తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి(ttd board meeting) సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య పెంచడంతోపాటు 85 అంశాలపై చర్చించనున్నారు. తిరుపతిలో వాహన రద్దీని నియంత్రించేందుకు గరుడ వారధి నిర్మాణాలను అలిపిరి కూడలి వరకూ విస్తరించడం, వరాహస్వామి ఆలయ వెండి వాహిలి నిర్మాణానికి 180 కిలోల వెండి కేటాయింపుపైనా చర్చించనున్నారు.
ttd board meeting: నేడు తితిదే సమావేశంలో 85 అంశాలకుపైగా చర్చ - తిరుమల తిరుపతి దేవస్థానం
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం(ttd board meeting) ఇవాళ జరగనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ttd board meeting: నేడు తితిదే సమావేశంలో 85 అంశాలకుపైగా చర్చ
తిరుమలలో కొత్తగా 1,389 సీసీ కెమేరాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి రెండు సంవత్సరాల పదవీ కాలం ఈ నెల 21తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశమే ప్రస్తుత ధర్మకర్తల మండలికి చివరి భేటీ కానుంది. ఈ సమావేశంలో గడచిన మూడు నెలల కాలంలో కొనుగోలు చేసిన నిత్యావసరాల చెల్లింపులకు ఆమోదముద్ర వేయనున్నారు.
ఇవీ చదవండి :Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!