TDP flexis : మహానాడుకు వెళ్లే పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో బోయపాలెం నుంచి తాతపూడి వరకు మహానాడుకు వెళ్లే గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెదేపా ఫ్లెక్సీల తొలగింపు.. హెచ్చరించిన నేతలు - చిలకలూరిపేటలో తెదేపా ఫ్లెక్సీలను తొలగించడంపై నేతల ఆగ్రహం
TDP flexis : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో.. మహానాడుకు వెళ్లే పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగులు రాత్రికి రాత్రే కత్తిరించడంపై తెదేపా నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గుంటూరు అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ దుండగులు రాత్రికిరాత్రి కత్తిరించి వేయడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని, భవిష్యత్లో కూడా ఇదే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులు ఇలాంటి వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.