తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ప్రధాన వార్తలు - నేటి వార్తలు

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 13, 2021, 6:05 AM IST

Updated : Oct 13, 2021, 10:04 PM IST

21:58 October 13

టాప్​న్యూస్​ @ 10PM

  • అంబరాన్నంటిన సద్దుల సంబురాలు

తీరొక్క పూలను ఉయ్యాలో తీరుగా పేర్చిండ్రు ఉయ్యాలో.. పూలవనమంతా ఉయ్యాలో బతుకమ్మలో చేరి పరవశించే ఉయ్యాలో.. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో సంబురమే ఊరంతా ఉయ్యాలో.. పట్టుచీరలు ఉయ్యాలో పెయినిండా నగలు ఉయ్యాలో.. గాజుల చప్పట్లు ఉయ్యాలో గజ్జెల చిందులు ఉయ్యాలో.. ఊరుఊరంతా ఉయ్యాలో ఊరేగివచ్చింది ఉయ్యాలో..

  • మన్మోహన్​ సింగ్​కు అస్వస్థత

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్​ను దిల్లీ ఎయిమ్స్​లో చేర్చారు. జ్వరం, నీరసం కారణంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

  • తగ్గనున్న వంటనూనె ధరలు

దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్​, సోయా, సన్​ఫ్లవర్​ ఆయిల్​పై​ బేసిక్​ కస్టమ్స్​ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీంతో దేశంలో వంట నూనెల ధరలు(edible oil price) దిగిరానున్నాయి.

  • తమసోమ జ్యోతిర్గమయపై కేటీఆర్​ కామెంట్స్​

చేనేత నేపథ్య కథతో తెరకెక్కిన 'తమసోమ జ్యోతిర్గమయ' ట్రైలర్​ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

  • చేతులెత్తేసిన దిల్లీ బ్యాట్స్​మెన్​.. 

​ఐపీఎల్​ క్వాలిఫయర్స్​-2 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మెన్​ చేతులెత్తేశారు. కోల్​కతా బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 135 పరుగులతో సరిపెట్టుకున్నారు. దీంతో కోల్​కతా ముందు 136 పరుగుల స్వల్పలక్ష్యం బరిలో దిగనుంది.

20:55 October 13

టాప్​ న్యూస్​ @ 9PM

  • కేటీఆర్​కు అరుదైన గౌరవం..

మంత్రి కేటీఆర్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆంబిషన్‌ ఇండియా బిజినెస్ ఫోరం (ambition india business forum meet 2021) సమావేశంలో పాల్గొనాలని ఫ్రెంచ్​ ప్రభుత్వం (france invites minister ktr)కేటీఆర్​ను ఆహ్వానించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్​.. ఈ వేదిక ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం దక్కుతుందని తెలిపారు.

  • విస్తుపోయే విషయాలు

ప్రముఖ ఔషధ తయారీ గ్రూపు సంస్థ హెటిరో సోదాల్లో(hetero drugs it raids) తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోగస్‌ సంస్థల్లో కొనుగోళ్లు చేయడం, లాభాలు తగ్గించి, ఖర్చులు అధికంగా చూపించడం ద్వారా ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా ఐటీ అధికారులు తేల్చారు. ఇప్పటి వరకు 12 వందల కోట్లకు పైగా.. మొత్తం లెక్కల్లో చూపని ఆదాయం బయట పడగా... ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • మళ్లీ పెరిగిన కరోనా కేసులు

కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి స్వల్పంగా పెరిగింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 11,079 కేసులు వెలుగుచూశాయి. ఇక మిజోరంలో ఒక్కరోజే 12వందలకు పైగా కొవిడ్ కేసులు నమోదవడం గమనార్హం.

  • సినిమా కబుర్లు..

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. నాని కొత్త చిత్రం, పెళ్లి సందD, భీమ్లా నాయక్, రౌడీ బాయ్స్, మధురా వైన్స్ సినిమాల సంగతులు ఈ స్టోరీలో ఉన్నాయి.

  • ధోనీ క్రికెట్​ అకాడమీ ప్రారంభం

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ బెంగళూరులో ఓ క్రికెట్​ అకాడమీని(Dhoni Cricket Academy) నెలకొల్పాడు. గేమ్​ ప్లే, ఆర్కా స్పోర్ట్స్​ సంస్థలు సంయుక్తంగా ఈ అకాడమీని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా అందులో చేరిన యువ క్రికెటర్లను ఉద్దేశించి ధోనీ ఓ సందేశం పంపాడు.

19:43 October 13

టాప్​ న్యూస్​ @ 8PM

  • హైకోర్టుకు ఏడుగురు జడ్జిలు..

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు ఏడుగురు జడ్జిలను నియమిస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నాటి కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ (President Ramnath Kovind)ఆమోదం తెలిపారు. ప్రస్తుతం జిల్లా జడ్జిలుగా ఉన్న ... జి.రాధారాణి, పి. శ్రీసుధ, సి. సుమలత, పి. మాధవీదేవి, ఎన్. తుకారాంజీ, వెంకటేశ్వరరెడ్డి, ఎం. లక్ష్మణ్.. హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

  • దిల్లీ ఎయిమ్స్​కు మాజీ ప్రధాని

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్​ను దిల్లీ ఎయిమ్స్​లో చేర్చారు. జ్వరం, నీరసం కారణంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

  • ఒక్క రాత్రిలో రూ.కోటి గెల్చుకున్న ప్లంబర్​!

అదృష్టం అంటే అతడిది. ప్లంబర్​ పని చేసే వ్యక్తి.. రాత్రికి రాత్రే మిలియనీర్​గా మారాడు. అక్షరాలా కోటి రూపాయలు అతడి వశమయ్యాయి. క్రికెట్​ బెట్టింగ్​ యాప్​ డ్రీమ్​11తోనే ఇదంతా సాధ్యమైంది. ఎలా గెల్చుకున్నాడో, ఎవరిపై బెట్​ వేశాడో చూడండి.

  • పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్​ మధ్య..

పాకిస్థాన్‌ ప్రధాని‌- ఆ దేశ ఆర్మీ చీఫ్‌ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్​ఐ చీఫ్‌ మార్పుపై పాక్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి స్పష్టం చేశారు.

  • 'మా' కౌంటింగ్​పై స్పష్టత

'మా' కౌంటింగ్​పై వస్తున్న ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్​ స్పష్టతనిచ్చారు. పోలింగ్​లో(maa elections 2021) ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు.

18:44 October 13

టాప్​ న్యూస్​ @ 7 PM

  • 'కాంగ్రెస్​ను ప్రజలు తిరస్కరించారు'

సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారని ఆయన ఆరోపించారు. 2014కు ముందు లక్ష ఎకరాలకు మించి నీరందించారా అని కాంగ్రెస్​ నేతలను ప్రశ్నించారు. 80వేల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వెల్లడించారు. ఏటా ఉద్యోగాలపై సీఎం క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని తెలిపారు.

  • కాంగ్రెస్​ నేతల వీడియో వైరల్!

ఇద్దరు సీనియర్ నేతల మధ్య సంభాషణ.. కర్ణాటక కాంగ్రెస్​ను చిక్కుల్లో పడేసింది. పీసీసీ అధ్యక్షుడు శివ కుమార్​కు, అవినీతికి ముడిపెడుతూ వారు మాట్లాడుకోవడం.. భాజపాకు విమర్శనాస్త్రంగా మారింది.

  • తగ్గనున్న వంటనూనె ధరలు

దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్​, సోయా, సన్​ఫ్లవర్​ ఆయిల్​పై​ బేసిక్​ కస్టమ్స్​ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీంతో దేశంలో వంట నూనెల ధరలు(edible oil price) దిగిరానున్నాయి.

  • 'ఈసారి ఐపీఎల్​ మాదే..'

దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఈసారి ఐపీఎల్​(IPL 2021) ట్రోఫీ నెగ్గుతుందని ఆ జట్టు ప్రధాన కోచ్​(Delhi Capitals Head Coach) రికీ పాంటింగ్​ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం ఉన్న దిల్లీ జట్టుతో పోలిస్తే ఇప్పుడున్న టీమ్​కు చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడ్డాడు.

  • 'వాళ్లు కచ్చితంగా సినిమా చూడాలి'

తమ సినిమా 'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'ను(most eligible bachelor movie) థియేటర్లలో చూసి ఆనందించాలని నిర్మాత బన్నీ వాసు కోరారు. ఈ చిత్రం చూస్తే యువత దృక్పథం కచ్చితంగా మారుతుందని అన్నారు.

17:50 October 13

టాప్​ న్యూస్​ @ 6PM

  • ఆ నాలుగు రోజుల పాటు..

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14నుంచి 17 వరకు కొవిడ్​ వ్యాక్సినేషన్​(covid vaccination)ను ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అన్ని జిల్లాల డీఎంహెచ్​వోలకు ఆదేశాలు పంపించింది.

  • 'కన్నడ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. 

కర్ణాటక రాజకీయం అనూహ్య మలుపు తిరగబోతుందా? సన్నిహితులపై ఐటీ దాడుల నేపథ్యంలో భాజపా సీనియర్ నేత యడియూరప్ప కమలదళానికి షాక్ ఇవ్వబోతున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్​ సీనియర్ నేత సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న కుమారస్వామి వ్యాఖ్యలు ఇందుకు కారణమయ్యాయి.

  • బాలీవుడ్​లో సమంత..

హిందీలో తొలి సినిమాకు సమంత(samantha husband) అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో ఒక్కో చిత్రం చేస్తోంది సామ్.

  • భారత జట్టులో మార్పులు..

టీ20 ప్రపంచకప్​ కోసం ఎంపిక చేసిన ప్రధాన జట్టులో టీమ్ఇండియా ఆల్​రౌండర్​ శార్దూల్​ ఠాకూర్​ను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అక్షర్ పటేల్​ స్థానంలో శార్దూల్​ను తీసుకుంది.

  • అదరగొట్టిన విప్రో, ఇన్ఫీ

దేశీయ కార్పొరేట్​ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్​ రెండో త్రైమాసిక ఫలితాల్లో సత్తాచాటాయి. విప్రో లాభం 17 శాతం వృద్ధి చెందగా.. ఇన్ఫోసిస్​ రూ. 5 వేల 421 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది.

16:48 October 13

టాప్​ న్యూస్​ @5PM

  • ఈ దొంగల రూటే సపరేటు.. 

ఉత్తరప్రదేశ్​ నుంచి హైదరాబాద్​కు వచ్చి మరీ.. దొంగతనాలు చేస్తున్నారు. అందరు దొంగళ్లా.. వీళ్లు డబ్బు, బంగారం లాంటి వాటి పైన దృష్టి పెట్టలేదు. ఎవరికీ అనుమానం రాకుండా.. ట్రాన్స్​ఫార్మర్లలోని కాపర్​ వైర్లు దోచుకుంటున్నారు. ఏకంగా 196 ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసి.. కాపర్​ వైర్లను దొంగతనం చేసిన ముఠాలోని ఇద్దరు నిందితులు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

  •  లఖింపుర్​ ఘటనలో సిట్​ ముందుకు..

లఖింపుర్​ హింసాత్మక ఘటన కేసులో (Lakhimpur kheri case) విచారణ వేగవంతం చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​). నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రా స్నేహితుడు అంకిత్​.. సిట్​ ఎదుట బుధవారం హాజరయ్యారు.

  • దద్దరిల్లిపోయే రేంజ్​లో!

దసరాకు ఈసారి ఈటీవీ గట్టిగా ప్లాన్ చేసింది. ప్రేక్షకుల్ని టీవీలకు కట్టిపడేసేలా ప్రోగ్రాంను రూపొందించింది. అక్టోబరు 15 ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఈ ఈవెంట్​ కొత్త ప్రోమో అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది.

  • గంగూలీ మరో మూడేళ్ల పాటు..

ప్రముఖ కూల్​డ్రింక్​ కంపెనీ కోకాకోలాకు మరో మూడేళ్ల పాటు ప్రచారకర్తగా(Coca Cola India Brand Ambassador) వ్యవహరించనున్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ(Ganguly News). త్వరలోనే ఈ కాంట్రాక్ట్​ ముగియనున్న నేపథ్యంలో దాన్ని మరో మూడేళ్లు పొడిగించనున్నట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.

  • నిన్నటి వరకు ఇవి ఆనందాల లోగిళ్లు.. నేడు..

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. పొడి వాతావరణానికి బలమైన గాలులు తోడవడం వల్ల భారీగా దావానలం ఆవహించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

15:56 October 13

టాప్​ న్యూస్​ @4 PM

  • హుజూరాబాద్​ బరిలో మిగిలింది వీరే..

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ నేటి సాయంత్రం జరగనుంది. హుజూరాబాద్​ ఉపఎన్నిక బరిలో 30 మంది మిగిలారు.

  • చెంబులు పట్టుకుని మహిళల పరుగో పరుగు

ఇళ్లలో శౌచాలయాలు ఉన్నప్పటికీ.. చాలా మంది కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరు బయటకు వెళ్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో శౌచాలయాల వినియోగాన్ని(Open Defecation Free) ప్రోత్సహించేందుకుగాను మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో అధికారులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. 'లోటా దౌడ్' పేరుతో చెంబులో నీళ్లు పట్టుకుని పరిగెత్తే పోటీని నిర్వహించారు. ఇందులో 18 మంది మహిళలు పాల్గొన్నారు.

  • విష్ణును డిస్టర్బ్ చేస్తే..

ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​ రాజీనామాలు చేయడంపై 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకీ ఆరోపణలు అంటూ వ్యాఖ్యానించారు.

  • కోల్​కతా-దిల్లీ ఢీ.. 

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు (అక్టోబర్ 13) క్వాలిఫయర్-2 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది కోల్​కతా నైట్​రైడర్స్(kkr vs dc 2021). ఈ మ్యాచ్​లో గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ పరిస్థితి, రికార్డులు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

  • జీవితకాల గరిష్ఠాలకు సూచీలు

స్టాక్​మార్కెట్లు బుధవారం కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 450 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో.. 18 వేల 160 ఎగువన స్థిరపడింది.

14:40 October 13

టాప్​ న్యూస్​ @3 PM

  • కుప్పకూలిన మూడంతస్తుల భవనం

భారీ వర్షాలకు బెంగళూరులో మరో భవనం (Bangalore Building collapse) కుప్పకూలింది. ఇప్పటికే ఓ పక్కకు ఒరిగిపోయిన మూడంతస్తుల భవనం.. ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించిన వెంటనే కూలిపోయింది.

  • కార్పొరేటర్​ భర్తపై చెప్పుతో దాడి.. 

ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మొదటగా స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తారు. సమస్యను విన్నవించుకుంటారు. పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తారు. కానీ ఆ ప్రజాప్రతినిధి కుటుంబం వల్లే వారికి చిక్కులు వస్తే... ఆగ్రహావేశంలో చెప్పుతో కొడితే.. ఇలాంటి ఘటనే నిజామాబాద్​లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

  • మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ.. 

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'(Puspha movie shooting update). దీని చిత్రీకరణ చివరి దశకు చేరింది. మరో షెడ్యూల్​కు ముందున్న గ్యాప్​ను ఫ్యామిలీ టైమ్​గా మార్చుకున్నారు బన్నీ. భార్య స్నేహా, పిల్లలతో కలిసి మాల్దీవులు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

  • 'డివిలియర్స్​ను వదులుకోవాలి'

వచ్చే ఏడాది ఐపీఎల్​(IPl 2022 news)లో భాగంగా.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఏబీ డివిలియర్స్​ను వదులుకోవాల్సిందే అని టీమ్​ఇండియా మాజీ బ్యాట్స్​మన్ గౌతమ్ గంభీర్(Gambhir on RCB) అభిప్రాయపడ్డాడు. జట్టు భవిష్యత్తును మ్యాక్స్​వెల్​ నిర్దేశిస్తాడని సూచించాడు.

  • తక్కువ రిస్క్‌ కోసం..

స్టాక్ మార్కెట్లలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు.. మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అయితే వీరికోసమే 'సిప్‌ ఆన్‌ స్టాక్స్‌' (SIP in stocks) పద్ధతి అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్లలో తరచుగా వినిపించే 'సిప్​' లాంటిదే ఇది కూడా. (SIP on stocks)

13:43 October 13

టాప్​ న్యూస్​ @2PM

  • 'అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరం'

ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దశాబ్దాలుగా ఎలాంటి మార్పులు లేకుండా అవి కొనసాగడం వల్ల అనేక దేశాల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె.. హార్వర్డ్ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్​తో సంభాషణలో పాల్గొన్నారు.

  • పాముతో భార్యను చంపిన భర్తకు.. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఉత్రా' హత్య కేసు నిందితుడైన సూరజ్‌కు రెండు జీవిత ఖైదులు విధించింది కోర్టు. తన భార్య ఉత్రాను చంపడానికి విషపూరిత పామును ఉపయోగించిన కేసులో సూరజ్​ను ఇటీవల దోషిగా తేల్చిన కోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది.

  • బాత్​రూంలో బంధించి.. 

దిల్లీలో ఓ యువతిని బాత్​రూంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు.

  • 'అవకాశం ఇస్తే కొత్త జట్టుకు కెప్టెన్​గా ఉంటా'

ఐపీఎల్​-2022లో(IPL 2022 new teams) రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరనున్నాయి. అక్టోబర్ 25న ఈ ఫ్రాంచైజీల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఒక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు సన్​రైజర్స్​ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్(David warner news).

  • 'అన్నయ్య ఎప్పుడూ అలా అనుకోలేదు'

'మా' ఎన్నికలపై (Maa Elections 2021) మెగాబ్రదర్​ నాగబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నిక్లలో ఎలాంటి అక్రమాలు అయితే జరుగుతాయో.. అలాంటివే 'మా' ఎన్నికల్లో కూడా జరిగాయని అన్నారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తాను 'మా' అసోసియేషన్‌ సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు.

12:45 October 13

టాప్​ న్యూస్​ @ 1PM

25న అధ్యక్షుడి ఎన్నిక..

ఇప్పటినుంచి రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెరాస పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్​ తెలిపారు. అక్టోబర్‌ 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని ప్రకటించారు.

  • 25 ఏళ్ల కోసం పునాది... 'గతిశక్తి'

ప్రతిష్ఠాత్మక 'పీఎం గతిశక్తి' కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి ప్రణాళికలను ఈ కార్యక్రమం వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.

  •  రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్​ నేతలు

లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri Violence) హింసాత్మక ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం... రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

  • పిరియడ్స్‌ వస్తే ఊరిబయటే..

ఆడదంటే అబల కాదు.. సబల..! అవతార పురుషుడైనా అమ్మ కడుపు నుంచే పుట్టాలి...!! మగువా లోకానికి తెలుసా నీ విలువ.! అతివల గొప్పదనాన్ని తెలియచేసే ఇలాంటి సూక్తులేవీ ఆ ఊరి వారికి సుతరామూ గిట్టవు. ప్రపంచం ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా.. తాము మాత్రం పాతాళపు అగాధంలోనే జీవిస్తామంటారు ఆ గ్రామస్థులు. స్త్రీలల్లో అత్యంత సహజంగా జరిగే మార్పులనూ.. మకిలిగా చూసి.. వారిపై వివక్ష చూపుతున్న ఆ వింత గ్రామమేంటో..ఎక్కడ ఉందో తెలుసా...?

  • బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్​ ప్రెసిడెంట్​గా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీతో పాటు, విష్ణు ప్యానెల్​ సభ్యులు కూడా పాల్గొన్నారు.

11:46 October 13

టాప్​ న్యూస్​ @ 12NOON

  • ఆ పూలే ఎందుకు..?

తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను(Bathukamma festival 2021) పేరుస్తారు. ఈ పూలను ఉపయోగించడం వెనుక అద్భుత ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయనే విషయం మీకు తెలుసా...? మరి అవేంటో తెలుసుకుందాం రండి...

  • కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను డీఎంకే ఎంపీలు కలిశారు. సీఎం కేసీఆర్‌కు స్టాలిన్‌ రాసిన లేఖను డీఎంకే ఎంపీలు.. మంత్రి కేటీఆర్​కు అందజేశారు. నీట్‌ రద్దు కోరుతూ పలువురు సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు డీఎంకే ఎంపీలు ఎల్‌ఎం గోవింద్‌, వీరస్వామి  లేఖ అందజేశారు. 

  • దండిగా ఆదాయం...

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్​ పట్టణంలో ప్రయాణికుల రద్దీ ప్రారంభమైంది. ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపించింది. దసరాకు ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనం ఛార్జీలు లేవని ప్రకటించడంతో అందరూ ఆర్టీసీ బాట పడుతున్నారు. రిజర్వేషన్‌లు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

  • గతిశక్తి' ప్రాజెక్ట్​ను ప్రారంభించిన ప్రధాని

ప్రతిష్ఠాత్మక 'పీఎం గతిశక్తి' కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్​లను సైతం మోదీ ప్రారంభించారు.

  • అప్పుడే చెప్పాం..

అఫ్గానిస్థాన్​లో విస్తృతమైన సమ్మిళిత విధానం ఉండాలని ఐరాస భద్రతా మండలిలో భారత్ (India at UNSC) పేర్కొంది. ఆ దేశంలో అధికార మార్పిడి చర్చల ద్వారా జరగలేదని గుర్తు చేసింది. అఫ్గాన్ నుంచి అంతర్జాతీయ సమాజం ఏం కోరుకుంటోందో ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు, సమష్టి కృషితోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఐరాసలో భారత ఫస్ట్ సెక్రెటరీ స్నేహా దుబే అన్నారు. భారత్ ఈ దిశగా పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించిన ఏకైక జీ20 దేశం భారతేనని గుర్తు చేశారు.

10:50 October 13

టాప్​ న్యూస్​ @ 11AM

  • దసరా వేళ మాంసం ధరలకు రెక్కలు..

దసరా పండగకు ముందే మాంసం ధరలు(mutton cost in telangana) కొండెక్కాయి. సాధారణ రోజుల్లో పొట్టేలు మాంసం కిలో రూ.700-800 వరకు ఉండగా ప్రస్తుతం రూ.800- 900కు విక్రయిస్తున్నారు. మాంసం శుభ్రత, నాణ్యత, ధరల విషయంలో తగిన నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా అమ్మే ప్రమాదముంది. అసలే కరోనా(corona) ముప్పు... ఆపై పండుగ సీజన్ కాబట్టి కొనుగోలులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచింది.

  • ఏటీఎంలో మంటలు..

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ఏటీఎంలో మంటలు(Fire In Atm) చెలరేగాయి. అర్ధరాత్రివేళ ఎగిసిపడిన మంటలను చూసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏటీఎంలో చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో దగ్ధం చేశారా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

  • ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుర్లాలోని ఓ నివాస ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 25 నుంచి 30 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ భవనం పార్కింగ్ లాట్​లో ఈ ఘటన జరిగింది. ఎనిమిదో అంతస్తు వరకు మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

  • కమలంలో కలవరం!

యూపీలో ఇటీవలి పరిణామాలపై భాజపా నేతలు తలలు పట్టుకుంటున్నారు. లఖింపుర్ ఖేరి వివాదం (Lakhimpur Kheri case) సహా పలు వ్యవహారాలు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. (BJP UP election) మరికొందరు మాత్రం ఈ పరిణామాలు.. పార్టీపై, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని చెబుతున్నారు.

  • ఆఫర్​కు రాహుల్ ద్రవిడ్ నో!

రవిశాస్త్రి తర్వాత టీమ్​ఇండియా కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​(Dravid coach news) సేవలందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోచ్​ బాధ్యతలు స్వీకరించాలని ద్రవిడ్​ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. ఈ వినతిని ద్రవిడ్​(Rahul dravid as new coach) సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

09:51 October 13

టాప్​ న్యూస్​ @ 10AM

  • తెలంగాణకు గోల్డెన్ డేస్..

తెలంగాణలో ఒకేసారి మూడు వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు(Jewellery Manufacturing) ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే పరిశ్రమ నెలకొల్పేందుకు మలబార్‌ గోల్డ్‌ ముందుకొచ్చింది. దాంతోపాటు క్యాప్స్‌గోల్డ్‌, హంటన్‌ రిఫైనర్స్‌ కూడా ముందుకొచ్చాయి. ఈ మూడు సంస్థలకూ 20 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తిగా ఇంకో ఆరు సంస్థలు ఉన్నాయి.

వామ్మో.. ఇదేందయ్యా ఇది..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఊరిస్తున్నాయి. కానీ అధ్వాన రహదారుల(Damaged Roads)తో విలువైన ప్రయాణ సమయం వృథా అవుతోంది. ఒళ్లూ గుల్లవుతోంది. ఫలితంగా సందర్శకులు నిర్ణీత వ్యవధిలో కోరుకున్న ప్రదేశాలను చూడలేకపోతున్నారు.

  • పొలం లేదు.. ధాన్యం లేదు..

మామిడి తోటలో వరిసాగు చేసినట్లు ఎక్కడన్నా విన్నారా? ఖమ్మం జిల్లాలోని కొందరు అక్రమార్కులు అలా రికార్డులు సృష్టించారు. సుమారు అర ఎకరం భూమి ఉన్న రైతు నుంచి ధాన్యం కొన్నట్లు చూపి... కోటి రూపాయలు జమ చేశారు. సాగు లేదు.. ధాన్యం పండలేదు.. అంతా సవ్యంగా జరిగినట్లు రికార్డులు సృష్టించారు. లేని వరి పొలం ఉన్నట్లుగా, గుంటల విస్తీర్ణంలోని పొలాన్ని ఎకరాల్లో ఉన్నట్లు నమోదు చేశారు. ఈ మాయాజాలంతో ప్రభుత్వ ఖజానాకు రూ.పదుల కోట్లలో చిల్లు పడినట్లు తెలుస్తోంది.

  • చిరుధాన్యాలతో వంటకాలు... ఆరోగ్య సిరులు!

ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగటంతో ఇప్పుడంతా చిరుధాన్యాల మీదే దృష్టి సారిస్తున్నారు. బరువు తగ్గాలన్నా, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, గ్లూకోజు అదుపులో ఉంచుకోవాలన్నా వీటి వంకే చూస్తున్నారు. సామలు, సజ్జలు, ఊదలు, కొర్రలు వంటివి ప్రస్తుతం చాలామంది వంటింట్లో దర్శనమిస్తుండటమే దీనికి నిదర్శనం. చాలామంది వీటితో కొన్ని వెరైటీ వంటకాలు తయారు ట్రై చేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

  • మెట్టింట.. 'పుట్టింటి'పై పోరు

భారతీయురాలు కాదు.. భారత్‌ గురించి తెలియదు. కానీ, కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. బ్రిటిష్‌ వస్తువులను బహిష్కరించారు. ఇంటింటికీ తిరిగి ఖాదీ పంచారు. భారత స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లారు. భారత జాతీయోద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె.. నేెలి సేన్‌గుప్తాగా మారిన ఎడిత్‌ ఎలెన్‌ గ్రేది.

08:53 October 13

టాప్​ న్యూస్​ @ 9AM

  • అధికారుల బదిలీ..

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మ నియమితులయ్యారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శిగా సునీల్‌ శర్మకు, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శిగా కేఎస్‌ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

 

  • ఇతర రాష్ట్రాలకు తరలించండి

బొగ్గు కొరత(coal shortage in india)తో పాటు పలు రాష్ట్రాల్లో కరెంటు డిమాండు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చూపు బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని విద్యుత్కేంద్రాల(power plants)పై పడింది. 13 రోజులకు సరిపడ విద్యుత్ నిల్వలున్న కేంద్రాలు దేశం మొత్తం మీద నాలుగే ఉన్నాయి. వాటిల్లో మన రాష్ట్రంలోని భూపాలపల్లి విద్యుత్కేంద్రం(Kakatiya Thermal Power Station) ఒకటి. భూపాలపల్లి విద్యుత్​ కేంద్రంలో 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలున్నందున.. తీవ్ర కొరత ఉన్న రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బొగ్గును పంపాలని కేంద్రం ఆదేశించింది.

  • సైబర్‌ మోసాలకూ స్పెషల్ కోచింగ్‌ సెంటర్లు

సైబర్​ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు విచారణ (Rachakonda police investigation) చేపట్టారు. దీనిలో వారు ఊహించని, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయి. పదో తరగతి ఫెయిలై, ఏడోతరగతితోనే చదువు ఆపేసిన నిందితులు ఇలాంటి మోసాలు ఎలా చేయగలిగారు అనే అంశంపై పోలీసులు తలామునకలయ్యారు. ఈ నేపథ్యంలో నిందితుల సొంత ఊరికి వెళ్లగా.. పోలీసులు (Rachakonda police investigation) కంగుతిన్నారు. ఎందుకంటే

  • ఐదుగురు పౌరులు మృతి

మణిపుర్​లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.

  • సలార్​లో సెకండ్ హీరోయిన్..

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో 'సలార్' చిత్రం(Salaar Movie Updates) రూపొందుతోంది. ఇందులో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ కనిపించనుండగా.. ఓ ప్రత్యేక గీతం కోసం మరో నాయికను (Salaar Heroine Updates) చిత్ర బృందం ఎంపిక చేసింది. 'ఖిలాడీ​' భామ మీనాక్షి చౌదరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

07:43 October 13

టాప్​ న్యూస్​ @ 8AM

  • ఇవాళా, రేపా..?

తెలంగాణ పూలపండగ బతుకమ్మ (Bathukamma festival) ముగింపు ఉత్సవాలకు రంగం సిద్ధమయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ( Saddula Bathukamma celebrations) జరగనున్నాయి.

  • నాకసలు దాని అర్థమే తెలియదు!

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ (RTC MD Sajjanar)ను కమిషన్​ రెండో రోజూ విచారించింది. ఎన్​కౌంటర్, ఆ తర్వాత పోస్టుమార్టం, మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది. ఏమి అడిగినా తనకు తెలియదనే జవాబు రావడంపై కమిషన్​ అసహనం వ్యక్తం చేసింది.

  • ఏలియన్స్ పిలుస్తున్నాయి..

సౌర కుటుంబానికి సుదూరంలో ఉన్న నక్షత్రాల నుంచి రేడియో సంకేతాలను (Radio Signals from Space) ఖగోళ శాస్త్రవేత్తలు పసిగట్టారు. దీన్ని బట్టి ఆ నక్షత్రాల చుట్టూ గ్రహాలు దాగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

  • నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు..

ఇంటర్నెట్‌ లేకున్నా, ఆఫ్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు (Digital Payments India) జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆవిష్కరించింది. కొన్ని ప్రాంతాల్లో 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సంతృప్తికర ఫలితాలు రావడంతో, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. (Digital Payments without Internet)

  • ఎందుకు తప్పించారో..

సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు కెప్టెన్​గా తనను ఎందుకు తప్పించారో తెలియదని చెప్పాడు డేవిడ్ వార్నర్(Warner SRH News). కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోవడం కష్టమని పేర్కొన్నాడు.

06:44 October 13

టాప్​ న్యూస్​ @ 7AM

  • గడగడపనా పూల సంబురం..

తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలు.. గౌరమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు.. వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబురాలు. ప్రపంచంలో ఎక్కడాలేని పూలసంబురం. వానలు బాగా కురిసి నిండు కుండల్లా మారిన చెరువులు... ఆ వరుణుడి కరుణతో అందంగా విరబూసిన పూదోటలు... ఇదే సమయానికి వచ్చే తెలంగాణ బతుకు పండుగ. అచ్చమైన పల్లెపండుగ. రంగురంగుల పూలు, పసుపు, కుంకుమలతో ప్రకృతి ఆరాధించే మట్టిమనుషులు పండుగ. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు పిల్లాపెద్దా తేడా లేకుండా ఈ పూలసంబురాన్ని జరుపుకుంటారు. తొమ్మిదిరోజుల పాటు వివిధ పేర్లతో ఆ గౌరమ్మను కొలుస్తారు. ఇవాళ సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

  • వేరియంట్ల నుంచి రక్షణ

కరోనా టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు పలు రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. కొవిడ్​తో దీటుగా పోరాడే అత్యంత బలమైన రోగనిరోధకశక్తి ఉంటున్నట్టు వెల్లడైంది.

  • రైతుల సంస్మరణ సభ

లఖింపుర్ ఖేరి ఘటనలో (Lakhimpur Kheri case) మరణించిన వారిని స్మరించుకుంటూ తికోనియాలో భారీ సభ నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేశారు. ఈ సభకు (Lakhimpur Kheri news) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సహా పలువురు రైతు నాయకులు హాజరయ్యారు. (Lakhimpur Kheri incident)

  • అవన్నీ వదంతులే.. ఎవరూ నమ్మొద్దు

వాట్సాప్‌ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించిందని సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ వదంతులను నమ్మొద్దని కేంద్రం తెలిపింది.

  • వార్మప్ మ్యాచ్​లు అప్పటి నుంచే..

టీ20 ప్రపంచకప్​లో(T20 WC 2021) వార్మప్​ మ్యాచ్​లు అక్టోబరు 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా ప్రతి టీమ్​ రెండు జట్లతో తలపడనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 18న ఇంగ్లాండ్​తో.. అక్టోబర్​ 20న ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా పోటీపడనుంది.

04:25 October 13

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

  • ముసురుతున్న చీకట్లు

దేశంలో బొగ్గు నిల్వల కొరతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. పంజాబ్‌, యూపీ, కేరళ, బిహార్‌ ప్రభృత రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్లాంట్లు మూతపడగా, తక్కినవి (Coal Shortage in India) సగం సామర్థ్యంతోనే నడుస్తుండటం- పొంచి ఉన్న ముప్పును ప్రస్ఫుటీకరిస్తోంది.

  • ఎటూ తేలడం లేదు..

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏ ప్రాజెక్టులు, ఔట్​లెట్లను ఆధీనంలోకి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నేరుగా నీటిని తీసుకునే అన్ని ఔట్​లెట్లు స్వాధీనం చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ తెలిపింది. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అప్పగించేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు. విద్యుత్ కేంద్రాలు లేకపోతే గెజిట్ అమలుతో ఫలితం లేదని ఏపీ అంటోంది.

  • వాడీ వేడిగా..

హుజూరాబాద్‌ ఉపఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. లేకుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు హరీశ్​రావు సవాల్ విసిరారు. 

  • కూపీ లాగుతున్నారు..

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణంలో ప్రధాన నిందితుడు సాయికుమార్ గతపదేళ్ల కాలంతో తన ముఠాతో కలిసి​ సుమారు రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • బడి చదువులపై కరోనా పంజా

విద్యార్థుల చదువులపై కొవిడ్​ తీవ్ర ప్రభావం చూపిందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌ విద్య అభ్యసనంలో అంతరాలను సృష్టించిందని తెలిపాయి. ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే దీని పర్యవసానం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ఉండబోతుందని హెచ్చరించాయి.

  • ఆర్థిక శక్తికి సహకార యుక్తి

ఆర్థిక వ్యవస్థకు ఉతమివ్వడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే దేశంలో వీటి ఉనికిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సహకార సంఘాలను విస్తరించే దిశగా చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అంశం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • చైనాలో వర్ష బీభత్సం

ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు (China Flood News) 15 మంది మృతి చెందగా ముగ్గురు గల్లంతయ్యారు. అక్టోబర్‌ 2 నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు 10 లక్షల మందికి పైగా జనం ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు.

  • ఈవీపై టాటా దృష్టి

విద్యుత్​ వాహన విభాగానికి సంబంధించి టాటా మోటార్స్​.. టీపీజీ రైజ్​ క్లైమేట్​ సంస్థతో ఒప్పందం రూ.7500 కోట్ల కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు 18 నెలల వ్యవధిలో పలు దఫాలుగా జరుగుతాయి. మొదటి విడత పెట్టుబడుల ప్రక్రియ 2022 మార్చికి, పూర్తి పెట్టుబడులు 2022 చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది.

  • ఉప్పెనలా ఎలా వచ్చిందంటే..!

తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదు అపజయాలు.. రెండు విజయాలు.. ఇంకేముంది ఆ జట్టు పనైపోయింది.. ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే అని అంతా భావించారు. కానీ, కరోనా కారణంగా మ్యాచ్‌లు యూఏఈకి తరలడం వల్ల ఆ జట్టు దశ తిరిగింది. ఈ జట్టు వరుస ఓటముల నుంచి తేరుకుని క్వాలిఫయర్‌-2 వరకు ఎలా వచ్చిందో ఓసారి తెలుసుకుందాం..

  • ఊరుకునేది లేదు

యూట్యూబ్​ ఛానల్స్​పై యాంకర్​ అనసూయ భరద్వాజ్​ మండిపడ్డారు. తనను సంప్రదించకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని స్పష్టం చేశారు. ఎవరి జీవితాన్ని వారు జీవించనివ్వాలని హితవు పలికారు.

Last Updated : Oct 13, 2021, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details