తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ - తెలంగాణలో కరోనా
తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్
15:36 March 23
తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్రంలో 97 మంది అనుమానితులు ఉన్నారని, వారి నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరి ఆరోగ్యం కుదుట పడడం వల్ల అతడిని ఇంటికి పంపేశారు.
కొత్తగా నమోదైన కరోనా కేసులు...
- p28: హైదరాబాద్ బల్కంపేటకు చెందిన విద్యార్థి(21). ఇటీవల ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చాడు.
- p29: సైదాబాద్‌కి చెందిన విద్యార్థి(30). లండన్ నుంచి వచ్చిన యువకుడు.
- p30: కరీంనగర్‌కి చెందిన యువకుడు(23). ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన బృందంతో సన్నిహితంగా ఉన్నట్టు గుర్తింపు.
- p31: ఖైరతాబాద్‌కి చెందిన యువకుడు(21). న్యూయార్క్ నుంచి వచ్చాడు.
- p32: గచ్చిబౌలికి చెందిన యువకుడు(25). లండన్ నుంచి వచ్చాడు.
- p33: కూకట్‌పల్లికి చెందిన వ్యాపారవేత్త(55). శ్రీలంక నుంచి వచ్చాడు.
Last Updated : Mar 23, 2020, 8:54 PM IST