మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరలు.. అన్నింటిని కలిపి ఫ్రిజ్‌లో సర్దిపెట్టేస్తాం. అలా అన్నింటిని కలిపి ఉంచడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. విడివిడిగా ఉంచితేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అంటున్నారు.
విడివిడిగా ఉంచితే మంచిదే! - ఇంట్లో కూరగాయాల నిల్వ చేసే పద్ధతులు
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు... అన్నింటినీ ఫ్రిజ్‌లో కలిపి సర్దిపెట్టేస్తాం. అలా అన్నింటిని కలిపి ఉంచడం వల్ల లాభమా.. నష్టమా? అని తెలుకుకోవాలనుకుంటున్నారు... అయితే ఇది చదవండి.
మగ్గిన పండ్లు ఇథిలిన్ వాయువును విడుదల చేసి ఇతర పదార్థాలను కుళ్లిపోయేలా చేస్తాయి. యాపిల్‌తో సహా ఇతర పండ్లు విడుదల చేసే వాయువులు కీరను త్వరగా పాడయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటిని వీలైనంత వరకు బయట పెట్టడమే ఉత్తమం. ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే పండ్లకు దూరంగా పెట్టాలి.
వీటిని కలపొద్దు:
గుమ్మడికాయ, యాపిల్ ఈ రెండింటిని కలిపి ఒకేచోట కలిపి పెట్టొద్ధు గుమ్మడికాయ ఎంత వేడినైనా తట్టుకుంటుంది. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వ చేసుకోవచ్ఛు యాపిల్స్‌ని ఫ్రిజ్‌లో ఉంచి గుమ్మడికాయని బయట ఉంచినా ఫర్వాలేదు.