తిరుమల(tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం 9 గంటలకే విడుదల చేయగా... 9.10 గంటల్లోపే మొత్తం టికెట్లు బుక్ అయిపోయాయి. ఈ నెల 13, 16 తేదీలకు సంబంధించిన టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జులై నెల టికెట్లు రోజుకు 5 వేలు చొప్పున విడుదల చేసింది.
సామాన్యులకు దక్కని దర్శనభాగ్యం..
4 నెలలుగా 300 నుంచి 10 వేల రూపాయల వరకు ఏదో ఒకస్థాయిలో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు మినహా.... సాధారణ ప్రజలు శ్రీవారిని దర్శించుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా రెండో దశలో(CORONA SECOND WAVE) కేసుల ఉద్ధృతి వల్ల ఏప్రిల్ 11 నుంచి తిరుమలేశుని దర్శనంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం జారీ చేసే సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల(TIMESLOT TOKENS) జారీ కేంద్రాలను అధికారులు మూసేశారు. కానీ ఆన్‌లైన్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం(KALYANOTHSAVAM), వసంతోత్సవం(VASANTHOTHSAVAM), సహస్ర దీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjitha Brahmotsavam)టిక్కెట్లను విక్రయిస్తూ దర్శనాలు కల్పిస్తోంది.