రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేటి నుంచి ఈనెల 30 వరకు రాయలసీమ.. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో(Rain alert to Chittoor and Nellore) భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 13సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే సూచనలున్నాయని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అప్రమత్తమైన చిత్తూరు జిల్లా యంత్రాంగం..