కోర్టు చెప్పిన వారాంతపు లాక్‌డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాక్‌డౌన్‌పై సీఎస్ స్పష్టత ఇచ్చారు. లాక్‌డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని తెల్చిచెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పునరుద్ఘాటించారు. లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుందని వివరించారు.
దిల్లీలో లాక్‌డౌన్ కారణంగానే రాష్ట్రానికి టెస్టింగ్ కిట్లు రావడం లేదు. లాక్‌డౌన్ కరోనా సమస్యకు పరిష్కారం కాదు. స్థానిక అవసరాలను బట్టి పొరుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా మరణాల సంఖ్యను ఏమాత్రం దాచడం లేదు. రెమ్‌డెసివిర్ వల్ల అంత ఉపయోగం లేదని వైద్యులే చెబుతున్నారు. ప్రజలు మాత్రం రెమ్‌డెసివిర్ కోసం బారులు తీరుతున్నారు. 5 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం ఆర్డర్ పెట్టాం.