకుంది. బాలకృష్ణ, బోయపాటి.. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శకులు మంచి కథతో వస్తే.. మల్టీస్టారర్‌ చేస్తానని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

08:48 December 15

టాప్​ న్యూస్​ @9AM

  • న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

Bomb Threat Today: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో రైల్వే, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో కర్ణాటక ఎక్స్​ప్రెస్​ను నిలిపేసి.. బాంబు స్క్వాడ్​తో కలిసి పోలీసుల తనిఖీలు చేశారు.

  • ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం

Suicide Attempt: ఆ మహిళకు పిల్లలు ఉన్నారు. కానీ మరో యువకుడితో పరిచయం హద్దులు దాటింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం వారిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు.. కట్టుదాటారు. తమ పెళ్లికి అడ్డంకులు వస్తాయని అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది.

  • 'కెనాల్​ మ్యాన్'​ జలయజ్ఞం

Canal Man of India: బిహార్​కు చెందిన కెనాల్​ మ్యాన్​ గుర్తున్నారా? అదేనండి 30 ఏళ్లు శ్రమించి గ్రామం కోసం ఒక్కడే కాలువ తవ్విన లాంగీ భూయాన్. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్రా మెప్పు పొందిన ఈయన ఇప్పుడు మరో కాలువ తవ్వేందుకు నడుం బిగించారు. వృద్ధాప్యంలోనూ కెనాల్​ మ్యాన్​ సాహసం, సంకల్పాన్ని చూసి స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు.

  • మోన్​ మారణకాండకు బాధ్యులెవరు?

Nagaland killings: నాగాలాండ్​లో భద్రతా బలగాల దుశ్చర్య వల్ల 13 మంది పౌరులు దుర్మణం పాలయ్యారు.దీనిపై భారతీయ సమాజంతో పాటు అధికార యంత్రాంగం స్పందించిన తీరు అసంబద్ధంగా ఉందన్నది నిపుణుల వాదన. అలాగే నాగాలాండ్‌లో శాంతి నెలకొని ఉంటే మోన్‌ మారణకాండ సంభవించి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం సాగదీసే కొద్దీ- స్థానికులు, సైన్యం మధ్య సంఘర్షణలు ఇంకా పెచ్చరిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. తిరుగుబాటుదారులతో సంప్రదింపులను వేగంగా పూర్తిచేసి, నాగా సమస్యను సత్వరం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

  • టెస్టులకు జడేజా గుడ్‌బై?

Ravindra Jadeja: టీమ్ఇండియా అభిమానులకు నిరాశ. స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్​బై చెప్పాలని చూస్తున్నాడట. వన్డే, టీ20 ఫార్మాట్లో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు తెలిపాడు.

07:50 December 15

టాప్​ న్యూస్​ @8AM

  • రూ.3520 కోట్ల మోసం

Karvy Scam: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలపై నాంపల్లి కోర్టులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు అభియోగ పత్రాలను సమర్పించారు. మదుపరుల షేర్లు తమవేనంటూ కార్పొరేట్​ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని.. ఎనిమిదేళ్లలో 3వేల 520 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఐదువేల పత్రాలతో కూడిన సాక్ష్యాధారాలను మూడ్రోజుల క్రితం కోర్టుకు సమర్పించారు.

  • 'సాంస్కృతిక దౌత్యానికి వారధి సినిమా'

బాలీవుడ్‌ దిగ్గజం రాజ్‌ కపూర్‌ భారతీయ సినిమాను సాంస్కృతిక దౌత్యానికి వాహకంగా మార్చారని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దిల్లీలో సినీ దర్శకుడు రాహుల్‌ రావైల్‌ రచించిన 'రాజ్‌ కపూర్‌- ది మాస్టర్‌ ఎట్‌ వర్క్‌' పుస్తక ఆవిష్కరణలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

  • కొత్త ఏడాది కొలువుల జాతర

Upcoming jobs in 2022: వచ్చే ఏడాది జనవరి- మార్చి మధ్య భారీగా ఉద్యోగ నియామకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ కనిపించని నియామక సెంటిమెంట్ ఇప్పుడు ఉందని ఓ సర్వేలో తేలింది. అయితే, కరోనా కొత్త వేరియంట్ల వల్ల ఈ ప్రక్రియకు.. కొంత అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

  • టెస్టులకు జడేజా గుడ్‌బై?

Ravindra Jadeja: టీమ్ఇండియా అభిమానులకు నిరాశ. స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్​బై చెప్పాలని చూస్తున్నాడట. వన్డే, టీ20 ఫార్మాట్లో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు తెలిపాడు.

  • అబుదాబి వేదికగా ఐఫా వేడుక.. వ్యాఖ్యాతగా సల్మాన్‌

Salman Khan IIFA Awards: 22వ 'ఐఫా' వేడుకలను అబుదాబి వేదికగా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. వచ్చే ఏడాది మార్చిలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారాల వేడుకకు బాలీవుడ్​ స్టార్​ కథానాయకుడు సల్మాన్​ఖాన్​ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

06:52 December 15

టాప్​ న్యూస్​ @7AM

  • అక్కరకు రాని ఆరోగ్య ఉపకేంద్రాలు

వైద్యుల సదుపాయం లేక ఆరోగ్య ఉపకేంద్రాలు వెలవెలబోతున్నాయి. పల్లె జనం గోస పడుతున్నారు. కేవలం టీకాలు, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నెలనెలా మందులివ్వడానికే ఇవి పరిమితమవుతున్నాయి. ఏఎన్‌ఎంలు మాత్రమే అందుబాటులో ఉండడంతో.. వైద్యం కోసం ప్రజలు సుదూరంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకో లేదంటే ఆర్‌ఎంపీల దగ్గరకో వెళ్లాల్సి వస్తోంది. పాత భవనాల్లో కొనసాగుతున్న 889 కేంద్రాలను కొత్తగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టగా.. సుమారు 200కుపైగా భవనాల నిర్మాణం పూర్తయింది. వాటిని వాడుకోవడంలోనూ ఆరోగ్యశాఖ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరుపై ‘ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

  • నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

President kovind bangladesh visit: బంగ్లాదేశ్​ 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేడు బంగ్లాదేశ్​కు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ఆ దేశంలో ఆయన పర్యటించనున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత రాష్ట్రపతి చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

  • ఏడేళ్ల చిన్నారి దారుణహత్య

Panipat girl murdered: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ ఏడేళ్ల బాలిక.. అత్యంత దారుణంగా హత్యకు గురైంది. బాలిక నోటిలో రాళ్ల ముక్కలు వేసి నిందితులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

  • వచ్చే జూన్‌లో ఇండియన్‌ చెస్‌ లీగ్‌

Indian Chess League: వచ్చే ఏడాది జూన్​లో ఇండియన్ చెస్ లీగ్​ ప్రారంభం కాబోతున్నట్లు అఖిల భారత చెస్ సమాఖ్య వెల్లడించింది. ఈ లీగ్ ద్వారా భారత చెస్ ముఖచిత్రం మారబోతుందని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ తెలిపారు.

  • చైతూ వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా?

Naga Chaitanya: నాగచైతన్య-సమంత తమ వివాహ బంధానికి ముగింపు పలికినా.. ఈ జంటపై ఇప్పటికీ ఏదో రకంగా చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చైతన్య చెప్పిన మాటలు సమంతను టార్గెట్​ చేసినట్లుగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.`

05:20 December 15

టాప్​టెన్​ న్యూస్​@ 6AM

  • తెరాస ఘనవిజయం

TRS Wins MLC Election 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ విజయఢంకా మోగించింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్​లోని రెండు స్థానాలు తెరాస కైవసమయ్యాయి.

  • బలమైన కూటమి దిశగా..!

KCR Meet Stalin:సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసి పోరాడాలని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళనాడు పర్యటనలో భాగంగా స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా వివిధ అంశాలపై చర్చించారు. భాజపాను ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమనే ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు.

  • 'అప్పుడే పిల్లల్లో విశ్వాసం పెరుగుతుంది'

CJI NV Ramana: మాతృభాషలో చదువుకుంటేనే పిల్లలు చాలా విశ్వాసంతో బతుకుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తల్లులంతా పిల్లలకు మాతృభాషలోనే బోధించాలని మహిళా న్యాయవాదులకు హితవు చెప్పారు. 'మన ఆలోచనల్ని ప్రభావితం చేసేది మాతృభాషే కాబట్టి అందులో బోధన చాలా ముఖ్యం' అని తెలిపారు.

  • భద్రతా చర్యలపై నిపుణుల కమిటీ

Cs On Road Safety: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిపుణుల కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలీసు, ట్రాఫిక్‌, రవాణా శాఖ అధికారులతో సీఎస్‌ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. రోడ్డు భద్రతా చర్యలపై నిపుణుల కమిటీ సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

  • మరింత చలితీవ్రత

రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చలితీవ్రత పెరుగుతోంది. ఉదయంతో పోలిస్తే రాత్రిళ్లు చలి తీవ్రత మరీ ఎక్కువవుతోంది. రాబోయే రెండు రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్​

TS PGCET counseling: రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లోని సంప్రదాయ పీజీ కోర్సుల భర్తీకి నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఈనెల 30న రెండో విడత పీజీ సీట్లను కేటాయిస్తారు.

  • 'అద్భుత సమయం గడిపా'

తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్​.. మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​తో భేటీ అయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం

  • 'ఒమిక్రాన్‌పైనా ప్రభావవంతం!'

Pfizer Covid Pill : కరోనాపై ఫైజర్ యాంటీవైరల్‌ ఔషధం 90శాతం సమర్థవంతంగా తమ పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. అంతేకాకుండా కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పైనా ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు పేర్కొంది.

  • ఈసారి వర్చువల్​గానే!

Pre Budget Consultations: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బుధవారం బడ్జెట్ కసరత్తు మొదలు పెట్టనున్నారు. బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు.

  • వారిపై అభిమానులు ఫైర్!

IND vs SA 2021: టీమ్​ఇండియా జట్టు త్వరలోనే దక్షిణాఫ్రికాకు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ నిర్ణయాలపై మండిపడుతున్నారు.

Last Updated : Dec 15, 2021, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details