తిరుపతి ఉపఎన్నికల ప్రచారం రాజీనామాల రంగు పులుముకొంది. మరి కొద్దిరోజుల్లో ప్రచార గడువు ముగుస్తుండగా.. రెండు ప్రధాన పార్టీలు విమర్శల దాడి పెంచాయి. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం దూకుడుగా వెళ్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మూడు రోజులుగా ప్రత్యేక హోదా అంశంపై వైకాపాను ఇరుకున పెట్టేలా ప్రకటనలు చేశారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్న వైకాపా ఆ అంశాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు.
హోదా కోసం తమ ఎంపీల రాజీనామాకు సిద్ధమన్న ఆయన....మీరు సిద్ధమా అంటూ అధికార పార్టీకి సవాల్ విసిరారు. రెండ్రోజుల పాటు స్పందించని వైకాపా... హోదా సంగతి ప్రస్తావించకుండా సరికొత్త సవాల్ విసిరింది. ఉప ఎన్నికల్లో వైకాపా గెలవకపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని...మీరు ఓడితే మీ ఎంపీలు రాజీనామా చేయగలరా అంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేశారు.
హోదాపై చిత్త శుద్ధి ఉంటే రాజీనామాను సిద్ధపడాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు