తెలంగాణ

telangana

ETV Bharat / city

'పీఆర్‌సీపై వారంలోనే నిర్ణయం తీసుకోవాలి' - prc increment in telangana

రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరగా చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పీఆర్‌సీపై వారంలోనే నిర్ణయం తీసుకోవాలి
tngo and tgo requested telangana government to implement prc

By

Published : Jan 21, 2021, 6:44 AM IST

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో, టీజీవో సంఘాల నేతలు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కోరారు. టీఎన్జీవో, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మమత, ప్రతాప్, సత్యనారాయణ.... బీఆర్కే భవన్‌లో సీఎస్‌తో సమావేశమై.. పీఆర్‌సీపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన గడువులోగా పీఆర్‌సీని ప్రకటించాలని అభ్యర్థించారు.

2018 జులై ఒకటో తేదీ నుంచి వర్తించేలా మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ప్రకటించాలని కోరారు. పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చురుగ్గా చేపట్టి, ప్రత్యేక శ్రద్ధ చూపడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించే విధంగా చర్యలు వేగవంతం చేయడంపై ఉద్యోగుల ఐకాస తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

పీఆర్‌సీ నివేదిక వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి చర్చించాలని అభ్యర్థించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని తెలిపారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరగా చేపట్టాలన్నారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని... త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని సీఎస్‌ చెప్పినట్లు ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details