ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి సమీపంలోని నల్లమల్ల అడవిలో ఆదివారం అర్ధరాత్రి పెద్దపులి(tiger wandering srisailam forest) సంచరించింది. శ్రీశైలానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద పెద్దపులి కనిపించింది. రహదారి పక్కనున్న చెట్ల పొదల్లో ఉన్న పెద్దపులిని .. శ్రీశైలానికి వచ్చే భక్తులు, అదే మార్గంలో వెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. చెట్ల పొదల్లో ఉన్న పెద్ద పులి కాసేపటికి రోడ్డుదాటి వెళ్లిపోయింది.
- ఇటీవల తెలంగాణలోనూ పులి సంచారం కలకలం రేపిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అవి ఎక్కడంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టేకులపల్లి అటవీ పరిధిలో పులి సంచారం(tiger wandering video) కలకలం రేపుతోంది. మెట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్ వద్ద పులి రోడ్డు దాటుతుండగా అటవీ సిబ్బంది, వాహనదారులు గమనించారు. మూడురోజుల క్రితం ఓ కుక్క చనిపోగా... ఆ వాసన పసిగట్టి వచ్చినట్టు గుర్తించారు. పులి తిరుగుతున్న దృశ్యాలను వాహనదారులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అటవీశాఖ సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. మరోవైపు పాల్వంచ వన్యప్రాణి అభయారణ్యం(tiger wanders in telangana) పరిధిలో లక్ష్మీదేవి మండలంలో పశువులపై(tiger attack cattle) పులి దాడి కలకలం రేపింది. ఆవులమందపై పులి దాడి చేయడంతో ఓ ఆవు మృత్యువాత పడింది.పంచాయతీ పరిధి తోకల బంధాల గ్రామానికి చెందిన గొప్ప రఘుబాబుకు కిన్నెరసాని వద్ద కొంత స్థలం ఉంది. ఆన ఎనిమిది ఆవులను అక్కడే కట్టేయగా... శుక్రవారం సాయంత్రం సమయంలో వాగు దాటి వచ్చిన పులి... ఆ ఆవులమందపై దాడి చేసింది.