ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే.. ముఖ్యమంత్రి తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చాకే.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని తెదేపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ.. నిరసనకు సైతం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
నేడు తిరుమలకు ఏపీ సీఎం: తెదేపా, భాజపా నేతల గృహ నిర్బంధం
ఏపీ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ తెదేపా నేతలు సీఎంను డిమాండ్ చేస్తూ.. నిరసనకు సిద్ధమవడంపై చర్యలు తీసుకున్నారు. తెదేపాతో పాటు.. కొందరు భాజపా నేతలను సైతం గృహనిర్బంధం చేశారు.
చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా, భాజపా నేతలను గృహనిర్బంధం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నిరసన కార్యక్రమాల పిలుపుతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు మరికొందరు నేతల నివాసాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేెశారు. భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డితో పాటు మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. పుంగనూరు తెదేపా ఇన్‌ఛార్జి అనీషారెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఇదీ చదవండి:భూరికార్డుల పారదర్శకత కోసమే ధరణి పోర్టల్‌కు శ్రీకారం: సీఎం