తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. త్వరలో టైంస్లాట్​ టోకెన్లు..! - tirumala tokens news

TTD EO Dharma Reddy: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో తితిదే కీలక నిర్ణయాలను వెల్లడించింది. త్వరలోనే టైంస్లాట్​ టోకెన్లను ప్రారంభిస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఇక నుంచి తిరుపతిలోనే గదుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

TTD EO Dharma Reddy
TTD EO Dharma Reddy

By

Published : Oct 9, 2022, 7:50 PM IST

TTD EO Dharma Reddy: తిరుమలలో గదులు దొరకడం లేదని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని, అడ్వాన్స్​డ్ దర్శన టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులు.. తిరుపతిలో బస చేసి స్వామివారి దర్శనానికి రావాలని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 28 మంది భక్తులు... తమకు ఎదురైన సమస్యలను ఈవో దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో టైంస్లాట్ టోకెన్లను ప్రారంభిస్తామని, టోకెన్లు తీసుకున్న భక్తులు తిరుపతిలో గదులు పొంది రావాలని ఈవో అన్నారు. బ్రేక్ దర్శన సమయం 10 గంటలకు మార్చడం వల్ల తిరుమలలో గదుల వసతులపై భారం తగ్గుతుందన్నారు.

లడ్డూ విక్రయశాలలో కొన్నింటిలోనే లడ్డూలు ఇవ్వడం వల్ల భక్తులకు సమయం పడుతుందని అన్నింటినీలోనూ లడ్డులు విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. సెప్టెంబరు నెలలో 21.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. సెప్టెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.122.19 కోట్లు కాగా.. లడ్డుప్రసాదాల విక్రయాలు రూ.98.44 లక్షలు జరిగిందన్నారు. అన్నప్రసాదాలు 44.7 లక్షల మంది స్వీకరించారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

వైవీ సుబ్బా రెడ్డి:తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు... ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్​ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరపనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న వైభవోత్సవాలలో ప్రజలకు ఉచితంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐదు రోజులు కళాకారులతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైవీ సుబ్బా రెడ్డి వెల్లడించారు. ఐదు రోజుల పాటు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వైభవోత్సవాలు 15వ తేదీన శ్రీ వారి కళ్యాణంతో ముగియనున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్​ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details